నటిగా మారిన భక్తి పాటల సింగర్ మనస్విని బాలబొమ్మల- 5 డిఫరెంట్ పాత్రలతో అంథలాజీ మూవీగా కొక్కోరోకో- ఫస్ట్ లుక్ రిలీజ్!
భక్తి పాటలతో సింగర్‌గా మంచి పేరు తెచ్చుకున్న మనస్విని బాలబొమ్మల వెండితెరపై ఎంట్రీ ఇస్తున్న సినిమా కొక్కోరోకో. ఐదు విభిన్న పాత్రలతో అంథాలజీ మూవీగా తెరకెక్కిన ఈ సినిమా నుంచి సంక్రాంతి సందర్భంగా స్పెషల్ పోస్టర్ రిలీజ్ అయింది. మరి మనస్విని బాలబొమ్మల ఫస్ట్ లుక్ విశేషాలపై ఓ లుక్కేద్దాం.
యువతరంలో మంచి గుర్తింపు సాధించే ప్రతిభావంతురాలైన మనస్విని బాలబొమ్మల తెలుగులో “కొక్కోరోకో” చిత్రంతో వెండితెరపైకి అడుగుపెట్టేందుకు సిద్ధమవుతున్నారు. ఇది ఆమె కళాత్మక ప్రయాణంలో ఒక ముఖ్యమైన మైలురాయిగా నిలవనుందని తెలుస్తోంది.

కొక్కోరోకో స్పెషల్ పోస్టర్
సంక్రాంతి పండుగ సందర్భంగా చిత్ర బృందం విడుదల చేసిన కొక్కోరోకో ప్రత్యేక పోస్టర్ అట్రాక్ట్ చేస్తోంది. సున్నితమైన, సంప్రదాయాత్మక భావంతో నిండిన ఈ పోస్టర్ వెంటనే ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించింది.
ఆ పోస్టర్‌పై “మా బంగర్రాజు కుటుంబం మీకు, మీ కుటుంబసభ్యులకు సంక్రాంతి శుభాకాకంక్షలు చెబుతోంది. ‘కొక్కోరోకో’ త్వరలో థియేటర్లలో” అనే క్యాప్షన్‌తో చిత్రానికి పండుగ వాతావరణాన్ని తీసుకొచ్చారు. ఈ సంక్రాంతి పోస్టర్ ద్వారా మనస్విని బాలబొమ్మల తొలి అధికారిక లుక్ కూడా విడుదలైంది.
టాలీవుడ్ డెబ్యూ
ఆ పోస్టర్‌లో సీనియర్ నటుడు సముద్రఖని సహా ఇతర నటులతో కలిసి మనస్విని బాలబొమ్మల కనిపించారు. ఈ చిత్రంలో మనస్విని బాలబొమ్మలది అతిథి పాత్ర అయినప్పటికీ, ఇది తెలుగు సినిమాల్లో ఆమెకు అధికారిక డెబ్యూ కానుంది. దీంతో మనస్విని బాలబొమ్మల టాలీవుడ్ డెబ్యూ మంచి స్పందనను రాబడుతోంది.
సినిమాల్లోకి రాకముందే మనస్విని ఒక శిక్షణ పొందిన, బహుముఖ ప్రతిభ కలిగిన కళాకారిణిగా తనదైన బలమైన పునాది వేసుకున్నారు. థియేటర్ రంగంలో లిటిల్ వుమెన్ నాటకంలో జోగా, మచ్ అడో ఎబౌట్ నథింగ్ (Much Ado About Nothing)లో బియాట్రిస్‌గా ప్రధాన పాత్రలను పోషించింది మనస్విని.
భక్తి గీతాలకు ప్రదర్శన
నటనతో పాటు మనస్విని బాలబొమ్మలకు పెరిని నాట్యం అనే శాస్త్రీయ నృత్యంలో శిక్షణ ఉండగా, కర్ణాటక సంగీతంలోనూ ప్రావీణ్యం సాధించారు. భక్తి గీతాల ప్రదర్శనలు ఇవ్వడం, గ్లెండేల్ అకాడమీలో ప్రధాన పాఠశాల కార్యక్రమాలకు యాంకరింగ్ చేయడం కూడా ఆమె కళా ప్రయాణంలో భాగమే.
ఇవే కాకుండా తెలుగులో డివోషనల్ సింగర్‌గా మనస్విని బాలబొమ్మల పేరు తెచ్చుకున్నారు. అమ్మా భవానీ అనే భక్తి పాటతో మనస్విని పాపులర్ అయ్యారు. ఇప్పుడు కొక్కోరోకో చిత్రంతో వెండితెరపై ఎంట్రీ ఇవ్వనున్నారు మనస్విని బాలబొమ్మల.
5 విభిన్న పాత్రలో అంథాలజీ మూవీ
ఇదిలా ఉంటే, “కొక్కోరోకో” చిత్రాన్ని దర్శకుడు రమేష్ వర్మ తన కొత్త బ్యానర్ ఆర్వీ ఫిల్మ్ హౌస్ ద్వారా తొలిసారి నిర్మాతగా మారి నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి శ్రీనివాస్ వసంతల దర్శకత్వం వహిస్తున్నారు. ఐదు విభిన్న పాత్రలతో కూడిన ఈ సంకలిత (అంథాలజీ) చిత్రం, సంప్రదాయ కోడిపందేల నేపథ్యాన్ని ప్రధానంగా తీసుకుంది.
రేఖా వర్మ, కురపాటి సిరీష నిర్మాతలుగా వ్యవహరిస్తున్న కొక్కోరోకో మూవీ షూటింగ్ పూర్తి చేసుకుని, నీలాద్రి ప్రొడక్షన్ పతాకంపై 2026లో విడుదలకు సిద్ధమవుతోంది. ఈ సినిమాకు సంకీర్తన్ సంగీతం అందించగా, ఆకాశ్ ఆర్ జోషి ఛాయాగ్రహణం, జివి సాగర్ సంభాషణలు అందించారు.
స్ట్రాంగ్ ఎమోషన్స్
కొక్కోరోకో కథన శైలి, ఆకట్టుకునే విజువల్స్, స్ట్రాంగ్ ఎమోషన్స్‌తో ప్రేక్షకులను ఆకట్టుకుంటుందని చిత్ర బృందం నమ్మకం వ్యక్తం చేస్తోంది. ఈ నేపథ్యంలో, మనస్విని బాలబొమ్మల సినీ ఆరంభం ఈ ప్రాజెక్ట్ ప్రయాణంలో ఒక ప్రత్యేక ఆకర్షణగా నిలవనుందని పేర్కొన్నారు.
ABOUT THE AUTHORChetupelli Sanjiv Kumarచెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్‌ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్‌సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.Read More

E-Paper


