షాకింగ్‌.. సెల‌బ్రిటీ క్రికెట్ లీగ్‌లో దారుణం.. బాత్రూమ్‌లో న‌టి వీడియోలు రికార్డు.. ఆన్‌లైన్‌లో పంపి బ్లాక్‌మెయిల్‌

షాకింగ్.. బెంగళూరులో జరిగిన సెలబ్రిటీ క్రికెట్ లీగ్ సందర్భంగా దారుణం చోటు చేసుకుంది. ఓ నటి బాత్రూమ్ కు వెళ్లగా సీక్రెట్ గా వీడియో రికార్డు చేసిన దుండగులు ఆన్ లైన్ లో పంపి బెదిరించారు.

Published on: Feb 17, 2026, 14:15:45 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

బెంగళూరులో షాకింగ్ ఇన్సిడెంట్ జరిగింది. ఓ కన్నడ నటి దారుణమైన అనుభవాన్ని ఎదుర్కొంది. ఇటీవల ఇక్కడ సెలబ్రిటీ మహిళా క్రికెట్ టోర్నమెంట్‌ జరిగింది. ఈ సందర్భంగా ఓ నటి బాత్రూమ్ వెళ్లగా ఆమె వీడియోలను సీక్రెట్ గా రికార్డు చేశారు. ఆ తర్వాత సోషల్ మీడియా ద్వారా పంపి బెదిరిస్తున్నారు. దీనిపై పోలీసు కేసు నమోదైంది.

బాత్రూమ్ లో నటి వీడియో రికార్డు
బాత్రూమ్ లో నటి వీడియో రికార్డు

ఏం జరిగిందంటే?

రీసెంట్ గా బెంగళూరులోని స్టేడియంలో సెలబ్రిటీ వుమెన్ క్రికెట్ టోర్నీ జరిగింది. కొరమంగళ ఇండోర్ స్టేడియంలో ఏర్పాటు చేసిన ఈ మూడు రోజుల ఈవెంట్‌కు ఓ కన్నడ నటి అటెండ్ అయింది. ఈవెంట్ రెండో రోజు (ఫిబ్రవరి 7న) ఆమె స్టేడియంలో ఉన్న ఓ బాత్రూమ్ లోకి వెళ్లింది. ఆమె బాత్రూమ్ లో ఉన్నప్పుడు ఓ వ్యక్తి సీక్రెట్ గా వీడియో రికార్డు చేశాడు.

ఫ్రెండ్ ఇన్‌స్టాగ్రామ్ ఖాతాకు

కన్నడ నటి బాత్రూమ్ లో ఉండగా ఓ అజ్ఞాత వ్యక్తి వీడియో తీయడం కలకలం రేపుతోంది. అశ్లీలతతో కూడిన ఆ అసభ్యరమైన వీడియోను ఆ నటి ఫ్రెండ్ ఇన్ స్టాగ్రామ్ అకౌంట్ కు ఆ వ్యక్తి పంపించాడు. ఆ ఇన్ స్టాగ్రామ్ అకౌంట్ ఆ నటిదే అని భావించి ఆ దుండగుడు వీడియో పంపించాడు. ఆ వీడియో చూసిన ఆ నటి, ఆమె ఫ్రెండ్ షాక్ అయ్యారు.

బ్లాక్ మెయిల్

ఆ వీడియో పంపించిన వ్యక్తి డబ్బుల కోసం కూడా డిమాండ్ చేశాడు. దీనిపై నటి పోలీసులకు ఫిర్యాదు చేసింది. 'వీడియోలోని కంటెంట్ అశ్లీలంగా ఉంది. వీడియోను అప్‌లోడ్ చేసిన తర్వాత ఆ అజ్ఞాత వ్యక్తులు మరిన్ని వ్యక్తిగత వీడియోలను పంపుతామని, వీడియో కాల్స్ చేస్తామని బెదిరించారు. డబ్బు అడిగారు. బ్లాక్ మెయిల్ చేశారు’’ అని ఆ కన్నడ నటి పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీనిపై పోలీసులు కేసు నమోదు చేశారు.

నిందితుల కోసం గాలింపు

డబ్బులు ఇవ్వకపోతే ఆ వీడియోలను సోషల్ మీడియాలో పోస్టు చేస్తామని బెదిరించారని ఆ నటి ఫిర్యాదులో పేర్కొంది. పెన్ డ్రైవ్‌లో ఫిర్యాదుకు సంబంధించిన ఫోటోలు, వీడియోలను పోలీసులకు సమర్పించింది. సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్‌లో IT చట్టంలోని సంబంధిత సెక్షన్లు 77, 351, 308 కింద పోలీసులు కేసు నమోదు చేశారు. నిందితుల కోసం గాలిస్తున్నారు.

నటి బాత్రూమ్ వీడియోల విషయం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. ఆ నిందితులను కఠినంగా శిక్షించాలని నెటిజన్లు డిమాండ్ చేస్తున్నారు.

  • Chandu Shanigarapu
    ABOUT THE AUTHOR
    Chandu Shanigarapu

    చందు శనిగారపు ప్రస్తుతం హిందూస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ రైట‌ర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. మీడియా రంగంలో ఎనిమిదేళ్లకు పైగా అనుభవం ఆయన సొంతం. 2025 నుంచి డిజిటల్ మీడియాలోనూ తనదైన ముద్ర వేస్తున్నారు. సినిమా వార్తలను ఎప్పటికప్పుడు అందించడం, స్పోర్ట్స్ న్యూస్ ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలను చదివించేలా ఇవ్వడం ఆయన ప్రత్యేకత. మ్యాచ్ రిపోర్ట్ లను వేగంగా అందించడం, లైవ్ అప్ డేట్స్ ఇవ్వడంలో ఆయన ముందుంటారు. చందు తన కెరీర్ లో ప్రింట్ మీడియాలో ఎక్కువగా పనిచేశారు. ప్రముఖ దినపత్రిక ఈనాడులో ఏడేళ్లకు పైగా స్పోర్ట్స్ రిపోర్టర్ గా పనిచేశారు. తన ఆర్టికల్స్ తో ఎంతోమంది యువ క్రీడాకారుల ప్రతిభను వెలుగులోకి తెచ్చారు. ప్రత్యేక ఆర్టికల్స్ తో వాళ్లకు ఆర్థిక సాయం అందేలా చూశారు. క్రికెట్ ప్రపంచకప్ లు, ఒలింపిక్స్ లాంటి మెగా టోర్నీల కవరేజీలో ఆయనకు విశిష్ఠ అనుభవం ఉంది. మల్లారెడ్డి కాలేజీ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ నుంచి చందు బీటెక్ డిగ్రీ పొందారు. ఓ వైపు టెక్నికల్ నాలెడ్జ్ తో పాటు జర్నలిజంపై ప్రేమతో మీడియా రంగంలో కొనసాాగుతున్నారు. జర్నలిజంలో డిప్లొమా చేశారు. సినిమా వార్తలను, మూవీ రివ్యూలను, ఓటీటీ విషయాలను, క్రికెట్ సమాచారాన్ని, క్రీడా సంగతులను పాఠకులకు అందిస్తున్నారు.Read More