Shrasti Verma Jani Master: టాలీవుడ్ డ్యాన్స్ అసోసియేషన్‌లో అంతర్గత విభేదాలు, వివాదాలు రోజుకో కొత్త మలుపు తిరుగుతున్నాయి. కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ చుట్టూ ఉన్న లీగల్ ఇష్యూస్ ఒకవైపు నడుస్తుండగానే, అసోసియేషన్ వేదికగా జరుగుతున్న పరిణామాలు పరిశ్రమ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారాయి. తాజాగా కొరియోగ్రాఫర్ శ్రష్టి వర్మ సంచలన ఆరోపణలు చేసింది.
శ్రష్టి వర్మ ఆరోపణలు

తాజాగా డ్యాన్సర్ల అసోసియేషన్ వివాదం నేపథ్యంలో ఓ కెమెరా ముందు కోపంగా మాట్లాడుతున్న జానీ మాస్టర్ వీడియోను శ్రష్టి వర్మ తన ఇన్ స్టాగ్రామ్ లో పోస్టు చేసింది. దీనికి క్యాప్షన్ గా శ్రష్టి రాసుకొచ్చిన వ్యాఖ్యలు ఇప్పుడు తీవ్ర దుమారం రేపుతున్నాయి.
‘‘ఈ మనిషి ప్రదర్శిస్తున్న అగౌరవ, దూకుడు ప్రవర్తన ఈనాటిది కాదు. గత నాలుగు సంవత్సరాలుగా నేను ఇలాంటి వేధింపులు ఎదుర్కొననా. అయితే, ప్రస్తుతం లీగల్ కేసు ముదురుతున్న తరుణంలో ఈ ప్రవర్తన అంతా కోర్టులో తనకు వ్యతిరేకంగా బలమైన సాక్ష్యంగా మారుతుందని అతను గ్రహించాడు’’ అని శ్రష్టి రాసుకొచ్చింది.
మైండ్ గేమ్స్
చట్టపరమైన ఇబ్బందుల నుంచి బయటపడటానికి, మీడియా దృష్టిని మళ్లించి ప్రజల్లో తనపై ఒక సానుకూల ముద్ర వేయించుకునేందుకు జానీ మాస్టర్ తీవ్రంగా శ్రమిస్తున్నారని శ్రష్టి వర్మ ఆరోపించింది. అందుకోసం రకరకాల మైండ్ గేమ్స్, ఇమేజ్ మేనేజ్‌మెంట్ వ్యూహాలను వాడుతున్నారని మండిపడింది. అయితే పబ్లిక్ నరేటివ్‌ను మార్చడానికి ఎన్ని డ్రామాలు ఆడినా అసలు నిజాలు మారవని, లీగల్ ప్రాసెస్ ద్వారా నిజానిజాలు త్వరలోనే బయటకు వస్తాయని ఆమె పేర్కొంది.
ఎదుగుదలను జీర్ణించుకోలేక
శ్రష్టి వర్మ మరో పోస్టులో ఇంకో వీడియో పోస్టు చేసింది. అందులో డ్యాన్సర్స్ అసోషియేషన్ కు చెందిన ఓ వ్యక్తి మాట్లాడారు. ‘‘బీబీ జోడీ గెలిచిన తర్వాత శ్రష్టి వర్మకు సన్మానం చేద్దామనుకున్నాం. కానీ అడ్డుకున్నారు. పాత వివాదాన్ని తెరపైకి తెచ్చారు’’ అని ఆ వ్యక్తి చెప్పారు. దీన్ని ప్రస్తావిస్తూ శ్రష్టి వర్మ ఘాటు వ్యాఖ్యలు రాసుకొచ్చింది.
{{/usCountry}}శ్రష్టి వర్మ మరో పోస్టులో ఇంకో వీడియో పోస్టు చేసింది. అందులో డ్యాన్సర్స్ అసోషియేషన్ కు చెందిన ఓ వ్యక్తి మాట్లాడారు. ‘‘బీబీ జోడీ గెలిచిన తర్వాత శ్రష్టి వర్మకు సన్మానం చేద్దామనుకున్నాం. కానీ అడ్డుకున్నారు. పాత వివాదాన్ని తెరపైకి తెచ్చారు’’ అని ఆ వ్యక్తి చెప్పారు. దీన్ని ప్రస్తావిస్తూ శ్రష్టి వర్మ ఘాటు వ్యాఖ్యలు రాసుకొచ్చింది.
{{/usCountry}}ఈ వివాదంలో కేవలం వ్యక్తిగత వేధింపులే కాకుండా, వృత్తిపరమైన అవకాశాలను దెబ్బతీసే పెద్ద కుట్ర దాగి ఉందనే విషయాన్ని శ్రష్టి వర్మ హైలైట్ చేసింది. తాను కెరీర్‌లో పురోగతి సాధిస్తూ, తన డ్యాన్స్ వర్క్‌కు పరిశ్రమ నుంచి ప్రశంసలు అందుకుంటున్న ప్రతిసారీ, TFTDDA ప్రెసిడెంట్ దానిని అస్సలు జీర్ణించుకోలేకపోతున్నారని ఆమె ఆరోపించింది.
వ్యక్తిగత కక్షలు
తన ఎదుగుదలను, వ్యక్తిగత ప్రతిష్టను మార్కెట్లో తగ్గించడమే లక్ష్యంగా వెనుక ఉండి కొన్ని శక్తులు ప్రణాళికలు రచిస్తున్నాయని శ్రష్టి వర్మ సంచలన వ్యాఖ్యలు చేసింది.
"వ్యక్తిగత కక్షలు ఏవైనా ఉంటే అవి పక్కన పెట్టాలి. కేవలం వ్యక్తిగత విభేదాల కారణంగా ఒకరి ప్రొఫెషనల్ లైఫ్‌ను, వారికి వచ్చే కెరీర్ అవకాశాలను ఎలా అడ్డుకుంటారు?" అని శ్రష్టి ప్రశ్నించింది.
ఏమైందంటే?
తాజాగా డ్యాన్సర్ల అసోసియేషన్ వ్యవహారంలో జానీ మాస్టర్, శేఖర్ మాస్టర్ మధ్య వాగ్వాదం జరిగిందనే వార్తలు వచ్చాయి. అయితే మెగాస్టార్ చిరంజీవి ఈ ఇద్దరినీ పిలిచి మాట్లాడారు. దీంతో శేఖర్ తో తనకు ఎలాంటి గొడవ లేదని జానీ చెప్పుకొచ్చాడు. చిరంజీవితో కలిసి శేఖర్, తాను లంచ్ చేసిన ఫొటోలను కూడా రిలీజ్ చేశాడు. ఈ నేపథ్యంలో శ్రష్టి వర్మ సంచలన ఆరోపణలు చేయడం హాట్ టాపిక్ గా మారింది.
ఆ కేసు
గతంలో జానీ మాస్టర్ దగ్గర అసిస్టెంట్ గా పని చేసినప్పుడు అతను వేధించాడని శ్రష్టి వర్మ ఆరోపించిన సంగతి తెలిసిందే. మరోవైపు 2024లో జానీ మాస్టర్ పై పోక్సో కేసు నమోదైంది. సైబరాబాద్ పోలీసులు అతన్ని గోవాలో అరెస్టు చేశారు. నెల రోజుల పాటు జైల్లో ఉన్న అతను.. ఇప్పుడు బెయిల్ పై బయట ఉన్నాడు.