...
...
Next Story

Sigma Review: సిగ్మా మూవీ రివ్యూ-సందీప్ కిషన్ హిట్ కొట్టాడా? జేసన్ సంజయ్ హీస్ట్ డ్రామా వర్కవుట్ అయిందా? ప్లస్, మైనస్‌లు!

Sigma Review: తమిళ స్టార్ హీరో, ముఖ్యమంత్రి దళపతి విజయ్ కొడుకు జేసన్ సంజయ్ డైరెక్టర్ గా డెబ్యూ చేసిన మూవీ ‘సిగ్మా’. ఇందులో సందీప్ కిషన్ హీరోగా నటించాడు. ఓ మోస్తారు అంచనాలతో ఈ రోజు థియేటర్లకు రిలీజైన సిగ్మా మూవీ మెప్పించిందా? జేసన్ సంజయ్ డైరెక్టోరియల్ డెబ్యూ ఎలా ఉంది? అనేది రివ్యూలో చూసేయండి.

Published on: Oct 2, 2026, 16:47:44 IST
Advertisement

Sigma Review:

సిగ్మా మూవీ రివ్యూ-సందీప్ కిషన్ హిట్ కొట్టాడా? జేసన్ సంజయ్ హీస్ట్ డ్రామా వర్కవుట్ అయిందా? ప్లస్, మైనస్‌లు! (x/LycaProductions)
సిగ్మా మూవీ రివ్యూ-సందీప్ కిషన్ హిట్ కొట్టాడా? జేసన్ సంజయ్ హీస్ట్ డ్రామా వర్కవుట్ అయిందా? ప్లస్, మైనస్‌లు! (x/LycaProductions)

సినిమా పేరు : సిగ్మా

నటీనటులు : సందీప్ కిషన్, ఫరియా అబ్దుల్లా, సంపత్ రాజ్, రాజు సుందరం తదితరులు

డైరెక్టర్ : జేసన్ సంజయ్

రిలీజ్ డేట్ : అక్టోబర్ 2, 2026

దళపతి విజయ్ తనయుడు జేసన్ సంజయ్ దర్శకుడిగా పరిచయమవుతూ, యంగ్ అండ్ ప్రామిసింగ్ హీరో సందీప్ కిషన్ హీరోగా తెరకెక్కించిన హీస్ట్ డ్రామా 'సిగ్మా' (Sigma). ఇవాళ (అక్టోబర్ 2) ఈ మూవీ థియేటర్లలోకి వచ్చింది. లైకా ప్రొడక్షన్స్ నిర్మించిన ఈ చిత్రంలో ఫరియా అబ్దుల్లా, సంపత్ రాజ్ కీలక పాత్రలు పోషించారు. ఎస్ తమన్ సంగీతం అందించిన ఈ సినిమాతో జేసన్ సంజయ్ సక్సెస్ కొట్టాడా, సందీప్ కిషన్‌కు ఈ హీస్ట్ డ్రామా ఎలాంటి రిజల్ట్ ఇచ్చిందో రివ్యూలో చూద్దాం.

రొటీన్ స్టోరీ

సిగ్మా సినిమా స్టోరీ విశాఖపట్నం బ్యాక్‌డ్రాప్‌లో సాగుతుంది. మూవీలో గురు (సందీప్ కిషన్) తన తల్లి జ్ఞాపకంగా మిగిలిన ఒక హోమ్ లైబ్రరీని రన్ చేస్తుంటాడు. అయితే అతని తండ్రి చేసిన రూ.1 కోటి అప్పు గురు జీవితాన్ని వెంటాడుతుంది. ఆ అప్పు తీర్చే క్రమంలో డ్రగ్స్ వ్యాపారం చేసే విన్సెంట్ అనే వ్యక్తికి సంబంధించిన 'సీజర్' అనే ప్రమాదకరమైన డ్రగ్ గురించిన కీలక ఆధారాలు గురు చేతికి చిక్కుతాయి.

ఆ ఆధారాలతో విన్సెంట్‌ను బ్లాక్‌మెయిల్ చేసి డబ్బు గుంజాలని గురు ప్లాన్ వేస్తాడు. కానీ ఈ మొత్తం డ్రగ్ నెట్‌వర్క్ వెనుక కోట్లపాడి వెంకటరెడ్డి (సంపత్ రాజ్) అనే అంతర్జాతీయ స్మగ్లర్ ఉన్నాడని తెలుస్తుంది. ఆ స్మగ్లర్ మరొక పెద్ద డీల్ కోసం చూస్తున్నాడని గురుకి తర్వాత తెలుస్తుంది. ఆ తర్వాత గురు ఏం చేశాడు? తన అప్పు ఎలా తీర్చాడు? అనేది సిగ్మా మూవీలో చూడాల్సిందే.

స్క్రీన్ ప్లే ఫెయిల్యూర్

హీస్ట్ డ్రామా అనగానే గ్రిప్పింగ్ స్క్రీన్‌ప్లే, స్మార్ట్ మైండ్ గేమ్స్ ఆశిస్తాం. కానీ దర్శకుడు జేసన్ సంజయ్ ఎంచుకున్న పాతకాలపు స్టోరీ సిగ్మా సినిమాకు పెద్ద మైనస్‌గా మారింది. ప్రారంభ సన్నివేశాల నుంచే కథనంలో ఏమాత్రం కొత్తదనం కనిపించదు. హీరో, హీరోయిన్ల మధ్య సాగే రొమాంటిక్ ట్రాక్ రొటీన్ గా ఉంటుంది.

ఇక సెకండాఫ్ మూవీ ప్రేక్షకుల ఓపికకు పెద్ద పరీక్షగా మారుతుంది. ఎటువంటి కష్టాలు, సెక్యూరిటీ అడ్డంకులు లేకుండా హీరో అండ్ అతని గ్యాంగ్ అనూహ్యంగా విదేశాలకు వెళ్లిపోయి, అక్కడ ఒక భారీ హీస్ట్ ప్లాన్ చేసేయడం లాజిక్స్ కు అందదు. ఒకే రకమైన సీన్లు పదే పదే రావడం విసుగు తెప్పిస్తుంది. సీరియస్ సన్నివేశాల్లో బలవంతంగా ఇరికించిన కామెడీ కథలోని ఇంటెన్సిటిని దెబ్బతీసింది. ఇక క్లైమాక్స్ కూడా ఏమంతా గొప్ప ఫీలింగ్ ఇవ్వలేదు.

ఎవరెలా చేశారంటే?

నటుడిగా సందీప్ కిషన్ తన వంతుగా వంద శాతం నిజాయితీతో ప్రయత్నించాడు. దర్శకుడి విజన్‌ను నమ్మి యాక్షన్ సీన్స్‌లో బాగానే కష్టపడ్డాడు. కానీ వీక్ స్టోరీ లైన్ తో అతని అతని శ్రమను బూడిదలో పోసిన పన్నీరుగా మారింది. హీరోయిన్ ఫరియా అబ్దుల్లాకు చాలా తక్కువ స్క్రీన్ టైమ్ లభించింది, ఆమె పాత్ర కేవలం కొద్ది సీన్లకే పరిమితమైంది. విలన్ గా సంపత్ రాజ్ తన అనుభవంతో రొటీన్ విలన్ పాత్రను నడిపించేశాడు.

టెక్నికల్ గా

సిగ్మా మూవీ టెక్నికల్ పరంగానూ అంతగా మెప్పించలేకపోయింది. విజయ్ కొడుకు జేసన్ సంజయ్ తన డైరెక్షన్ డెబ్యూట్ కోసం రొటీన్ పాయింటే రాసుకున్నాడు. కానీ దాన్ని తెరమీదకు తీసుకురావడంలో ఫెయిల్ అయ్యాడనే చెప్పొచ్చు. ఇక తమన్ మ్యూజిక్ కూడా సీన్స్ ను ఎలివేట్ చేయలేకపోయింది.

ఫైనల్ గా

డైరెక్టోరియల్ డెబ్యూలో జేసన్ సంజయ్ ఎంచుకున్న రొటీన్ పాయింట్, బలహీనమైన రైటింగ్ సినిమాను దెబ్బతీశాయని చెప్పొచ్చు. హీస్ట్ థ్రిల్లర్స్ విజయం సాధించాలంటే తెలివైన ఎత్తుగడలు, ఊహించని ట్విస్టులు ఉండాలి. ఇవి లేకపోవడంతో సిగ్మా ఓ యావరేజ్ మూవీగా మిగిలిపోయేలా కనిపిస్తోంది.

రేటింగ్ : 2.75/5

 
ABOUT THE AUTHOR
Chandu Shanigarapu

చందు శనిగారపు ప్రస్తుతం హిందూస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ రైట‌ర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. మీడియా రంగంలో ఎనిమిదేళ్లకు పైగా అనుభవం ఆయన సొంతం. 2025 నుంచి డిజిటల్ మీడియాలోనూ తనదైన ముద్ర వేస్తున్నారు. సినిమా వార్తలను ఎప్పటికప్పుడు అందించడం, స్పోర్ట్స్ న్యూస్ ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలను చదివించేలా ఇవ్వడం ఆయన ప్రత్యేకత. మ్యాచ్ రిపోర్ట్ లను వేగంగా అందించడం, లైవ్ అప్ డేట్స్ ఇవ్వడంలో ఆయన ముందుంటారు. చందు తన కెరీర్ లో ప్రింట్ మీడియాలో ఎక్కువగా పనిచేశారు. ప్రముఖ దినపత్రిక ఈనాడులో ఏడేళ్లకు పైగా స్పోర్ట్స్ రిపోర్టర్ గా పనిచేశారు. తన ఆర్టికల్స్ తో ఎంతోమంది యువ క్రీడాకారుల ప్రతిభను వెలుగులోకి తెచ్చారు. ప్రత్యేక ఆర్టికల్స్ తో వాళ్లకు ఆర్థిక సాయం అందేలా చూశారు. క్రికెట్ ప్రపంచకప్ లు, ఒలింపిక్స్ లాంటి మెగా టోర్నీల కవరేజీలో ఆయనకు విశిష్ఠ అనుభవం ఉంది. మల్లారెడ్డి కాలేజీ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ నుంచి చందు బీటెక్ డిగ్రీ పొందారు. ఓ వైపు టెక్నికల్ నాలెడ్జ్ తో పాటు జర్నలిజంపై ప్రేమతో మీడియా రంగంలో కొనసాాగుతున్నారు. జర్నలిజంలో డిప్లొమా చేశారు. సినిమా వార్తలను, మూవీ రివ్యూలను, ఓటీటీ విషయాలను, క్రికెట్ సమాచారాన్ని, క్రీడా సంగతులను పాఠకులకు అందిస్తున్నారు.

SHARE THIS ARTICLE ON
Notifications

Get breaking alerts directly from the newsroom

Notifications are on!You'll be notified when news breaks