Shreyas Media: శ్రేయాస్ గ్రూప్ భారీ విస్తరణ ప్లాన్.. ఏపీ, తెలంగాణాల్లో 10 వేల మంది యువతను వ్యవస్థాపకులుగా మార్చి..
Shreyas Media: మీడియా, వినోద రంగంలో అగ్రగామిగా ఉన్న శ్రేయాస్ గ్రూప్ భారీ విస్తరణకు శ్రీకారం చుట్టింది. రెండు తెలుగు రాష్ట్రాల్లో 10,000 మంది కొత్త వ్యవస్థాపకులను తయారు చేయడమే లక్ష్యంగా సరికొత్త బిజినెస్ మోడల్‌ను సంస్థ వ్యవస్థాపకులు గండ్ర శ్రీనివాస్ రావు ప్రకటించారు.
Shreyas Media: దక్షిణాది సినీ పరిశ్రమలో మూవీ ఈవెంట్స్, ప్రమోషన్స్ అనగానే అందరికీ గుర్తొచ్చే పేరు 'శ్రేయాస్ గ్రూప్'. గత 15 ఏళ్లుగా వినోద రంగంలో తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న ఈ సంస్థ.. ఇప్పుడు తన కార్యకలాపాలను ఇతర రంగాలకు కూడా భారీగా విస్తరిస్తోంది.

మీడియా, ఈవెంట్స్, స్పోర్ట్స్, రియల్ ఎస్టేట్, అగ్రి-బిజినెస్ వంటి కీలక విభాగాల్లోకి అడుగుపెడుతున్నట్లు శ్రేయాస్ గ్రూప్ వ్యవస్థాపకులు గండ్ర శ్రీనివాస్ రావు వెల్లడించారు. ఈ విస్తరణ ద్వారా కేవలం వ్యాపార వృద్ధి మాత్రమే కాకుండా, క్షేత్రస్థాయిలో వేల సంఖ్యలో యువతకు ఉపాధి కల్పించడమే తమ ప్రధాన లక్ష్యమని ఆయన పేర్కొన్నారు.
10,000 మంది వ్యవస్థాపకులే లక్ష్యం
ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లోని పల్లెలు, పట్టణాల్లో ఉన్న యువతను, ముఖ్యంగా సినిమా అభిమాన సంఘాలను ఆర్థికంగా బలోపేతం చేసేందుకు శ్రేయాస్ గ్రూప్ ఒక వినూత్న ప్రణాళికను సిద్ధం చేసింది. మొదటి దశలో 10,000 మందిని వ్యవస్థాపకులుగా (Entrepreneurs) తీర్చిదిద్దాలని సంస్థ నిర్ణయించింది.
"మేము కేవలం బిజినెస్ సామ్రాజ్యాన్ని నిర్మించడం లేదు, భవిష్యత్తు వ్యాపారవేత్తలను తయారు చేస్తున్నాం. యువత తమ సొంత ఊర్లోనే ఉంటూ, ఎటువంటి పెట్టుబడి లేకుండానే మా ప్రతినిధులుగా మారి ఆదాయాన్ని సంపాదించుకోవచ్చు" అని శ్రీనివాస్ రావు వివరించారు. ఈ మోడల్ ద్వారా రియల్ ఎస్టేట్, ఈవెంట్ మేనేజ్‌మెంట్, రిటైల్ రంగాలలో యువతకు ఉపాధి లభించనుంది.
మల్టీ-లాంగ్వేజ్ విస్తరణ, టెక్నాలజీ
శ్రేయాస్ గ్రూప్ ఇప్పటివరకు 5,000కు పైగా ఈవెంట్స్, 2,500 కంటే ఎక్కువ సినిమా ప్రమోషన్లను విజయవంతంగా నిర్వహించింది. ఇప్పుడు టాలీవుడ్ పరిధిని దాటి బాలీవుడ్, పంజాబీ, భోజ్‌పురి, ఒడియా చిత్ర పరిశ్రమల్లోకి కూడా విస్తరిస్తోంది. టెక్నాలజీ పరంగా కూడా సంస్థ ముందడుగు వేస్తోంది. 'శ్రేయాస్ ఏఐ ఫ్రేమ్స్' (Shreyas AI Frames) పేరుతో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆధారిత వీడియో ప్రొడక్షన్ స్టూడియోను ప్రారంభిస్తోంది. దీనితో పాటు 'ఎనీ టైమ్ థియేటర్' (ATT) అనే వినూత్న వినోద ప్లాట్‌ఫామ్‌ను కూడా అందుబాటులోకి తెస్తోంది.
రియల్ ఎస్టేట్, వినోద గ్రామాలు
రియల్ ఎస్టేట్ రంగంలో 'శ్రేయాస్ ఫ్యూచర్ సిటీ డెవలపర్స్' ద్వారా సంస్థ భారీ ప్రాజెక్టులను చేపట్టింది. ఖమ్మంలో 'శ్రేయాస్ వన్ సిటీ' పేరుతో మొదటి ప్రాజెక్టును ప్రారంభించింది. హైవే ఔట్‌లెట్ మాల్స్, అనుభవ ఆధారిత ప్రాజెక్టులపై సంస్థ దృష్టి పెడుతోంది.
ఇక 'శ్రేయాస్ కార్పొరేట్ క్లబ్' ద్వారా కార్పొరేట్ ఉద్యోగులకు వీకెండ్ ఫార్మింగ్, విలేజ్ టూరిజం వంటి కొత్త కాన్సెప్టులను పరిచయం చేస్తోంది. పెళ్లిళ్లు, సామాజిక వేడుకల కోసం 'శ్రేయాస్ ఉత్సవ్' పేరుతో ప్రీమియం కన్వెన్షన్ సెంటర్లు, మౌలిక సదుపాయాల కల్పనపై దృష్టి సారించింది.
సామాజిక బాధ్యత, రైతు సంక్షేమం
వ్యాపారంతో పాటు సామాజిక బాధ్యతను కూడా శ్రేయాస్ గ్రూప్ విస్మరించలేదు. 'శ్రేయాస్ ఇంపాక్ట్ ఫౌండేషన్' ద్వారా 10,000 మంది పేద బాలికల విద్యకు మద్దతు ఇవ్వాలని లక్ష్యంగా పెట్టుకుంది. దీనిలో భాగంగా మొదటి దశలో 100 మంది విద్యార్థినులను ఎంపిక చేసి సాయం అందజేస్తోంది. అలాగే 'శ్రేయాస్ ఫార్మర్ సొసైటీ' పేరుతో రైతుల కోసం ప్రత్యేక నెట్‌వర్క్‌ను నిర్మిస్తోంది. పండించిన పంటను నేరుగా వినియోగదారులకు చేరవేసేలా రైతులకు మేలు చేసే వ్యవస్థను ఏర్పాటు చేయబోతోంది.
ABOUT THE AUTHORHari Prasad Sహరి ప్రసాద్ శీలమంతుల ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. మీడియా రంగంలో 20 ఏళ్లకు పైగా సుదీర్ఘ అనుభవం కలిగిన ఆయన, డిజిటల్ మీడియాలో గత 10 ఏళ్లుగా విశేష సేవలందిస్తున్నారు. ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలు, సినిమా వార్తలను అందించడంలో ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఆయన తన అద్భుతమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. హరి ప్రసాద్ తన కెరీర్‌లో ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా వంటి మూడు ప్రధాన విభాగాల్లోనూ పనిచేశారు. హిందుస్థాన్ టైమ్స్‌లో చేరకముందు, ఆయన తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ దినపత్రికలు, టీవీ ఛానెళ్లయిన ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి వంటి సంస్థలలో కీలక బాధ్యతలు నిర్వహించారు. నవంబర్ 1, 2021న హిందుస్థాన్ టైమ్స్ తెలుగు టీమ్‌లో చేరిన ఆయన.. ప్రస్తుతం స్పోర్ట్స్ (ముఖ్యంగా క్రికెట్ అనాలసిస్), ఎంటర్‌టైన్మెంట్ సెక్షన్ల బాధ్యతలను చూసుకుంటున్నారు. ఈయన ఉస్మానియా యూనివర్సిటీ నుంచి బీఎస్సీ (కంప్యూటర్ సైన్స్) పట్టా పొందారు. సాంకేతిక పరిజ్ఞానంతో పాటు జర్నలిజంపై ఉన్న మక్కువతో జర్నలిజంలో డిప్లొమా పూర్తి చేసి, వృత్తిపరమైన నైపుణ్యాలను మెరుగుపరుచుకున్నారు. క్రీడా రంగంలో వస్తున్న మార్పులను, సినిమా ఇండస్ట్రీ అప్‌డేట్స్‌ను లోతుగా విశ్లేషించి పాఠకులకు అర్థమయ్యే రీతిలో అందించడం హరి ప్రసాద్ శైలి.Read More

E-Paper


