Giri Babu: సీనియర్ నటుడు గిరిబాబు గురించి ఎవరికీ తెలియని షాకింగ్ ఫ్యాక్ట్స్.. ఆ హీరోతో రూ.40 గదిలో.. అసలు పేరు వేరు!

Giri Babu: తెలుగు చిత్రసీమలో తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్న సీనియర్ నటుడు, బహుముఖ ప్రజ్ఞాశాలి గిరిబాబు (83) నవంబర్ 14న కన్నుమూశారు. ఐదు దశాబ్దాల సినీ ప్రయాణంలో 600లకు పైగా సినిమాల్లో నటించారు. ఆయన జీవితంలో చాలా మందికి తెలియని షాకింగ్ విషయాలు ఎన్నో ఉన్నాయి. అవేంటో ఇక్కడ చూద్దాం.

Published on: Nov 15, 2026, 06:19:53 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
Copy link
  • copy link

Giri Babu: గిరిబాబు అంటే ఆయన స్క్రీన్ నేమ్ మాత్రమే. ఆయన అసలు పేరు యర్రా శేషగిరిరావు. 1943 జూన్ 8న ప్రకాశం జిల్లాలోని రావినూతల అనే గ్రామంలో ఒక సాధారణ మధ్యతరగతి వ్యవసాయ కుటుంబంలో ఆయన జన్మించారు. సినిమాల మీద ఉన్న మక్కువతో మద్రాసు రైలు ఎక్కిన ఆయన తన పేరును గిరిబాబుగా మార్చుకుని ఇండస్ట్రీలో స్థిరపడిపోయారు.

సీనియర్ నటుడు గిరిబాబు గురించి ఎవరికీ తెలియని షాకింగ్ ఫ్యాక్ట్స్.. ఆ హీరోతో రూ.40 గదిలో.. అసలు పేరు వేరు!
సీనియర్ నటుడు గిరిబాబు గురించి ఎవరికీ తెలియని షాకింగ్ ఫ్యాక్ట్స్.. ఆ హీరోతో రూ.40 గదిలో.. అసలు పేరు వేరు!

విలన్ గా ఫేమస్

చాలా మందికి తెలియని విషయం ఏమిటంటే.. గిరిబాబు ఇండస్ట్రీకి వచ్చింది విలన్ గానో, క్యారెక్టర్ ఆర్టిస్ట్ గానో కాదు. హీరో కావాలనే కోరికతో! 1973లో వచ్చిన 'జగమే మాయ' సినిమాతో ఆయన విలన్ గా పరిచయం అయ్యారు. ఆ తర్వాత కొన్ని సినిమాల్లో హీరోగా చేశారు. కానీ ఆయన గంభీరమైన కంఠం, విలక్షణమైన బాడీ లాంగ్వేజ్ చూసిన దర్శక నిర్మాతలు ఆయనకు నెగెటివ్ రోల్స్ ఎక్కువగా ఆఫర్ చేశారు. 'కురుక్షేత్రం' సినిమాలో ఆయన పోషించిన దుశ్శాసనుడి పాత్ర ఆయన కెరీర్ ను మలుపు తిప్పింది.

మోహన్ బాబుతో రూ.40 అద్దె గదిలో..

చెన్నైలో అవకాశాల కోసం తిరుగుతున్న రోజుల్లో కలెక్షన్ కింగ్ మోహన్ బాబు, గిరిబాబు ఇద్దరూ ప్రాణమిత్రులు. ఇద్దరూ కలిసి చెరో రూ.20 వేసుకుని ఒక చిన్న రూమ్ లో (నెలకు రూ.40 అద్దె) ఉండేవారు. ఇద్దరూ కలిసి ఎన్నో ఆడిషన్స్ కు వెళ్లేవారు. ఆ కష్టాల నుంచే ఇద్దరూ టాలీవుడ్ లో దిగ్గజ నటులుగా ఎదిగారు. గిరిబాబు మరణవార్త విని మోహన్ బాబు కన్నీరుమున్నీరు కావడం వారి సుదీర్ఘ స్నేహానికి అద్దం పడుతుంది.

కేవలం నటుడే కాదు

గిరిబాబు కేవలం నటనకే పరిమితం కాలేదు. ఆయనలో మంచి నిర్మాత, దర్శకుడు కూడా ఉన్నారు. 'రణరంగం', 'ఇంద్రజిత్', 'నీ సుఖమే నే కోరుకున్నా' వంటి చిత్రాలకు ఆయన దర్శకత్వం వహించారు. అలాగే 'దేవతలారా దీవించండి', 'సింహగర్జన', 'మెరుపు దాడి' వంటి భారీ చిత్రాలను నిర్మించి తన బహుముఖ ప్రజ్ఞను చాటుకున్నారు.

నవ్వించే విలన్

విలన్ గా క్రూరమైన పాత్రలు చేస్తూనే.. తనలోని కామెడీ యాంగిల్ ను కూడా బయటకు తీశారు గిరిబాబు. కమెడియన్ గా ఎన్నో సూపర్ హిట్ చిత్రాల్లో నటించి కడుపుబ్బా నవ్వించారు. ఆయన వారసత్వాన్ని అందిపుచ్చుకున్న ఆయన కుమారుడు రఘుబాబు నేడు టాలీవుడ్ లో టాప్ కమెడియన్ గా కొనసాగుతున్నారు. గిరిబాబు భౌతికంగా మన మధ్య లేకపోయినా ఆయన పోషించిన పాత్రలు ఎప్పటికీ చిరస్థాయిగా నిలిచిపోతాయనడంలో సందేహం లేదు.

  • Chandu Shanigarapu
    ABOUT THE AUTHOR
    Chandu Shanigarapu

    చందు శనిగారపు ప్రస్తుతం హిందూస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ రైట‌ర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. మీడియా రంగంలో ఎనిమిదేళ్లకు పైగా అనుభవం ఆయన సొంతం. 2025 నుంచి డిజిటల్ మీడియాలోనూ తనదైన ముద్ర వేస్తున్నారు. సినిమా వార్తలను ఎప్పటికప్పుడు అందించడం, స్పోర్ట్స్ న్యూస్ ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలను చదివించేలా ఇవ్వడం ఆయన ప్రత్యేకత. మ్యాచ్ రిపోర్ట్ లను వేగంగా అందించడం, లైవ్ అప్ డేట్స్ ఇవ్వడంలో ఆయన ముందుంటారు. చందు తన కెరీర్ లో ప్రింట్ మీడియాలో ఎక్కువగా పనిచేశారు. ప్రముఖ దినపత్రిక ఈనాడులో ఏడేళ్లకు పైగా స్పోర్ట్స్ రిపోర్టర్ గా పనిచేశారు. తన ఆర్టికల్స్ తో ఎంతోమంది యువ క్రీడాకారుల ప్రతిభను వెలుగులోకి తెచ్చారు. ప్రత్యేక ఆర్టికల్స్ తో వాళ్లకు ఆర్థిక సాయం అందేలా చూశారు. క్రికెట్ ప్రపంచకప్ లు, ఒలింపిక్స్ లాంటి మెగా టోర్నీల కవరేజీలో ఆయనకు విశిష్ఠ అనుభవం ఉంది. మల్లారెడ్డి కాలేజీ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ నుంచి చందు బీటెక్ డిగ్రీ పొందారు. ఓ వైపు టెక్నికల్ నాలెడ్జ్ తో పాటు జర్నలిజంపై ప్రేమతో మీడియా రంగంలో కొనసాాగుతున్నారు. జర్నలిజంలో డిప్లొమా చేశారు. సినిమా వార్తలను, మూవీ రివ్యూలను, ఓటీటీ విషయాలను, క్రికెట్ సమాచారాన్ని, క్రీడా సంగతులను పాఠకులకు అందిస్తున్నారు.Read More