...
...
Next Story

Shruti Haasan: మగవాళ్లకు కూడా ఆ పీరియడ్స్ నొప్పి రావాలి.. షూటింగ్ సెట్స్‌లో ఆ బాధ చూశాను: శృతి హాసన్ కామెంట్స్

Shruti Haasan: శృతి హాసన్ పీరియడ్స్ విషయంపై మాట్లాడిన మాటలు వైరల్ అవుతున్నాయి. మగవాళ్లకు కూడా పీరియడ్స్ రావాలని తాను దేవుడికి మొక్కుకుంటున్నట్లు చేసిన కామెంట్స్ పై నెట్టింట పెద్ద చర్చే నడుస్తోంది.

Published on: Sep 18, 2026, 20:18:23 IST
By , Hyderabad
Prefer HTon Google
Advertisement

Shruti Haasan: టాలీవుడ్, కోలీవుడ్ స్టార్ హీరోయిన్ శృతి హాసన్ మరోసారి తన బోల్డ్ కామెంట్స్‌తో వార్తల్లో నిలిచారు. ప్రొఫెషనల్ లైఫ్‌తో పాటు పర్సనల్, సోషల్ విషయాలపై ఎప్పుడూ ఓపెన్‌గా మాట్లాడే ఈ బ్యూటీ, తాజాగా పీరియడ్స్ (నెలసరి) తీవ్రతపై చేసిన వ్యాఖ్యలు నెట్టింట విపరీతంగా వైరల్ అవుతున్నాయి. మగవాళ్లకు కూడా పీరియడ్స్ రావాలని దేవుళ్లను వేలసార్లు ప్రార్థిస్తుంటానని శ్రుతి చెప్పడం ఇండస్ట్రీ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది.

దేవుడికి వేలసార్లు దండం పెట్టా.. శ్రుతి ఏమన్నారంటే?

Shruti Haasan: మగవాళ్లకు కూడా ఆ పీరియడ్స్ నొప్పి రావాలి.. షూటింగ్ సెట్స్‌లో ఆ బాధ చూశాను: శృతి హాసన్ కామెంట్స్
Shruti Haasan: మగవాళ్లకు కూడా ఆ పీరియడ్స్ నొప్పి రావాలి.. షూటింగ్ సెట్స్‌లో ఆ బాధ చూశాను: శృతి హాసన్ కామెంట్స్

నటి సోహా అలీ ఖాన్‌తో కలిసి పాల్గొన్న ఒక టాక్ షోలో పీరియడ్స్, హార్మోనల్ మార్పులపై శృతి హాసన్ చాలా ప్రాక్టికల్‌గా మాట్లాడారు. "పీరియడ్స్ వల్ల వచ్చే విపరీతమైన నొప్పిని తగ్గించడానికి ఒకే ఒక్క పరిష్కారం ఉంది. మగవాళ్లకు కూడా నెలకు ఒకసారి పీరియడ్స్ రావాలని నేను రోజుకి వేలసార్లు దేవుడిని కోరుకుంటాను. అలా జరిగితేనే వాళ్లకు ఆ బాధ ఏంటో అర్థమవుతుంది. దాంతో పాటు షూటింగ్ కాంట్రాక్ట్‌లలో పీరియడ్స్ లీవ్స్ ఇచ్చే క్లాజ్ కచ్చితంగా చేరుస్తారు" అని శృతి వ్యాఖ్యానించారు.

ఈ కామెంట్స్‌పై సోహా అలీ ఖాన్ స్పందిస్తూ.. ఒకవేళ మగవాళ్లకు పీరియడ్స్ వస్తే 'నాకు ఎంత బ్లీడింగ్ అయింది, నా టాంపాన్ సైజ్ ఎంత పెద్దది' అని వాళ్లు పోటీ పెట్టుకుంటారని సరదాగా చమత్కరించారు.

షూటింగ్ సెట్‌లో చేదు అనుభవం.. హీరోలకు ఒకలా, మాకు ఒకలా..

తన కెరీర్ ప్రారంభంలో షూటింగ్ సెట్స్‌లో ఎదురైన కష్టాలను శృతి హాసన్ గుర్తుచేసుకున్నారు. "కెరీర్ మొదట్లో పీరియడ్ నొప్పి గురించి సెట్‌లో మాట్లాడటానికి చాలా భయపడేదాన్ని. అది కేవలం ఒక అపోహ మాత్రమే కాదు, అసలు ఆ టాపిక్ ఎవరూ ఎత్తేవారు కూడా కాదు. అసలు నా ఎనర్జీ ఎందుకు తగ్గింది, నేను ఎందుకు డిఫరెంట్‌గా కనిపిస్తున్నానో అని డైరెక్టర్లు విచిత్రంగా చూసేవారు" అని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు.

ప్రొఫెషనల్ లైఫ్ విషయానికి వస్తే, శృతి హాసన్ రీసెంట్‌గా తమిళ సూపర్‌స్టార్ రజనీకాంత్‌తో కలిసి 'కూలీ' (Coolie) సినిమాలో నటించారు. లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో వచ్చిన ఈ యాక్షన్ థ్రిల్లర్ మూవీ బాక్సాఫీస్ వద్ద ఏకంగా రూ.518 కోట్లకు పైగా గ్రాస్ వసూళ్లు సాధించి ఆల్ టైమ్ బ్లాక్‌బస్టర్‌గా నిలిచింది. నాగార్జున, ఉపేంద్ర, సౌబిన్ షాహిర్, ఆమిర్ ఖాన్ కామియోలతో ఈ సినిమా సంచలనం సృష్టించింది.

ఇది కాకుండా రామ్ చరణ్, జాన్వీ కపూర్ కాంబినేషన్‌లో వచ్చిన ‘పెద్ది’ సినిమాలో ‘హెలెలో’ స్పెషల్ సాంగ్‌తో శ్రుతి మాస్ ఆడియన్స్‌ను ఊపేసింది. ప్రస్తుతం డైరెక్టర్ మిస్కిన్ కాంబినేషన్‌లో విజయ్ సేతుపతి హీరోగా వస్తున్న ‘ట్రైన్’ (Train) సినిమాతో పాటు దుల్కర్ సల్మాన్ కాంబోలో ఒక క్రేజీ తెలుగు ప్రాజెక్ట్‌లో శ్రుతి బిజీగా ఉన్నారు.

 
ABOUT THE AUTHOR
Hari Prasad S

హరి ప్రసాద్ శీలమంతుల ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. మీడియా రంగంలో 20 ఏళ్లకు పైగా సుదీర్ఘ అనుభవం కలిగిన ఆయన, డిజిటల్ మీడియాలో గత 10 ఏళ్లుగా విశేష సేవలందిస్తున్నారు. ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలు, సినిమా వార్తలను అందించడంలో ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఆయన తన అద్భుతమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. హరి ప్రసాద్ తన కెరీర్‌లో ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా వంటి మూడు ప్రధాన విభాగాల్లోనూ పనిచేశారు. హిందుస్థాన్ టైమ్స్‌లో చేరకముందు, ఆయన తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ దినపత్రికలు, టీవీ ఛానెళ్లయిన ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి వంటి సంస్థలలో కీలక బాధ్యతలు నిర్వహించారు. నవంబర్ 1, 2021న హిందుస్థాన్ టైమ్స్ తెలుగు టీమ్‌లో చేరిన ఆయన.. ప్రస్తుతం స్పోర్ట్స్ (ముఖ్యంగా క్రికెట్ అనాలసిస్), ఎంటర్‌టైన్మెంట్ సెక్షన్ల బాధ్యతలను చూసుకుంటున్నారు. ఈయన ఉస్మానియా యూనివర్సిటీ నుంచి బీఎస్సీ (కంప్యూటర్ సైన్స్) పట్టా పొందారు. సాంకేతిక పరిజ్ఞానంతో పాటు జర్నలిజంపై ఉన్న మక్కువతో జర్నలిజంలో డిప్లొమా పూర్తి చేసి, వృత్తిపరమైన నైపుణ్యాలను మెరుగుపరుచుకున్నారు. క్రీడా రంగంలో వస్తున్న మార్పులను, సినిమా ఇండస్ట్రీ అప్‌డేట్స్‌ను లోతుగా విశ్లేషించి పాఠకులకు అర్థమయ్యే రీతిలో అందించడం హరి ప్రసాద్ శైలి.

SHARE THIS ARTICLE ON
Notifications

Get breaking alerts directly from the newsroom

Notifications are on!You'll be notified when news breaks