ఓటీటీలోకి శ్రియ శరణ్ నటించిన మరో వెబ్ సిరీస్ రాబోతోంది. టీవీఎఫ్ నిర్మించిన ఈ సిరీస్ పేరు స్పేస్ జెన్ - చంద్రయాన్. ఇది ఇస్రో సాగించిన చంద్రయాన్ ప్రయోగాల చుట్టూ తిరిగే సిరీస్. మంగళవారం (జనవరి 6) ఈ సిరీస్ టీజర్ ను జియోహాట్‌స్టార్ రిలీజ్ చేసింది. ఆ విశేషాలేంటో చూడండి.
స్పేస్ జెన్ వెబ్ సిరీస్ టీజర్

జియోహాట్‌స్టార్ ఈ కొత్త ఏడాది తొలి నెలలోనే తీసుకొస్తున్న అద్భుతమైన వెబ్ సిరీస్ స్పేస్ జెన్ - చంద్రయాన్. గతేడాది డిసెంబర్ లోనే ఈ సిరీస్ స్ట్రీమింగ్ డేట్ అనౌన్స్ చేయగా.. తాజాగా ఓ చిన్న టీజర్ రిలీజ్ చేసింది. ఇందులో సిరీస్ లోని ముఖ్యమైన పాత్రలను పరిచయం చేశారు. అందులో శ్రియ శరణ్ కూడా ఉండటం విశేషం. గడిచిన కొన్నేళ్లలో ఇస్రో సాగించిన చంద్రయాన్ ప్రయోగాలను ఈ సిరీస్ కళ్లకు కట్టబోతునట్లు టీజర్ చూస్తోంది. ఈ టీజర్ చాలా భావోద్వేగాలతో కూడిన రోలర్ కోస్టర్ లా సాగింది. జనవరి 23న ఈ సిరీస్ స్ట్రీమింగ్ అవుతుంది.
చంద్రయాన్ ప్రస్థానం: సిరీస్ లో ఏం ఉంటుంది?
ఈ వెబ్ సిరీస్ ఇస్రో చేపట్టిన చంద్రయాన్ మిషన్ల చుట్టూ తిరుగుతుంది. 2008లో చేపట్టిన చంద్రయాన్-1 చంద్రుడిపై నీటి జాడను కనిపెట్టిన మొట్టమొదటి మిషన్ ఇది. ఈ మిషన్ తో ప్రపంచాన్నే నివ్వెర పరిచింది ఇస్రో.
ఆ తర్వాత 2019లో చంద్రయాన్-2 ఆర్బిటర్, ల్యాండర్ (విక్రమ్), రోవర్ (ప్రజ్ఞాన్)తో చేసిన భారీ ప్రయోగం. ల్యాండింగ్ సమయంలో చిన్న ఇబ్బందులు వచ్చినా ఇది ఇస్రో పట్టుదలకు నిదర్శనం.
ఇక 2023లో చంద్రయాన్-3తో చరిత్ర సృష్టించింది. యావత్ ప్రపంచం ఆశ్చర్యపోయేలా చంద్రుడి దక్షిణ ధ్రువం (South Pole)పై సాఫ్ట్ ల్యాండింగ్ చేసిన ఘనత ఇస్రోకి దక్కింది.
{{/usCountry}}ఇక 2023లో చంద్రయాన్-3తో చరిత్ర సృష్టించింది. యావత్ ప్రపంచం ఆశ్చర్యపోయేలా చంద్రుడి దక్షిణ ధ్రువం (South Pole)పై సాఫ్ట్ ల్యాండింగ్ చేసిన ఘనత ఇస్రోకి దక్కింది.
{{/usCountry}}బెంగళూరు కేంద్రంగా పనిచేసే ఇస్రో.. అతి తక్కువ ఖర్చుతో ప్రపంచ స్థాయి స్పేస్ మిషన్లను ఎలా చేపట్టిందో ఈ సిరీస్ ద్వారా మనం చూడొచ్చు. స్పేస్ జెన్ వెబ్ సిరీస్ జనవరి 23 నుంచి జియోహాట్‌స్టార్ లో స్ట్రీమింగ్ అవుతుంది.