Sundeep Kishan: మీరే లాస్ అవుతారు.. అందరూ దొరికిపోతారు.. నా సినిమాను ఎవరు టార్గెట్ చేశారో తెలుసు: సందీప్ కిషన్ వార్నింగ్
Sundeep Kishan: టాలీవుడ్ హీరో సందీప్ కిషన్ కు ఫుల్ కోపమొచ్చింది. తన సినిమాను టార్గెట్ చేసిన వాళ్లకు అతను వార్నింగ్ ఇచ్చారు. అందరూ దొరికిపోతారని తన ఎక్స్ అకౌంట్లో సందీప్ చేసిన పోస్టు కలకలం రేపుతోంది. అతని మూవీ సిగ్మా రేపు రిలీజ్ కానుంది.
Sundeep Kishan: తెలుగు హీరో సందీప్ కిషన్ తమిళంలో చేసిన మూవీ ‘సిగ్మా’. ఈ చిత్రం తెలుగులోనూ రిలీజ్ కానుంది. రేపు (అక్టోబర్ 2)న ప్రపంచవ్యాప్తంగా సిగ్మా మూవీ గ్రాండ్ గా విడుదవ అవుతుంది. ఈ నేపథ్యంలో మూవీని టార్గెట్ చేస్తూ యాంటీ ట్వీట్లు చేస్తున్న వాళ్లకు సందీప్ కిషన్ స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు.

సందీప్ కిషన్ వార్నింగ్
టాలీవుడ్ హీరో సందీప్ కిషన్ ఎక్స్ లో పెట్టిన పోస్టు హాట్ టాపిక్ గా మారింది. ‘‘గత కొన్ని రోజులుగా నన్ను, నా సినిమా (సిగ్మా)ను టార్గెట్ చేస్తూ చాలా యాంటీ ట్వీట్లు రావడం చూస్తున్నా. దీని వెనుక ఎవరున్నారో నాకు తెలుసు. దీనికి ఎవరు అమౌంట్ చెల్లిస్తున్నారో కూడా తెలుసు’’ అని సందీప్ కిషన్ తన పోస్టులో రాసుకొచ్చారు.
అందరూ దొరికిపోతారు
‘‘నా కంటే ఎక్కువగా మీరే నష్టపోతారని గుర్తు పెట్టుకోండి. డైరెక్ట్ అయిపోతే అందరూ దొరికిపోతారు మరి చూసుకోండి’’ అని సందీప్ కిషన్ తన మూవీపై నెగెటివ్ క్యాంపెయిన్ చేస్తున్న నెటిజన్లకు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు.
సిగ్మా గురించి
తమిళ స్టార్ హీరో, తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్ కొడుకు జాసన్ సంజయ్ డైరెక్షన్ లో వస్తున్న ఫస్ట్ మూవీ ‘సిగ్మా’. ఇందులో సందీప్ కిషన్, ఫరియా అబ్దుల్లా జంటగా నటించారు. లైకా ప్రొడక్షన్స్ బ్యానర్ పై సుభాస్కరన్ నిర్మించిన ఈ చిత్రానికి ఎస్.తమన్ మ్యూజిక్ డైరెక్టర్ గా పనిచేశారు.
యాక్షన్ అడ్వెంచర్ హీస్ట్
సిగ్మా మూవీని యాక్షన్ అడ్వెంచర్ హీస్ట్ జోనర్లో తెరకెక్కించారు. అటవీ సంపదను దోచుకునే వీరశంకర్ రెడ్డి (సంపత్ రాజ్) మాఫియా సామ్రాజ్యాన్ని నడుపుతుంటాడు. మరోవైపు ట్రెజర్ హంట్ (నిధుల వేట) చేసే యువకుడు సిగ్మాగా సందీప్ కిషన్ నటించాడు.
తన తల్లి కోరిక మేరకు సిగ్మా ఓ నిధి కోసం వెతుకుతుంటాడు. ఈ క్రమంలోనే రూ.500 కోట్ల డీల్‌కు సంబంధించి వీర శంకర్ రెడ్డి గ్యాంగ్‌తో సిగ్మా తలపడాల్సి వస్తుంది. మరి ఈ నిధి వేట కథలో ఎలాంటి ట్విస్టులు ఉన్నాయి, కథ ఎలాంటి మలుపు తిరిగింది? అనేది మూవీ చూసి తెలుసుకోవాల్సిందే.
మంచి హైప్
సిగ్మా మూవీ మంచి హైప్ నెలకొంది. దళపతి విజయ్ కొడుకు జాసన్ సంజయ్ డైరెక్టర్ గా మారి తీసిన సినిమా కావడంతో సిగ్మాపై అంచనాలు భారీగానే ఉన్నాయి. మరి అందుకు తగ్గట్లు సినిమా ఉంటుందా? డైరెక్టర్ గా జాసన్ ఫస్ట్ స్టెప్ ఎలా ఉంది? అనేది రేపు తెలిసిపోతుంది.
ABOUT THE AUTHORChandu Shanigarapuచందు శనిగారపు ప్రస్తుతం హిందూస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ రైటర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. మీడియా రంగంలో ఎనిమిదేళ్లకు పైగా అనుభవం ఆయన సొంతం. 2025 నుంచి డిజిటల్ మీడియాలోనూ తనదైన ముద్ర వేస్తున్నారు. సినిమా వార్తలను ఎప్పటికప్పుడు అందించడం, స్పోర్ట్స్ న్యూస్ ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలను చదివించేలా ఇవ్వడం ఆయన ప్రత్యేకత. మ్యాచ్ రిపోర్ట్ లను వేగంగా అందించడం, లైవ్ అప్ డేట్స్ ఇవ్వడంలో ఆయన ముందుంటారు. చందు తన కెరీర్ లో ప్రింట్ మీడియాలో ఎక్కువగా పనిచేశారు. ప్రముఖ దినపత్రిక ఈనాడులో ఏడేళ్లకు పైగా స్పోర్ట్స్ రిపోర్టర్ గా పనిచేశారు. తన ఆర్టికల్స్ తో ఎంతోమంది యువ క్రీడాకారుల ప్రతిభను వెలుగులోకి తెచ్చారు. ప్రత్యేక ఆర్టికల్స్ తో వాళ్లకు ఆర్థిక సాయం అందేలా చూశారు. క్రికెట్ ప్రపంచకప్ లు, ఒలింపిక్స్ లాంటి మెగా టోర్నీల కవరేజీలో ఆయనకు విశిష్ఠ అనుభవం ఉంది. మల్లారెడ్డి కాలేజీ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ నుంచి చందు బీటెక్ డిగ్రీ పొందారు. ఓ వైపు టెక్నికల్ నాలెడ్జ్ తో పాటు జర్నలిజంపై ప్రేమతో మీడియా రంగంలో కొనసాాగుతున్నారు. జర్నలిజంలో డిప్లొమా చేశారు. సినిమా వార్తలను, మూవీ రివ్యూలను, ఓటీటీ విషయాలను, క్రికెట్ సమాచారాన్ని, క్రీడా సంగతులను పాఠకులకు అందిస్తున్నారు.Read More

E-Paper


