ఆదిత్య ధర్ డైరెక్షన్‌లో రణ్‌వీర్ సింగ్ హీరోగా వచ్చిన 'ధురంధర్ 2' సినిమా కలెక్షన్ల పరంగా దూసుకుపోతున్నప్పటికీ, ఇప్పుడు ఒక పెద్ద వివాదంలో చిక్కుకుంది. సిక్కు కమ్యూనిటీ మతపరమైన మనోభావాలను దెబ్బతీసేలా ఈ సినిమాలో ఒక సీన్ ఉందంటూ పెద్ద ఎత్తున అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి. గురు గోవింద్ సింగ్ రాసిన పవిత్రమైన దశమ్ గ్రంథ్‌లోని ఒక పద్యం (గురుబాని) చదువుతూ, ఆర్. మాధవన్ చేసిన క్యారెక్టర్ సిగరెట్ కాల్చడం ఈ వివాదానికి ప్రధాన కారణమైంది.
'ధురంధర్ 2' మేకర్స్‌పై ఎఫ్ఐఆర్ నమోదు..

మనీకంట్రోల్ రిపోర్ట్ ప్రకారం, ధురంధర్ 2లోని ఈ వివాదాస్పద సీన్‌పై ముంబైలోని ములుండ్ పోలీస్ స్టేషన్‌లో ఒక ఎఫ్ఐఆర్ నమోదైంది. శివసేన (షిండే వర్గం) నాయకుడు, అలాగే 'సిక్స్ ఇన్ మహారాష్ట్ర' ఆర్గనైజేషన్ ప్రెసిడెంట్ అయిన గురుజ్యోత్ సింగ్ కీర్ ఈ కంప్లైంట్ ఇచ్చారు. సిక్కుల మనోభావాలను దెబ్బతీసిన ఈ వ్యవహారంలో డైరెక్టర్ ఆదిత్య ధర్, రణ్‌వీర్ సింగ్, ఆర్. మాధవన్‌లను ఆయన బాధ్యులుగా పేర్కొన్నారు.
గురుజ్యోత్ తన ఇన్‌స్టాగ్రామ్‌లో ఈ వివాదం గురించి ఒక డీటెయిల్డ్ వీడియోను స్టేట్‌మెంట్‌తో సహా పోస్ట్ చేశారు. ఆ క్యాప్షన్‌లో ఆయన ఇలా రాసుకొచ్చారు..
"ధురంధర్ 2 మేకర్స్ గురుబాని పట్ల చూపించిన ఈ తీవ్ర అగౌరవాన్ని నేను ఖండిస్తున్నాను. సిగరెట్ తాగుతూ మాధవన్ క్యారెక్టర్ రణ్‌వీర్ సింగ్‌తో మాట్లాడుతూ, పవిత్రమైన గురుబాని ‘సిరసో పెహచానియే జో లడే దీన్ కే హేత్’ చదవడం చాలా బాధాకరం. దీన్ని మేం అస్సలు అంగీకరించలేం. గురుబాని అనేది కేవలం ఒక డైలాగ్ కాదు.. అది దైవంతో సమానం.. సిక్కు కమ్యూనిటీకి అది ఎంతో పవిత్రమైనది. ఇలా బాధ్యత లేకుండా సినిమాలో చూపించడం మా విశ్వాసాల పట్ల వాళ్లకున్న అజ్ఞానాన్ని, సెన్సిటివిటీ లేకపోవడాన్ని చూపిస్తోంది. ఈ అవమానానికి వ్యతిరేకంగా సిక్కు కమ్యూనిటీ అంతా ఏకమై శాంతియుతంగా నిరసన తెలపాలని కోరుతున్నాను. ఎస్‌జీపీసీకి, సిక్కు కమ్యూనిటీకి ఆదిత్య ధర్, ఆర్. మాధవన్, రణ్‌వీర్ సింగ్ బహిరంగ క్షమాపణలు చెప్పకపోతే, వాళ్లు ఎక్కడ కనిపిస్తే అక్కడ నల్ల జెండాలు చూపిస్తూ నిరసన తెలపండి. ప్రతి మతాన్ని గౌరవించండి. ఇది క్రియేటివిటీ కాదు, పక్కాగా అగౌరవపరచడమే" అని ఆయన గట్టిగా రాసుకొచ్చారు.
క్షమాపణలు చెప్పాల్సిందే అంటున్న సిక్కులు..
ఆ వీడియోలో గురుజ్యోత్ మాట్లాడుతూ.. ఔరంగజేబు పాలనలో హిందువులు, సిక్కులు తీవ్ర హింసను అనుభవించిన చారిత్రక నేపథ్యంలో గురు గోవింద్ సింగ్ ఈ పద్యాన్ని రాశారని, దీనికి ఎంతో చారిత్రక, మతపరమైన ప్రాముఖ్యత ఉందని వివరించారు.
{{/usCountry}}ఆ వీడియోలో గురుజ్యోత్ మాట్లాడుతూ.. ఔరంగజేబు పాలనలో హిందువులు, సిక్కులు తీవ్ర హింసను అనుభవించిన చారిత్రక నేపథ్యంలో గురు గోవింద్ సింగ్ ఈ పద్యాన్ని రాశారని, దీనికి ఎంతో చారిత్రక, మతపరమైన ప్రాముఖ్యత ఉందని వివరించారు.
{{/usCountry}}ఈ పవిత్ర గ్రంథాలను ఎంతో గౌరవంగా చూడాలని నొక్కి చెప్పారు. సినిమా మేకర్స్, లీడ్ యాక్టర్స్ క్షమాపణలు చెప్పేలా శాంతియుతంగా నిరసనలు చేయాలని కమ్యూనిటీని కోరారు. "వెంటనే క్షమాపణలు చెప్పండి, లేదంటే సిక్కు కమ్యూనిటీ తలచుకుంటే ఏం చేయగలదో చరిత్ర ఇప్పటికే నిరూపించింది" అంటూ ఆయన గట్టి వార్నింగ్ కూడా ఇచ్చారు.
సోషల్ మీడియాలో ఈ సినిమా పోస్టర్లు, కొన్ని సీన్స్‌ను సర్క్యులేట్ చేస్తూ జనాలు విమర్శలు చేయడంతో ఈ వివాదం మరింత పెద్దదైంది. సిగరెట్ తాగుతున్న ఒక సిక్కు క్యారెక్టర్‌తో ఉన్న ఏఐ జనరేటెడ్ పోస్టర్ ఒకటి నెట్టింట వైరల్ కాగా, అది అఫీషియల్ పోస్టర్ కాదని అధికారులు క్లారిటీ ఇచ్చారు. అలాగే 'ప్రళయ్' అనే పాట కూడా ఆ సినిమాలో లేదని స్పష్టం చేశారు.
ఇన్ని వివాదాలు, అభ్యంతరాలు నడుస్తున్నప్పటికీ ఆదిత్య ధర్ డైరెక్ట్ చేసిన ధురంధర్ 2 బాక్సాఫీస్ దగ్గర మాత్రం సాలిడ్‌గా పెర్ఫార్మ్ చేస్తూనే ఉంది. సిక్కు కమ్యూనిటీ సభ్యులు లేవనెత్తిన ఈ అభ్యంతరాలపై, నమోదైన ఎఫ్ఐఆర్‌పై చిత్ర బృందం నుంచి ఇప్పటివరకు ఎలాంటి అఫీషియల్ రెస్పాన్స్ రాలేదు.