క్రికెటర్ స్మృతి మంధాన, ప్రముఖ మ్యూజిక్ కంపోజర్ పలాష్ ముచ్చల్ తో తన నిశ్చితార్థాన్ని ధృవీకరించింది. అంతేకాదు తన పెళ్లి గురించి కూడా ఆమె హింట్ ఇచ్చింది. మున్నాభాయ్ మూవీలోని ఓ సాంగ్ తో కూడిన ఓ ఫన్నీ వీడియోను జెమీమా రోడ్రిగ్స్ ఇన్‌స్టాగ్రామ్ లో షేర్ చేసింది. ఆ వీడియో ఇప్పుడు వైరల్ అవుతోంది.
స్మృతి మంధాన ఎంగేజ్‌మెంట్

స్మృతి మంధాన త్వరలోనే పెళ్లి చేసుకోబోతోంది. తాజాగా గురువారం (నవంబర్ 20) తన వరల్డ్ కప్ విన్నింగ్ టీమ్మేట్స్ జెమీమా రోడ్రిగ్స్, శ్రేయాంకా పాటిల్, రాధా యాదవ్, అరుంధతి రెడ్డితో కలిసి చేసిన ఓ రీల్ వైరల్ అయింది. వీడియోలో.. మొదట జెమీమా.. స్మృతిని చూసి "భాయ్, నువ్వు చాలా సంతోషంగా ఉన్నావు. విషయం ఏంటి?" అని అడుగుతుంది. స్మృతి ఆనందంగా ఈల వేస్తుంది.
బ్యాక్‌గ్రౌండ్ లో 'లగే రహో మున్నాభాయ్' మూవీలోని "సంఝో హో హీ గయా" పాట ప్లే అవుతుండగా వాళ్లు డ్యాన్స్ చేశారు. ఆ తర్వాత సంజయ్ దత్ వాయిస్ లో స్మృతి మంధానా.. ఇక కార్డులు ప్రింట్ చేసుకో.. సూట్ లు కుట్టించుకో అని అంటుంది.
మొదట్లో ఇది సరదా టీమ్ మూమెంట్‌లా కనిపించినా చివర్లో స్మృతి మంధాన తన చేతికి ఉన్న నిశ్చితార్థపు ఉంగరాన్ని చూపించింది. దీంతో అభిమానులకు నిశ్చితార్థాన్ని ధృవీకరించింది. ఈ వీడియోను జెమీమా సోదరుడు, ఫోటోగ్రాఫర్ ఎనోచ్ రోడ్రిగ్స్ ఎడిట్ చేయగా, డాక్టర్ ప్రాచి గావాలి షూట్ చేశారు.
స్మృతి - పలాష్ ప్రేమ కథ
పలాష్ ముచ్చల్ ప్రముఖ గాయని పలక్ ముచ్చల్ సోదరుడు. ఇండోర్లో జరిగిన ఒక ఈవెంట్లో పలాష్ ముచ్చల్ తమ సంబంధాన్ని పరోక్షంగా సూచించారు. స్మృతి మంధాన త్వరలో ఇండోర్ కోడలు కాబోతుందని అతడు సరదాగా అన్నాడు.
{{/usCountry}}పలాష్ ముచ్చల్ ప్రముఖ గాయని పలక్ ముచ్చల్ సోదరుడు. ఇండోర్లో జరిగిన ఒక ఈవెంట్లో పలాష్ ముచ్చల్ తమ సంబంధాన్ని పరోక్షంగా సూచించారు. స్మృతి మంధాన త్వరలో ఇండోర్ కోడలు కాబోతుందని అతడు సరదాగా అన్నాడు.
{{/usCountry}}2024లో వారు డేటింగ్ చేస్తున్నట్లు ధృవీకరించినప్పటి నుండి వారు ఈవెంట్‌లలో, సోషల్ మీడియాలో కలిసి కనిపిస్తున్నారు. పలాష్ సోదరి పలక్ ముచ్చల్ స్మృతిని "అందమైన వ్యక్తి", తన “బెస్ట్ ఫ్రెండ్”గా పేర్కొంది. "ఆమెకు కుటుంబ విలువలు చాలా ముఖ్యం" అని పలక్ ప్రశంసించింది.
నవంబర్ 23న పెళ్లి?
అయితే స్మృతి మంధానా, పలాష్ పెళ్లి నవంబర్ 23నే జరగనున్నట్లు కూడా పలు వార్తలు వస్తున్నాయి. ఈ పెళ్లి కోసం ఇప్పటికే ప్రధాని నరేంద్ర మోదీ ఈ జంటకు శుభాకాంక్షలు చెబుతూ ఓ లేఖను పంపిన ఫొటోలు కూడా వైరల్ అవుతున్నాయి. దాని ద్వారానే వీళ్ల పెళ్లి తేదీ బయటకు వచ్చినట్లు సమాచారం. అయితే అసలు ప్రధాని లేఖ నిజమేనా లేదా అన్నదానిపై సందేహాలు ఉన్నాయి. ముఖ్యంగా ఆ లేఖలో ఉపయోగించిన భాష సాధారణంగా పీఎంవో నుంచి వచ్చినదిగా అనిపించడం లేదు.