సినిమాల్లో హీరోయిన్‌గా అలరించే శృతి హాసన్.. నిజ జీవితంలోనూ తానొక గొప్ప మనసున్న మనిషినని నిరూపించుకుంది. ఓ అరుదైన జన్యుపరమైన వ్యాధితో పోరాడుతున్న పసిపాప ప్రాణాలను కాపాడి.. ఆ కుటుంబానికి పెద్ద దిక్కుగా నిలిచింది. ఆ చిన్నారి తల్లిదండ్రులు ఇటీవల తమ ఇన్‌స్టాగ్రామ్‌లో శృతి హాసన్‌తో తమ పాప ఆడుకుంటున్న వీడియోను షేర్ చేస్తూ.. ఆమె చేసిన సాయాన్ని గుర్తుచేసుకుని భావోద్వేగానికి గురయ్యారు.
ఆ చిన్నారి ప్రాణం శృతి భిక్షే..

'ఆళ్వి' అనే చిన్నారి అరుదైన 'ఎంఎస్‌ఎమ్‌డి' (MSMD - మెండీలియన్ ససెప్టిబిలిటీ టు మైకోబాక్టీరియల్ డిసీజెస్) అనే జన్యు సంబంధిత వ్యాధితో పుట్టింది. 2023లో జన్మించిన ఈ పాప.. నెలల వయసు నుంచే ఆసుపత్రుల చుట్టూ తిరగాల్సి వచ్చింది. 2025లో బోన్ మ్యారో ట్రాన్స్‌ప్లాంట్ (ఎముక మజ్జ మార్పిడి) అవసరమైన క్లిష్ట పరిస్థితుల్లో.. దేవుడిలా శృతి హాసన్ ఆ కుటుంబానికి అండగా నిలిచింది.
పాప తల్లిదండ్రులు తమ పోస్ట్‌లో రాస్తూ.. "మనం మన అభిమాన తారలను కలవకూడదని అంటారు. కానీ వాళ్లు శృతి హాసన్‌ను కలిసి ఉండకపోవచ్చు. ఆమె కేవలం ఒక స్టార్ మాత్రమే కాదు.. అంతకుమించిన గొప్ప వ్యక్తి. మా పాప ఆళ్వి ఈరోజు బతికి ఉందంటే దానికి కారణం శృతి గారే" అని కృతజ్ఞతలు తెలిపారు.
శృతి చేసిన సాయం ఏంటి?
గతేడాది జులైవో ఆళ్వి పరిస్థితి విషమించి ఐసీయూలో చేరాల్సి వచ్చినప్పుడు శృతి హాసన్ స్వయంగా రంగంలోకి దిగింది. డాక్టర్ ధరణి, డాక్టర్ దివ్య వంటి నిపుణులైన వైద్య బృందాన్ని ఆ కుటుంబానికి పరిచయం చేసింది. దేశంలోని అత్యుత్తమ స్పెషలిస్టుల ద్వారా పాపకు మెరుగైన వైద్యం అందేలా చూసింది. కేవలం వైద్య సాయమే కాకుండా.. మానసికంగానూ, ఆర్థికంగానూ ఆ కుటుంబానికి ధైర్యాన్ని ఇచ్చింది.
బిస్కెట్ ప్యాకెట్‌తో చిన్నారి ముఖంలో నవ్వు
ఇటీవల ఆళ్వి, ఆమె తల్లిదండ్రులు శృతి హాసన్‌ను కలిశారు. ఈ సందర్భంగా శృతి ఆ చిన్నారితో ఆడుకుంటున్న వీడియో నెటిజన్ల మనసు గెలుచుకుంటోంది. "ఆమె మమ్మల్ని తన ఇంటి మనిషిలా ఆదరించారు. ఆళ్వి కోసం పెద్ద బిస్కెట్ ప్యాకెట్ తెచ్చి ఇచ్చారు. అది చూసి మా పాప ముఖంలో వెలిగిన ఆనందం మాకు ఎప్పటికీ గుర్తుండిపోతుంది. శృతి గారు చాలా డౌన్ టు ఎర్త్" అని తల్లిదండ్రులు చెప్పారు. ఈ పోస్ట్‌కు శృతి హాసన్ హార్ట్ ఎమోజీలతో స్పందించింది.
కెరీర్ పరంగా ఫుల్ బిజీ
{{/usCountry}}ఇటీవల ఆళ్వి, ఆమె తల్లిదండ్రులు శృతి హాసన్‌ను కలిశారు. ఈ సందర్భంగా శృతి ఆ చిన్నారితో ఆడుకుంటున్న వీడియో నెటిజన్ల మనసు గెలుచుకుంటోంది. "ఆమె మమ్మల్ని తన ఇంటి మనిషిలా ఆదరించారు. ఆళ్వి కోసం పెద్ద బిస్కెట్ ప్యాకెట్ తెచ్చి ఇచ్చారు. అది చూసి మా పాప ముఖంలో వెలిగిన ఆనందం మాకు ఎప్పటికీ గుర్తుండిపోతుంది. శృతి గారు చాలా డౌన్ టు ఎర్త్" అని తల్లిదండ్రులు చెప్పారు. ఈ పోస్ట్‌కు శృతి హాసన్ హార్ట్ ఎమోజీలతో స్పందించింది.
కెరీర్ పరంగా ఫుల్ బిజీ
{{/usCountry}}ఇక సినిమాల విషయానికి వస్తే 2025లో రజినీకాంత్ 'కూలీ' సినిమాలో కనిపించిన శృతి హాసన్.. ప్రస్తుతం విజయ్ సేతుపతితో 'ట్రైన్' సినిమాలో, దుల్కర్ సల్మాన్‌తో 'ఆకాశంలో ఒక తార' చిత్రంలో నటిస్తున్నారు. అలాగే ఎస్.ఎస్. రాజమౌళి దర్శకత్వంలో మహేష్ బాబు, ప్రియాంక చోప్రా, పృథ్వీరాజ్ సుకుమారన్ నటిస్తున్న ప్రతిష్టాత్మక మూవీ 'వారణాసి'లో శృతి ఒక పాటను పాడటం విశేషం.