స్టార్ హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ కు షాకింగ్ అనుభవం ఎదురైంది. ఓ అవార్డుల ఫంక్షన్లో అవమానం కలిగింది. రకుల్ ప్రీత్ చేతుల మీదుగా అవార్డు అందుకున్న ఫిట్నెస్ ఇన్ ఫ్లూయెన్సర్ లక్షయ్ జగ్గి ప్రవర్తించిన తీరు వైరల్ గా మారింది. అవార్డు తీసుకున్న తర్వాత అతను.. రకుల్ ను పట్టించుకోకుండా వెళ్లిపోయాడు.
రకుల్ ప్రీత్ కు అవమానం

రకుల్ ప్రీత్ సింగ్ కు అవమానం ఎదురైంది. తాజాగా ఆమె ఓ ప్రైవేట్ అవార్డుల ఫంక్షన్ కు చీఫ్ గెస్ట్ గా వెళ్లింది. అక్కడ కొంతమందికి అవార్డులు అందించింది. ఫిట్నెస్ ఇన్ ఫ్లూయెన్సర్ లక్షయ్ జగ్గి కూడా రకుల్ ప్రీత్ చేతుల మీదుగా అవార్డు తీసుకున్నాడు. కానీ అవార్డు తీసుకున్న తర్వాత రకుల్ ను పట్టించుకోకుండా వెళ్లిపోయాడు.
రకుల్ షాక్
అవార్డు తీసుకున్నాక లక్షయ్ జగ్గి నేరుగా వెళ్లిపోయాడు. కనీసం రకుల్ ప్రీత్ సింగ్ ముఖం కూడా చూడలేదు. ఫొటోలకు పోజు ఇవ్వలేదు. షేక్ హ్యాండ్ ఇవ్వలేదు. ఒక చిరునవ్వు కూడా నవ్వలేదు. కనీసం మాట్లాడలేదు. లక్షయ్ అలా వెళ్లిపోతుంటే రకుల్ ప్రీత్ చాలా అసౌకర్యంగా ఫీల్ అయింది. ఆమె ముఖంలో అది స్పష్టంగా కనిపించింది. ఇప్పుడీ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
యాటిట్యూడ్ ఎందుకు బ్రో?
రకుల్ ప్రీత్ సింగ్ నుంచి అవార్డు తీసుకున్న తర్వాత లక్షయ్ జగ్గి బిహేవియర్ పై ట్రోల్స్ వస్తున్నాయి. అంత యాటిట్యూట్ ఎందుకు బ్రో? అని నెటిజన్లు కామెంట్లలో ప్రశ్నిస్తున్నారు. కనీసం అవార్డుకైనా విలువ ఇవ్వాలి కదా అని అడుగుతున్నారు.
లక్షయ్ రియాక్షన్
{{/usCountry}}రకుల్ ప్రీత్ సింగ్ నుంచి అవార్డు తీసుకున్న తర్వాత లక్షయ్ జగ్గి బిహేవియర్ పై ట్రోల్స్ వస్తున్నాయి. అంత యాటిట్యూట్ ఎందుకు బ్రో? అని నెటిజన్లు కామెంట్లలో ప్రశ్నిస్తున్నారు. కనీసం అవార్డుకైనా విలువ ఇవ్వాలి కదా అని అడుగుతున్నారు.
లక్షయ్ రియాక్షన్
{{/usCountry}}అయితే అవార్డు తీసుకున్న తర్వాత తన బిహేవియర్ గురించి లక్షయ్ రియాక్టయ్యాడు. ఇదే అవార్డుల ఫంక్షన్లో తన కంటే ముందు ఓ మహిళా.. రకుల్ ప్రీత్ సింగ్ నుంచి అవార్డు అందుకుంది. అయితే ఆమెకు రకుల్ షేక్ హ్యాండ్ ఇవ్వడానికి నిరాకరించిందని లక్షయ్ చెప్పాడు.
‘‘నాకంటే ముందు ఒక మహిళా అవార్డు తీసుకోవడానికి వచ్చింది. అప్పుడు రకుల్ ప్రీత్ సింగ్ కు ఆమె షేక్ హ్యాండ్ ఇవ్వాలని అనుకుంది. కానీ అందుకు రకుల్ నిరాకరించింది. నేను కూడా రకుల్ కు షేక్ హ్యాండ్ ఇవ్వాలనుకుంటే, అప్పుడూ ఆమె నో చెప్తే ఏంటీ పరిస్థితి? నేనెందుకు అడిగి మరీ బాధపడాలి. అందునే నా అవార్డును తీసుకుని నేరుగా వెళ్లిపోయా’’ అని లక్షయ్ పేర్కొంటూ ఓ వీడియో రిలీజ్ చేశాడు.