పాపులర్ సింగర్ మంగ్లీ (Mangli) తాను పాడిన ఓ బూతు పాట విషయంలో వచ్చిన వివాదానికి ఫుల్‌స్టాప్ పెట్టే ప్రయత్నం చేసింది. తన పాటలోని కొన్ని పదాలు జనాల సెంటిమెంట్స్‌ను హర్ట్ చేయడంతో, వెంటనే రియాక్ట్ అయిన ఆమె సోషల్ మీడియాలో క్షమాపణ చెబుతూ ఓ స్టేట్‌మెంట్ రిలీజ్ చేసింది. మంగ్లీలాంటి సింగర్ సర్కే చునర్ అనే ఓ బూతు పాట ఎలా పాడిందన్న విమర్శల నేపథ్యంలో ఆమె తాజాగా వివరణ ఇచ్చింది. ఇలాంటి తప్పు మళ్లీ జరగదని కూడా ఆమె హామీ ఇచ్చింది.
మంగ్లీ ఇన్‌స్టాగ్రామ్ పోస్ట్‌లో ఏముందంటే..

తన ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్‌లో పోస్ట్ చేస్తూ మంగ్లీ ఇలా రాసుకొచ్చింది. "ప్రజల మనోభావాలను, వాళ్ల సెంటిమెంట్స్‌ను గౌరవిస్తూ.. ఆ సాంగ్‌ను అన్ని ప్లాట్‌ఫామ్స్ నుంచి పూర్తిగా డిలీట్ చేసేశాం. అనుకోకుండా జరిగిన ఈ పొరపాటుకు నేను మీ అందరికీ, ప్రతి ఒక్కరికీ మనస్ఫూర్తిగా క్షమాపణలు చెబుతున్నాను" అని చెప్పింది.
ఆమె ఇంకా కొనసాగిస్తూ.. "ఎవరి సెంటిమెంట్స్‌ను దెబ్బ తీయాలనే ఉద్దేశం మాకు ఏమాత్రం లేదు. మా వైపు నుంచి జరిగిన ఈ పొరపాటుకు మేం నిజంగా చాలా చింతిస్తున్నాం. ఇప్పుడు ఆ పాట లిరిక్స్‌ను కరెక్ట్ చేసి అప్‌డేట్ చేశాం. ఈరోజు సాయంత్రం ఆ సాంగ్ రివైజ్డ్ వెర్షన్ అఫీషియల్‌గా రిలీజ్ అవుతుంది. భవిష్యత్తులో మళ్లీ ఇలాంటి పరిస్థితి ఎప్పుడూ రాదని నేను మీకు పక్కాగా హామీ ఇస్తున్నాను" అని ఆమె చెప్పింది.
అదే సమయంలో ఈ మూవీ మేకర్స్ కు, తనకు ఈ అవకాశం ఇచ్చిన మ్యూజిక్ డైరెక్టర్ అర్జున్ జన్యాకు ఆమె థ్యాంక్స్ చెప్పింది.
సర్కే చునర్ సాంగ్ వివాదం
'కేడీ ద డెవిల్' సినిమాలో సంజయ్ దత్, నోరాలపై చిత్రీకరించిన ఈ 'సర్కే చునర్' సాంగ్ నిజానికి కన్నడ పాట. దీన్ని లిరిసిస్ట్ రకీబ్ ఆలం హిందీలోకి ట్రాన్స్‌లేట్ చేశాడు. ఈ విషయాన్ని ఆయనే వెల్లడించాడు. డైరెక్టర్ బలవంతం వల్లే హిందీలో బూతులు వాడానని రీసెంట్‌గా చెప్పిన విషయం తెలిసిందే. డబుల్ మీనింగ్ డైలాగులతో ఉన్న ఈ పాటపై సోషల్ మీడియాలో జనాలు, రాజకీయ నాయకులు తీవ్ర స్థాయిలో ఫైర్ అవ్వడంతో మేకర్స్ ఆ వీడియోను అన్ని ప్లాట్‌ఫామ్స్ నుంచి తొలగించారు.
ఈ వివాదం విషయంలో అందరూ డైరెక్టర్ నే నిందించారు. పాట రాసిన రకీబ్ ఆలమ్, ఇందులో డ్యాన్స్ చేసిన నోరా ఫతేహి ఇద్దరూ డైరెక్టర్ వల్లే ఇదంతా జరిగిందని చెప్పారు. ఆ బూతు పాటను తాను రాయలేదని, కేవలం ట్రాన్స్‌లేట్ చేశానని రకీబ్ చెప్పాడు. అటు నోరా స్పందిస్తూ.. అసలు హిందీలో తన ఇమేజ్ వాడుకోవడానికి అనుమతి ఇవ్వలేదని, ఆ లిరిక్స్ దుమారం రేపుతాయని ముందే తాను వార్నింగ్ ఇచ్చినట్లు తెలిపింది.
{{/usCountry}}ఈ వివాదం విషయంలో అందరూ డైరెక్టర్ నే నిందించారు. పాట రాసిన రకీబ్ ఆలమ్, ఇందులో డ్యాన్స్ చేసిన నోరా ఫతేహి ఇద్దరూ డైరెక్టర్ వల్లే ఇదంతా జరిగిందని చెప్పారు. ఆ బూతు పాటను తాను రాయలేదని, కేవలం ట్రాన్స్‌లేట్ చేశానని రకీబ్ చెప్పాడు. అటు నోరా స్పందిస్తూ.. అసలు హిందీలో తన ఇమేజ్ వాడుకోవడానికి అనుమతి ఇవ్వలేదని, ఆ లిరిక్స్ దుమారం రేపుతాయని ముందే తాను వార్నింగ్ ఇచ్చినట్లు తెలిపింది.
{{/usCountry}}