రియల్ ఇన్సిడెంట్స్ ఆధారంగా తెరకెక్కే సినిమాలకు మంచి క్రేజ్ ఉంటోంది. అలా నిజ జీవిత సంఘటనలను ఆధారంగా చేసుకుని తెరకెక్కుతోన్న లేటెస్ట్ తెలుగు సినిమానే రిమ్‌జిమ్. 1990ల కాలంలో ఆంధ్రప్రదేశ్‌లో చోటుచేసుకున్న సంఘటనల ఆధారంగా ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు.
పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో

రిమ్‌జిమ్ సినిమాకు హేమ సుందర్ దర్శకత్వం వహించారు. సచేతన్ రెడ్డి, డా. మానస, శ్రీనివాసరావు నిర్మాణంలో రూపొందించారు. ఈ రిమ్‌జిమ్’ మూవీకి ‘అస్లీదమ్’ అనేది ట్యాగ్‌లైన్. స్నేహం, ప్రేమ కథగా రూపొందిన ఈ రిమ్‌జిమ్ మూవీ ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో బిజీగా ఉంది.
త్వరలోనే రిలీజ్
ఈ సందర్భంగా దర్శకుడు హేమ సుందర్ మాట్లాడుతూ.. రిమ్‌జిమ్ సినిమా అవుట్‌పుట్ చాలా బాగా వచ్చిందని, త్వరలోనే విడుదల తేదీని ప్రకటించనున్నామని తెలిపారు. ప్రేక్షకులందరికీ నచ్చేలా సినిమాను తీర్చిదిద్దామని రిమ్‌జిమ్ డైరెక్టర్ హేమ సుందర్ చెప్పారు.
కీలక పాత్రలో రాహుల్ సిప్లిగంజ్
ఏవీ సినిమాస్, సి విజువల్స్ బ్యానర్లపై జి. సచేతన్ రెడ్డి, డాక్టర్ మానస, శ్రీనివాసరావు ఈ రిమ్‌జిమ్ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. దర్శకత్వంతోపాటు కథ, స్క్రీన్‌ప్లే బాధ్యతలను కూడా హేమ సుందర్ చేపట్టారు. ఈ చిత్రంలో ఆస్కార్ అవార్డుల్లో మెరిసిన రాహుల్ సిప్లిగంజ్ కీలక పాత్రలో నటించారు.
హీరో హీరోయిన్స్
అంతేకాకుండా రాహుల్ సిప్లిగంజ్ పాడిన రెండు పాటలు సినిమాకు ప్రధాన ఆకర్షణగా నిలవనున్నాయని మేకర్స్ చెబుతున్నారు. అయితే, రిమ్‌జిమ్ సినిమాలో అజయ్ వేద్ హీరోగా వ్రజన హీరోయిన్‌గా నటిస్తున్నారు. ఇతర ముఖ్య పాత్రల్లో బిత్తిరి సత్తి, రాజ్ తిరందాస్ కనిపించనున్నారు.
రియలిస్టిక్ టోన్
సాంకేతిక విభాగంలో సంగీతం కొక్కిలగడ్డ ఇఫ్రాయిం, సినిమాటోగ్రఫీ వాసు పెండం, ఎడిటింగ్ పెనుమత్స రోహిత్ నిర్వహిస్తున్నారు. రియలిస్టిక్ టోన్, భావోద్వేగాల మేళవింపుతో రూపొందుతున్న ‘గ్యాంగ్‌స్టర్’ ప్రేక్షకుల ముందుకు త్వరలో రానుందని మేకర్స్ తెలిపారు.
సింగర్‌గానే కాకుండా
{{/usCountry}}సాంకేతిక విభాగంలో సంగీతం కొక్కిలగడ్డ ఇఫ్రాయిం, సినిమాటోగ్రఫీ వాసు పెండం, ఎడిటింగ్ పెనుమత్స రోహిత్ నిర్వహిస్తున్నారు. రియలిస్టిక్ టోన్, భావోద్వేగాల మేళవింపుతో రూపొందుతున్న ‘గ్యాంగ్‌స్టర్’ ప్రేక్షకుల ముందుకు త్వరలో రానుందని మేకర్స్ తెలిపారు.
సింగర్‌గానే కాకుండా
{{/usCountry}}ఇదిలా ఉంటే, తన పాటలతో టాలీవుడ్‌ను ఊపేయడమే కాకుండా ‘నాటు నాటు’ పాటతో ఆస్కార్ వేదికపై మెరిసిన గొంతు రాహుల్ సిప్లిగంజ్. కేవలం సింగర్‌గానే కాకుండా ‘రంగమార్తాండ’లో తన నటనతోనూ రాహుల్ మెప్పించాడు.
కథను మలుపు తిప్పే పాత్ర
ఇప్పుడు ‘రిమ్‌జిమ్’ సినిమాలో సింగర్ రాహుల్ సిప్లిగంజ్ కీలక పాత్ర పోషించడం విశేషంగా మారింది. అలాగే, ఇటీవల విడుదలైన రాహుల్ సిప్లిగంజ్ ఫస్ట్ లుక్ పోస్టర్ సినిమాపై క్యూరియాసిటీని పెంచింది. రాహుల్ పోషించిన ఈ పాత్ర రిమ్‌జిమ్‌లో కథను మలుపు తిప్పే విధంగా ఉంటుందని చిత్రబృందం ధీమా వ్యక్తం చేస్తోంది.