అక్కినేని వారి కోడలు, ప్రముఖ నటి శోభితా ధూళిపాళ (Sobhita Dhulipala) ప్రధాన పాత్రలో నటిస్తున్న లేటెస్ట్ తెలుగు క్రైమ్ థ్రిల్లర్ 'చీకటిలో'. థియేటర్ల జోలికి వెళ్లకుండా నేరుగా ఓటీటీలో విడుదల కాబోతున్న ఈ సినిమాపై భారీ అంచనాలున్నాయి. ఇటీవల విడుదలైన ట్రైలర్ సినిమాపై ఆసక్తిని పెంచేసింది.
చీకటిలో మూవీ కథేంటంటే?

శోభితా ధూళిపాళ ఓ క్రైమ్ పాడ్‌కాస్టర్ పాత్రలో నటించిన సినిమా చీకటిలో. ఇదొక ఇంటెన్స్ క్రైమ్ సస్పెన్స్ థ్రిల్లర్. ఇందులో శోభితా 'సంధ్య' అనే పాత్రలో కనిపించనుంది. సంధ్య 'ట్రూ క్రైమ్ పాడ్‌కాస్టర్' అంటే నిజ జీవిత నేరాల గురించి పాడ్‌కాస్ట్ చేసే వ్యక్తిగా నటించడం విశేషం. కథ ప్రకారం సంధ్య దగ్గర పనిచేసే ఒక ఇంటర్న్ అనుమానాస్పద స్థితిలో చనిపోతుంది.
ఆ మరణం వెనుక ఉన్న మిస్టరీని ఛేదించడానికి సంధ్య తన పాడ్‌కాస్ట్‌నే ఆయుధంగా మలచుకుంటుంది. ఈ ఇన్వెస్టిగేషన్ క్రమంలో హైదరాబాద్ నగరంలో ఒకప్పుడు భయపెట్టిన, ఇప్పుడు సైలెంట్‌గా ఉన్న ఒక సీరియల్ కిల్లర్ గురించిన షాకింగ్ నిజాలు బయటపడతాయి.
సోషల్ మీడియా, డిజిటల్ క్రైమ్స్ సమాజాన్ని ఎలా ప్రభావితం చేస్తున్నాయో ఇందులో చూపించబోతున్నారు. హంతకుడిని పట్టుకునే క్రమంలో సంధ్య ఎలాంటి ప్రమాదాలను ఎదుర్కొందన్నదే ఈ సినిమా కథ.
చీకటిలో మూవీ ఎప్పుడు, ఎక్కడ చూడాలి?
ఈ చీకటిలో సినిమా ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్ అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ కానుంది. ఈ శుక్రవారం అంటే జనవరి 23 నుంచి ప్రపంచవ్యాప్తంగా అందుబాటులోకి రానుంది. ఈ సినిమాను 'కిర్రాక్ పార్టీ' ఫేమ్ శరణ్ కొప్పిశెట్టి డైరెక్ట్ చేశాడు. ప్రముఖ నిర్మాత డి. సురేష్ బాబు (సురేష్ ప్రొడక్షన్స్) ఈ చిత్రాన్ని నిర్మించాడు. శోభితతో పాటు విశ్వదేవ్ రాచకొండ, సీనియర్ నటి ఆమని, ఝాన్సీ, చైతన్య విశాలాక్షి తదితరులు కీలక పాత్రల్లో నటించారు.
ఇటీవల విడుదలైన ట్రైలర్‌కు ఇండస్ట్రీ నుంచి మంచి రెస్పాన్స్ వచ్చింది. విక్టరీ వెంకటేష్, నాగ చైతన్య సోషల్ మీడియా వేదికగా ట్రైలర్ చాలా బాగుందని, శోభిత నటన ఆకట్టుకుందని ప్రశంసించారు. ఓ పాడ్‌కాస్టర్ సీరియల్ కిల్లర్ ను పట్టుకోవడం అనే సరికొత్త కాన్సెప్ట్ తో వస్తున్న థ్రిల్లర్ సినిమా ఇది. ఈ జానర్ మూవీస్ ఇష్టపడే వారికి ఈ వారం చీకటిలో బెస్ట్ ఆప్షన్. మరి ఈ పాత్రలో శోభిత ఎలా చేసిందో తెలుసుకోవాలంటే మరో నాలుగు రోజులు వేచి చూడాలి.
{{/usCountry}}ఇటీవల విడుదలైన ట్రైలర్‌కు ఇండస్ట్రీ నుంచి మంచి రెస్పాన్స్ వచ్చింది. విక్టరీ వెంకటేష్, నాగ చైతన్య సోషల్ మీడియా వేదికగా ట్రైలర్ చాలా బాగుందని, శోభిత నటన ఆకట్టుకుందని ప్రశంసించారు. ఓ పాడ్‌కాస్టర్ సీరియల్ కిల్లర్ ను పట్టుకోవడం అనే సరికొత్త కాన్సెప్ట్ తో వస్తున్న థ్రిల్లర్ సినిమా ఇది. ఈ జానర్ మూవీస్ ఇష్టపడే వారికి ఈ వారం చీకటిలో బెస్ట్ ఆప్షన్. మరి ఈ పాత్రలో శోభిత ఎలా చేసిందో తెలుసుకోవాలంటే మరో నాలుగు రోజులు వేచి చూడాలి.
{{/usCountry}}