హీరోయిన్ల వస్త్రధారణపై అనుచిత వ్యాఖ్యలు చేసి తీవ్ర విమర్శలు ఎదుర్కొంటున్న నటుడు శివాజీ.. తాజాగా హైదరాబాద్‌లో ప్రెస్ మీట్ పెట్టి క్లారిటీ ఇచ్చాడు. తన స్పీచ్ లో వాడిన రెండు అసభ్యకరమైన పదాలకు మాత్రమే క్షమాపణలు చెప్పిన శివాజీ.. తాను చెప్పిన అసలు పాయింట్‌కు మాత్రం కట్టుబడి ఉన్నానని స్పష్టం చేశాడు. ఇటీవల నిధి అగర్వాల్‌ను జనం చుట్టుముట్టిన ఘటనే తనను ఇలా మాట్లాడేలా చేసిందని సమర్థించుకున్నాడు. అనసూయ ఎందుకు మధ్యలో వచ్చిందని ప్రశ్నించాడు.
శివాజీ వివరణ ఇలా..

నటుడు శివాజీ హీరోయిన్ల బట్టల గురించి చేసిన కామెంట్స్ రెండు రోజులుగా సోషల్ మీడియాలో రచ్చ లేపుతున్నాయి. దీనిపై మహిళా కమిషన్ నోటీసులు ఇవ్వడం, నెటిజన్లు పాత వీడియోలు బయటపెట్టడంతో శివాజీ ప్రెస్ మీట్ పెట్టి వివరణ ఇచ్చాడు.
శివాజీ మాట్లాడుతూ.. తాను ఇన్నేళ్ళలో ఎప్పుడూ మహిళల గురించి హద్దు దాటి మాట్లాడలేదని అన్నాడు. "ఆ మాటలు నా నోటి నుంచి ఎలా వచ్చాయో నాకే తెలియదు. స్పీచ్ అయిపోయాక నేను తప్పు మాట్లాడానని అర్థమైంది. నేను వాడిన ఆ రెండు బూతు పదాలకు మనస్ఫూర్తిగా క్షమాపణలు కోరుతున్నాను. నా వల్ల నా కుటుంబం కూడా బాధపడింది. ఆ తప్పు నన్ను జీవితాంతం వెంటాడుతుంది" అని ఎమోషనల్ అయ్యాడు.
"కానీ నేను చెప్పిన అసలు విషయానికి మాత్రం కట్టుబడి ఉన్నా. అందులో వెనక్కి తగ్గేది లేదు. ఎందుకంటే అవతలి వాళ్ళను రెచ్చగొట్టడం కూడా నేరమే కదా" అని శివాజీ తన వాదన వినిపించాడు.
నిధి అగర్వాల్ సంఘటనే కారణం
తను అలా మాట్లాడటానికి ప్రధాన కారణం 'ది రాజా సాబ్' ఈవెంట్‌లో నిధి అగర్వాల్ కు జరిగిన చేదు అనుభవమే అని శివాజీ చెప్పాడు.
"లులు మాల్లో జనం మధ్యలో ఇరుక్కుపోయినప్పుడు నిధి అగర్వాల్ బట్టలు జారిపోయి ఉంటే పరిస్థితి ఏంటి? ఆ వీడియోలు జీవితాంతం సోషల్ మీడియాలో ఉండిపోయేవి కదా? ఆమె కారులో కూర్చున్నప్పుడు ఎంత ఇబ్బంది పడిందో చూశాను. ఆ ఆవేదనే నన్ను అలా మాట్లాడేలా చేసింది" అని శివాజీ అన్నాడు.
{{/usCountry}}"లులు మాల్లో జనం మధ్యలో ఇరుక్కుపోయినప్పుడు నిధి అగర్వాల్ బట్టలు జారిపోయి ఉంటే పరిస్థితి ఏంటి? ఆ వీడియోలు జీవితాంతం సోషల్ మీడియాలో ఉండిపోయేవి కదా? ఆమె కారులో కూర్చున్నప్పుడు ఎంత ఇబ్బంది పడిందో చూశాను. ఆ ఆవేదనే నన్ను అలా మాట్లాడేలా చేసింది" అని శివాజీ అన్నాడు.
{{/usCountry}}"సమంత గారి వీడియో నేను చూడలేదు కానీ విన్నాను. ఆవిడ చీర కట్టుకోవడం వల్లే సేఫ్ అయ్యారని, లేకపోతే ఇబ్బంది పడేవారని నాకు చెప్పారు. బయటకు వెళ్ళేటప్పుడు జాగ్రత్తగా ఉండండి అని చెప్పానే తప్ప.. ఎవరినీ వ్యక్తిగతంగా అనలేదు" అని సమర్థించుకున్నాడు.
అనసూయ, చిన్మయిలపై కామెంట్స్
ఈ వివాదంలో తనను విమర్శించిన అనసూయ భరద్వాజ్ గురించి కూడా శివాజీ మాట్లాడాడు. "నేను ఆమె పేరు ఎత్తకపోయినా.. ఆమె ఎందుకు ఈ గొడవలోకి వచ్చిందో తెలియదు. ఆమెకు కూడా ఎప్పుడైనా ఇలాంటి సమస్య వస్తే నేను సపోర్ట్ చేస్తాను" అని అన్నాడు. ఇక సింగర్ చిన్మయి పేరును తాను మర్చిపోయానని, సోషల్ మీడియాలో ట్యాగ్ చేస్తుంటే గుర్తొచ్చిందని సెటైరికల్‌గా మాట్లాడారు.
బిగ్ బాస్ వీడియోలపై వివరణ
బిగ్ బాస్ షోలో తోటి కంటెస్టెంట్ మెడ మీద కాలు వేసి తొక్కుతా అని అన్న వీడియోలు వైరల్ అవ్వడంపై విలేకరులు ప్రశ్నించగా.. "నాకు 50 ఏళ్లు దాటాయి. మా ఊర్లో ఆడ, మగ తేడా లేకుండా అలాగే మాట్లాడతాం. అది నా పొసెసివ్‌నెస్ తప్ప వేరే ఉద్దేశం కాదు" అని బదులిచ్చాడు. ఈ వ్యవహారంపై తెలంగాణ మహిళా కమిషన్ నుంచి తనకు నోటీసులు వచ్చాయని, తాను చేసిన తప్పుకు చట్టపరంగా ఎదుర్కోవడానికి సిద్ధమని శివాజీ తెలిపాడు.