Dhanush Kara: ధనుష్ కర బిజినెస్ 80 శాతం పూర్తయింది, థియేటర్ల బంద్ ఉండకపోవచ్చు, ఎందుకంటే?: డిస్ట్రిబ్యూటర్ సతీష్ కుమార్

CH Satish Kumar About Dhanush Kara Release: కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్, మిమితా బైజు జోడీ కట్టిన లేటెస్ట్ మూవీ కర. విఘ్నేష్ రాజా దర్శకత్వం వహించిన ఈ సినిమా ఇవాళ విడుదల అయింది. ఈ సందర్భంగా ధనుష్ కర మూవీకి సంబంధించిన ఇంట్రెస్టింగ్ విషయాలను డిస్ట్రిబ్యూటర్ సీహెచ్ సతీష్ కుమార్ తెలిపారు.

Published on: Apr 30, 2026, 11:43:02 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

CH Satish Kumar About Dhanush Kara Release: తమిళ స్టార్ హీరో ధనుష్, బ్యూటిపుల్ మమితా బైజు జంటగా నటించిన లేటెస్ట్ మూవీ కర. కుష్మిత గణేష్ సమర్పణలో డా. ఐషరి కె. గణేష్ నిర్మించిన ఈ చిత్రానికి విఘ్నేష్ రాజా దర్శకత్వం వహించారు.

ధనుష్ కర బిజినెస్ 80 శాతం పూర్తయింది, థియేటర్ల బంద్ ఉండకపోవచ్చు, ఎందుకంటే?: డిస్ట్రిబ్యూటర్ సతీష్ కుమార్
ధనుష్ కర బిజినెస్ 80 శాతం పూర్తయింది, థియేటర్ల బంద్ ఉండకపోవచ్చు, ఎందుకంటే?: డిస్ట్రిబ్యూటర్ సతీష్ కుమార్

డిస్ట్రిబ్యూటర్ సతీష్ కామెంట్స్

కర మూవీని ఏప్రిల్ 30న అంటే, ఇవాళే విఘ్నేశ్వర ఎంటర్‌టైన్‌మెంట్స్, ఆర్ స్టార్ లాజిస్టిక్స్ తెలుగులో రిలీజ్ చేస్తున్నారు. ఈ సందర్భంగా విఘ్నేశ్వర ఎంటర్‌టైన్‌మెంట్స్ అధినేత, నిర్మాత, డిస్ట్రిబ్యూటర్ సీహెచ్. సతీష్ కుమార్ మీడియాతో చిత్ర విశేషాల్ని పంచుకున్నారు. ఆయన ఏం చెప్పారంటే..

-"మాది విశాఖపట్నం. చిన్న సినిమాల్ని కొంటూ డిస్ట్రిబ్యూషన్ స్టార్ చేశాను. ఆ తరువాత ఓ మూవీని కూడా నిర్మించాను. ‘అర్జున్ రెడ్డి’, ‘కబాలి’, ‘సింగం 3’, ‘సలార్’, ‘కాంతారా చాప్టర్ 1’ వంటి సినిమాల్ని ఉత్తరాంధ్రలో డిస్ట్రిబ్యూషన్ చేశాను. ధనుష్ గారి ‘ధర్మయోగి’ సినిమాని తెలుగులో రిలీజ్ చేశాను. ప్రొడక్షన్‌లోనూ మంచి సినిమాల్ని చేయాలని అనుకుంటున్నాను. ఈ ‘కర’ మూవీ కోసం నా స్నేహితుడు రాజేష్ సపోర్ట్ తీసుకున్నాను."

ఇడ్లీ కొట్టును సరిగా ప్రమోట్ చేయలేదు

-"ధనుష్ గారికి మంచి మార్కెట్ ఉంది. ఇందులో మంచి కంటెంట్ ఉందని నాకు నమ్మకం ఉంది. ఈ మూవీ గొప్ప విజయాన్ని సాధిస్తుందనే నమ్మకం ఉంది. అందుకే ఈ సినిమాని తెలుగులో రిలీజ్ చేస్తున్నాను. ‘కుబేర’ మంచి విజయం సాధించింది. ‘ఇడ్లీ కొట్టు’ని తెలుగులో సరిగ్గా ప్రమోట్ చేయలేదనిపిస్తుంది. ‘రాయన్’ తెలుగు వారికి రీచ్ అయింది. ఈ ‘కర’ మూవీని నా శక్తి మేరకు తెలుగు ప్రేక్షకుల వద్దకు తీసుకు వెళ్తాను."

-"ధనుష్ సినిమా అంటే చాలా మంది పోటీ పడతారు. కానీ, నేను పర్సనల్‌గా కేర్ తీసుకుని నిర్మాత గణేష్ గారిని అప్రోచ్ అయ్యాను. నా ప్రయత్నం చూసి ఈ చిత్రాన్ని నాకు ఇచ్చారు. 80 శాతం బిజినెస్ ఆల్రెడీ కంప్లీట్ అయింది."

-"సాధారణ ప్రేక్షకులందరికీ ఈ చిత్రం కనెక్ట్ అవుతుంది. ఓ సాధారణ మనిషికి ఎదురయ్యే సమస్యల్ని చాలా స్ట్రాంగ్ కంటెంట్, ఎమోషనల్ కంటెంట్‌తో ‘కర’ రాబోతోంది. నేను ఇంకా తెలుగు వర్షెన్‌ను చూడలేదు. మ్యాగ్జిమం ఎవ్వరూ కూడా సినిమాని అలా ముందే చూపించరు."

600కిపైగా స్క్రీన్లు

-"నైజాంలో దిల్ రాజు గారు డిస్ట్రిబ్యూట్ చేస్తున్నారు. అలా ఒక్కో ఏరియాలో ఒక్కొక్కరికి ఇచ్చాం. నేను ఉత్తరాంధ్ర ఏరియాకి డిస్ట్రిబ్యూట్ చేస్తున్నాను. దాదాపు 400కు పైగా స్క్రీన్లలో రిలీజ్ చేస్తున్నాం. హిందీ వర్షెన్‌తో కలిపితే 600కి పైగా స్క్రీన్లలో వచ్చే అవకాశం ఉంది."

-"థియేటర్ల బంద్ అనేది ఉండకపోవచ్చు. మంచి కంటెంట్ మూవీ వస్తుంటే థియేటర్ల బంద్ అనేది ఉండదు. అసలే సమ్మర్‌లో ఇంత వరకు ఓ పెద్ద సినిమా రాలేదు. మా ఈ ‘కర’ మూవీకి అందరూ సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాను."

-"కరస్వామి అనే వ్యక్తి చుట్టూ ఈ కథ తిరుగుతుంది. అందుకే తెలుగులో ‘కర’ అనే టైటిల్‌ను పెట్టారు. ఓటీటీ మూవీ‘పోరు తొళిల్’ నాకు ఎంతో ఇష్టమైన సినిమా. విఘ్నేశ్ గారి మేకింగ్ అంటే నాకు చాలా ఇష్టం. ఆయన మీద నాకు చాలా నమ్మకం ఉంది. ‘కర’లో ఫ్యామిలీ ఎమోషన్స్‌తో పాటు థ్రిల్లింగ్ ఫ్యాక్టర్స్ ఎన్నో ఉన్నాయి. ఇది పెద్ద హిట్ అవుతుందనే నమ్మకంతో ధనుష్ గారున్నారు."

పాటలు తెరపైనే చూడాలి

-"లోకల్, విలేజ్ అని కాకుండా ఇంటర్నేషనల్ రిలేటెడ్ కంటెంట్ కూడా ఉంటుంది. ప్రస్తుతం ఎదుర్కొంటున్న సమస్యల్ని కూడా ఇందులో చూపిస్తున్నారు. జీవీ ప్రకాష్ గారి సంగీతం బాగుంటుంది. ఇంకా కొన్ని పాటలు డైరెక్ట్‌గా తెరపైనే చూడాలి. అన్ని పాటలు స్క్రీన్‌పై అద్భుతంగా ఉంటాయి. సినిమా ప్రతీ ఒక్కరినీ ఆకట్టుకుంటుంది" అని సీహెచ్ సతీష్ కుమార్ తెలిపారు.

  • Chetupelli Sanjiv Kumar
    ABOUT THE AUTHOR
    Chetupelli Sanjiv Kumar

    చెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్‌ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్‌సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.Read More