బాలీవుడ్ ప్లేబ్యాక్ సింగింగ్‌కు స్వస్తి చెప్పాలనే అరిజీత్ సింగ్ నిర్ణయంపై ప్రముఖ గాయని శ్రేయా ఘోషల్ స్పందించింది. బ్రేక్ తీసుకోవాలనే ఆలోచన తనకూ వస్తుంటుందని చెబుతూ, అరిజిత్ తీసుకున్నది చాలా సాహసోపేత నిర్ణయమని ఆమె ప్రశంసించింది.
అరిజిత్ రిటైర్మెంట్ గురించి శ్రేయా ఘోషల్

ఇటీవల ఏబీపీ న్యూస్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో శ్రేయా ఘోషల్ మాట్లాడుతూ.. అరిజీత్ సంగీతం పట్ల ఎంత అంకితభావంతో ఉంటారో వివరించింది.
లైవ్ పెర్ఫార్మెన్స్ ప్రాముఖ్యత గురించి ఆమె చెప్పింది. ఒక ఆర్టిస్టుగా స్టేజ్ మీద పాడటమే తన అసలు గుర్తింపు అని శ్రేయా తెలిపింది. స్టేజ్ మీద లిప్-సింక్ చేయడం తనకు అస్సలు నచ్చదని, ఒకవేళ అదే చేయాల్సి వస్తే పాడటం ఆపేస్తానని స్పష్టం చేసింది.
"నేను కూడా అప్పుడప్పుడు బ్రేక్ తీసుకోవాలని అనుకుంటూ ఉంటాను. అరిజీత్ చాలా ధైర్యంగా ఆ నిర్ణయం తీసుకున్నాడు. అతడు మనసు పెట్టి సంగీతం చేస్తాడు. ఫలితం గురించి ఆలోచించడు. అతడికి సంతోషం ఇచ్చే పనే చేస్తాడు" అని ఆమె కొనియాడింది. అరిజీత్ సంగీతం పట్ల చూపే నిజాయితీ వల్లే ప్రేక్షకులు అతడిని అంతగా ప్రేమిస్తారని శ్రేయా అభిప్రాయపడింది.
శ్రేయ తన కెరీర్‌ను సంజయ్ లీలా భన్సాలీ మూవీ 'దేవదాస్' తో ప్రారంభించి, తన మొదటి పాట ‘బైరీ పియా’కు నేషనల్ అవార్డు అందుకుంది. ప్రస్తుతం ఆమె యూకే, యూఎస్ఏ, భారత్ వంటి దేశాల్లో 'ది అన్‌స్టాపబుల్ వరల్డ్ టూర్' కోసం సిద్ధమవుతోంది.
అరిజీత్ సింగ్ రిటైర్మెంట్ ప్రకటన
ఈ ఏడాది జనవరి 27న అరిజీత్ సింగ్ ప్లేబ్యాక్ సింగింగ్ నుండి తప్పుకుంటున్నట్లు ప్రకటించి అందరినీ ఆశ్చర్యపరిచాడు. "గత కొన్నేళ్లుగా నన్ను ఆదరించిన అందరికీ ధన్యవాదాలు. ఇకపై ప్లేబ్యాక్ సింగర్‌గా నేను కొత్త ప్రాజెక్టులు ఒప్పుకోకూడదని నిర్ణయించుకున్నాను. ఇది అద్భుతమైన ప్రయాణం" అని అతడు రాశాడు.
{{/usCountry}}ఈ ఏడాది జనవరి 27న అరిజీత్ సింగ్ ప్లేబ్యాక్ సింగింగ్ నుండి తప్పుకుంటున్నట్లు ప్రకటించి అందరినీ ఆశ్చర్యపరిచాడు. "గత కొన్నేళ్లుగా నన్ను ఆదరించిన అందరికీ ధన్యవాదాలు. ఇకపై ప్లేబ్యాక్ సింగర్‌గా నేను కొత్త ప్రాజెక్టులు ఒప్పుకోకూడదని నిర్ణయించుకున్నాను. ఇది అద్భుతమైన ప్రయాణం" అని అతడు రాశాడు.
{{/usCountry}}కొత్త తరం గాయకులు ముందుకు వచ్చి తనను ఇన్‌స్పైర్ చేయాలని అతడు కోరుకుంటున్నాడు. అయితే సంగీతం చేయడం మాత్రం ఆపనని, ప్రస్తుత కమిట్‌మెంట్స్ పూర్తయ్యాక బాలీవుడ్ సినిమాలకు పాడనని స్పష్టం చేశాడు.
ఇటీవలే అరిజీత్ బాలీవుడ్ నుండి బయటకు వచ్చాక తన మొదటి ఇండిపెండెంట్ సాంగ్ 'రైనా' (Raina) ను విడుదల చేశాడు. శేఖర్ రవ్జియానీ సంగీతం అందించిన ఈ పాటకు ప్రియా సరైయా లిరిక్స్ అందించారు.