Soha Ali: వదినా కరీనాతో గాసిప్స్, అన్న సైఫ్ దగ్గర రిలేషన్షిప్ టిప్స్- పటౌడీ ఫ్యామిలీ సీక్రెట్స్ లీక్ చేసిన సోహా అలీ ఖాన్

Soha Ali Khan Relationship With Saif Ali Khan Kareena Kapoor: తన కుటుంబ సభ్యులతో తనకున్న అనుబంధంపై హీరోయిన్ సోహా అలీ ఖాన్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. కష్టాల్లో ఉన్నప్పుడు ఎవరి సలహాలు తీసుకుంటారు? ఎవరితో కబుర్లు చెబుతారు? వంటి విషయాలను చెబుతూ పటౌడీ ఫ్యామిలీ సీక్రెట్స్‌ను లీక్ చేశారు సోహా అలీ ఖాన్.

May 11, 2026, 11:37:52 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

Soha Ali Khan Relationship With Saif Ali Khan Kareena Kapoor: బాలీవుడ్ స్టార్ ఫ్యామిలీ పటౌడీ కుటుంబం అంటేనే ఒక ప్రత్యేకమైన క్రేజ్. ఈ ఫ్యామిలీకి చెందిన హీరోయిన్ సోహా అలీ ఖాన్ తాజాగా తన కుటుంబ సభ్యుల మధ్య ఉండే బాండింగ్ గురించి మనసు విప్పి మాట్లాడారు. ఈ క్రమంలో తన పటౌడీ ఫ్యామిలీ సీక్రెట్స్‌ను లీక్ చేశారు సోహా అలీ ఖాన్.

వదినా కరీనాతో గాసిప్స్, అన్న సైఫ్ దగ్గర రిలేషన్షిప్ టిప్స్- పటౌడీ ఫ్యామిలీ సీక్రెట్స్ లీక్ చేసిన సోహా అలీ ఖాన్
వదినా కరీనాతో గాసిప్స్, అన్న సైఫ్ దగ్గర రిలేషన్షిప్ టిప్స్- పటౌడీ ఫ్యామిలీ సీక్రెట్స్ లీక్ చేసిన సోహా అలీ ఖాన్

ఎవరి సలహాల కోసం

జీవితంలోని విభిన్న సందర్భాల్లో తాను ఎవరి వైపు మొగ్గు చూపుతారో, ఎవరి సలహాల కోసం ఎదురుచూస్తారో వివరిస్తూ ఆసక్తికర విషయాలను వెల్లడించారు సోహా అలీ ఖాన్. ఫ్యాషన్ నుంచి రిలేషన్షిప్స్ వరకు, గాసిప్స్ నుంచి కెరీర్ వరకు ప్రతి విషయంలోనూ తనకంటూ ఒక 'గో-టు పర్సన్' ఉన్నారని సోహా అలీ ఖాన్ తెలిపారు.

అన్నయ్య సైఫ్ నుంచి ఆ సలహాలు!

ముఖ్యంగా రిలేషన్షిప్ (బంధాల) విషయంలో తలెత్తే ఇబ్బందుల గురించి చర్చించాల్సి వస్తే, తాను అన్నయ్య సైఫ్ అలీ ఖాన్ దగ్గరికే వెళ్తానని సోహా అలీ ఖాన్ చెప్పారు. "నాకు అబ్బాయిల స్నేహం ఇప్పుడు పెద్దగా లేదు. అందుకే ఏదైనా సమస్య వచ్చినప్పుడు అవతలి వైపు (పురుషుల) కోణం ఎలా ఉంటుందో తెలుసుకోవడానికి భాయ్‌ని సంప్రదిస్తాను. ఆయన ఎప్పుడూ కునాల్ (సోహా భర్త) వైపు నిలబడరు కానీ, ఒక పురుషుడిగా ఆ పరిస్థితిని ఎలా అర్థం చేసుకోవాలో వివరిస్తారు" అని సోహా అలీ ఖాన్ పేర్కొన్నారు.

ఇక తన భర్త కునాల్ ఖేము గురించి చెబుతూ.. పిల్లల పెంపకంలో తాను ఎప్పుడైనా అసహనానికి లోనైతే, ఆయన ఎంతో ప్రశాంతంగా ఉంటూ తనను కూల్ చేస్తారని సోహా అలీ ఖాన్ కితాబిచ్చారు.

గాసిప్స్ కావాలంటే కరీనా ఉండాల్సిందే..

ఇక సోషల్ మీడియా యుగంలో ఎక్కడ ఏం జరుగుతుందో తెలుసుకోవడానికి వదిన కరీనా కపూర్ సరైన వ్యక్తి అని సోహా అలీ ఖాన్ సరదాగా వ్యాఖ్యానించారు. "కరీనా అందరిలా గాసిప్స్ చెప్పదు కానీ, ఆమె దగ్గర అపారమైన సమాచారం ఉంటుంది. అసలు ఆ విషయం ఆమెకు ఎలా తెలుసా? అని మనం ఆశ్చర్యపోయేలా చేస్తుంది. బహుశా ఆమె ఏదైనా స్పెషల్ వాట్సాప్ గ్రూపుల్లో ఉండి ఉంటుంది, అందులో చేరాలని నాకు కూడా ఉంది" అంటూ నవ్వుతూ చెప్పారు సోహా అలీ ఖాన్.

కెరీర్ ముచ్చట్లు: ఎవరి సినిమాలు ఎప్పుడు?

ఇక స్టైలింగ్ విషయానికి వస్తే, తన కూతురు ఇనాయా ఇప్పుడు తనకు ఫ్యాషన్ కన్సల్టెంట్‌గా మారిపోయిందని సోహా అలీ ఖాన్ వివరించారు. సినిమాల విషయానికి వస్తే, సోహా అలీ ఖాన్ ఇటీవల 'చోరీ 2' చిత్రంతో ప్రేక్షకులను పలకరించారు. ఇది నేరుగా ఓటీటీలోకి వచ్చింది. అమెజాన్ ప్రైమ్‌లో చోరీ 2 ఓటీటీ స్ట్రీమింగ్ అవుతోంది.

హారర్ థ్రిల్లర్ జోనర్‌లో వచ్చిన చోరీ 2 సినిమాలో సోహా అలీ ఖాన్ నటనకు మంచి మార్కులే పడ్డాయి. ప్రస్తుతం సోహా అలీ ఖాన్ తన 'ఆల్ అబౌట్ హర్' పాడ్‌కాస్ట్‌తో బిజీగా ఉన్నారు. మరోవైపు, సైఫ్ అలీ ఖాన్ నటించిన క్రైమ్ డ్రామా కర్తవ్య ఓటీటీ రిలీజ్‌కు సిద్ధంగా ఉంది.

నెట్‌ఫ్లిక్స్ ఓటీటీలో

రెడ్ చిల్లీస్ ఎంటర్టైన్మెంట్ నిర్మించిన ఈ చిత్రం మే 15 నుంచి ఓటీటీ స్ట్రీమింగ్ అవనుంది. నెట్‌ఫ్లిక్స్‌లో కర్తవ్య ఓటీటీ రిలీజ్ కానుంది. ఇక కరీనా కపూర్ నటిస్తున్న 'దాయరా' చిత్రంపై కూడా భారీ అంచనాలు ఉన్నాయి.

కరీనా కపూర్ మూవీ

మేఘనా గుల్జార్ దర్శకత్వంలో ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్‌గా రూపొందుతున్న ఈ సినిమాలో పృథ్వీరాజ్ సుకుమారన్ ప్రధాన పాత్ర పోషిస్తున్నారు. షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది.

  • Chetupelli Sanjiv Kumar
    ABOUT THE AUTHOR
    Chetupelli Sanjiv Kumar

    చెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్‌ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్‌సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.Read More