Palash Muchhal: కుల వివక్ష ఆరోపణలు- దేవాలయాల బాట పట్టిన స్మృతి మంధాన మాజీ లవర్ పలాష్ ముచ్చల్- ఎక్కడ తల వంచానో అంటూ!

Palash Muchhal Visits Temples: క్రికెటర్ స్మృతి మంధాన మాజీ ప్రియుడు, సంగీత దర్శకుడు పలాష్ ముచ్చల్ చిక్కుల్లో పడ్డారు. ఒక వ్యక్తిపై కుల వివక్ష వ్యాఖ్యలు చేశారనే ఆరోపణలతో కేసు నమోదు కావడంతో, ఆయన ప్రస్తుతం ఆధ్యాత్మిక యాత్రలో నిమగ్నమయ్యారు. రాజస్థాన్‌లోని ప్రసిద్ధ ఆలయాలను సందర్శించాడు.

Published on: May 7, 2026, 11:00:57 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

Palash Muchhal Visits Temples: ప్రముఖ బాలీవుడ్ సింగర్ పాలక్ ముచ్చల్ సోదరుడు, సంగీత దర్శకుడు, క్రికెటర్ స్మృతి మంధాన మాజీ లవర్ పలాష్ ముచ్చల్ గత కొద్దిరోజులుగా వార్తల్లో నిలుస్తున్నారు. ఒకవైపు వ్యక్తిగత జీవితంలో ఇబ్బందులు, మరోవైపు చట్టపరమైన చిక్కులు ఆయనను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి.

కుల వివక్ష ఆరోపణలు- దేవాలయాల బాట పట్టిన స్మృతి మంధాన మాజీ లవర్ పలాష్ ముచ్చల్-  ఎక్కడ తల వంచానో అంటూ!
కుల వివక్ష ఆరోపణలు- దేవాలయాల బాట పట్టిన స్మృతి మంధాన మాజీ లవర్ పలాష్ ముచ్చల్- ఎక్కడ తల వంచానో అంటూ!

దేవాలయాల సందర్శన

ఈ క్రమంలోనే పలాష్ ముచ్చల్ రాజస్థాన్‌లోని ప్రసిద్ధ ఖాటూ శ్యామ్ జీ, సాలాసర్ బాలాజీ, జీవన్ మాత ఆలయాలను సందర్శించారు. దీనికి సంబంధించిన ఫోటోలను ఇన్‌స్టాగ్రామ్‌లో పంచుకుంటూ.. "ఎక్కడ తల వంచానో, అక్కడ ప్రశాంతత దొరికింది" అని క్యాప్షన్ ఇచ్చారు. అయితే, నెటిజన్ల నుంచి వచ్చే విమర్శలను తప్పించుకోవడానికి ఆయన తన పోస్ట్ కామెంట్ సెక్షన్‌ను నిలిపివేయడం గమనార్హం.

అసలేం జరిగింది? ఎందుకీ అట్రాసిటీ కేసు?

టీమ్ ఇండియా స్టార్ క్రికెటర్ స్మృతి మంధాన చిన్ననాటి స్నేహితుడు విజ్ఞాన్ ప్రకాష్ మానే ఫిర్యాదు మేరకు పలాష్ ముచ్చల్‌పై సాంగ్లీ పోలీసులు కేసు నమోదు చేశారు. ఎస్సీ, ఎస్టీ (అట్రాసిటీ నిరోధక) చట్టంలోని పలు సెక్షన్ల కింద ఈ కేసు నమోదైంది. ఫిర్యాదుదారు విజ్ఞాన్ తెలిపిన వివరాల ప్రకారం.. ఈ గొడవకు మూలం ఆర్థిక లావాదేవీలు.

25 లక్షలు అప్పుగా

ఒక సినిమా నిర్మాణ ప్రాజెక్ట్ కోసం విజ్ఞాన్ ప్రకాష్ నుంచి పలాష్ ముచ్చల్ రూ. 25 లక్షలు అప్పుగా తీసుకున్నారని సమాచారం. ఆ డబ్బు తిరిగి ఇచ్చే విషయంపై గత నవంబర్ 22న సాంగ్లీ-అష్టా రోడ్డులోని టోల్ ప్లాజా వద్ద వీరిద్దరి మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. ఆ సమయంలో పలాష్ తన కులం పేరుతో దూషించారని విజ్ఞాన్ ఫిర్యాదులో పేర్కొన్నారు. ప్రస్తుతం పోలీసులు ఈ వ్యవహారంపై దర్యాప్తు చేస్తున్నారు.

లాయర్ స్పందన.. ఇదంతా పబ్లిసిటీ స్టంట్టేనా?

పలాష్ ముచ్చల్ తరఫు న్యాయవాది శ్రేయాన్ష్ మిథారే ఈ ఆరోపణలను తీవ్రంగా ఖండించారు. విజ్ఞాన్ మానే కావాలనే పలాష్ ప్రతిష్టను దెబ్బతీయడానికి ఇలాంటి తప్పుడు ఫిర్యాదులు చేస్తున్నారని, ఇదంతా కేవలం పబ్లిసిటీ కోసమే చేస్తున్న స్టంట్ అని ఆయన కొట్టిపారేశారు. ఈ విషయంలో విజ్ఞాన్ ప్రకాష్‌పై తాము కూడా చట్టపరమైన చర్యలు తీసుకోబోతున్నామని స్పష్టం చేశారు.

స్మృతి మంధానతో పెళ్లి రద్దు.. గందరగోళంలో పలాష్!

గత ఏడాది నవంబర్ 23న పలాష్ ముచ్చల్, స్మృతి మంధాన వివాహం జరగాల్సి ఉంది. కానీ స్మృతి తండ్రికి అనారోగ్యం కారణంగా ఆ వేడుకలు అర్ధాంతరంగా నిలిచిపోయాయి. అదే సమయంలో పలాష్ కూడా ముంబైలోని ఆసుపత్రిలో చేరడం పలు అనుమానాలకు తావిచ్చింది.

కేసుల నేపథ్యంలో

ఆ తర్వాత వీరిద్దరి మధ్య బంధం తెగిపోయిందని, పలాష్ వేరొకరితో సన్నిహితంగా ఉండటమే ఇందుకు కారణమని సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున చర్చ నడిచింది. ఇప్పుడు తాజాగా అట్రాసిటీ కేసు నమోదు కావడంతో పలాష్ కెరీర్ మలుపు తిరిగినట్లయింది. ఇదిలా ఉంటే, అట్రాసిటీ వంటి కుల వివక్ష ఆరోపణలు, కేసుల నేపథ్యంలో పలాష్ ముచ్చల్ దేవాలయాలను సందర్శించడం ఆసక్తిగా మారింది.

తరచుగా అడిగే ప్రశ్నలు (FAQs)

1. పలాష్ ముచ్చల్‌పై ఎందుకు కేసు నమోదైంది?

స్మృతి మంధాన స్నేహితుడు విజ్ఞాన్ మానేను కులం పేరుతో దూషించారనే ఆరోపణలపై పలాష్ ముచ్చల్‌పై ఎస్సీ/ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదైంది. రూ. 25 లక్షల ఆర్థిక వివాదమే ఈ గొడవకు కారణమని తెలుస్తోంది.

2. పలాష్ ముచ్చల్ ప్రస్తుతం ఎక్కడ ఉన్నారు?

చట్టపరమైన ఇబ్బందుల నేపథ్యంలో ఆయన ఆధ్యాత్మిక పర్యటన కోసం రాజస్థాన్ వెళ్లారు. అక్కడ ఖాటూ శ్యామ్ జీ, సాలాసర్ బాలాజీ ఆలయాలను సందర్శించి ఆశీస్సులు తీసుకున్నారు.

3. స్మృతి మంధాన, పలాష్ ముచ్చల్ పెళ్లి ఎందుకు ఆగిపోయింది?

గత ఏడాది నవంబర్ లో జరగాల్సిన వీరి వివాహం స్మృతి తండ్రి ఆరోగ్య కారణాల వల్ల ఆగిపోయింది. ఆ తర్వాత వారిద్దరూ విడిపోయినట్లు వార్తలు వచ్చాయి.

  • Chetupelli Sanjiv Kumar
    ABOUT THE AUTHOR
    Chetupelli Sanjiv Kumar

    చెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్‌ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్‌సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.Read More