...
...
Next Story

Sobhita Dhulipala: ఇలా పెళ్లి చేసుకుంటానని అనుకోలేదు.. ఎన్నో కలలు కనేదాన్ని: నాగ చైతన్యతో వివాహంపై శోభితా ధూళిపాళ్ల

Sobhita Dhulipala: అక్కినేని కోడలు శోభితా ధూళిపాళ్ల తాజాగా ఇంట్రెస్టింగ్ కామెంట్లు చేశారు. అక్కినేని నాగ చైతన్యను పెళ్లి చేసుకోవడంపై ఆమె కామెంట్లు వైరల్ గా మారాయి. సినీ ఇండస్ట్రీలో దశాబ్ద కాల ప్రయాణం, అక్కినేని నాగచైతన్యతో వివాహం, తన నటన గురించి శోభితా ఏం చెప్పారో ఇక్కడ చూసేయండి.

Published on: Aug 26, 2026, 05:49:26 IST
Advertisement

Sobhita Dhulipala: సినీ ఇండస్ట్రీలో పదేళ్ల కెరీర్ కంప్లీట్ చేసుకున్న శోభితా ధూళిపాళ్ల తాజాగా ఇచ్చిన ఇంటర్వ్యూ వైరల్ గా మారింది. బాలీవుడ్ దర్శకుడు అనురాగ్ కశ్యప్ రూపొందించిన 'రామన్ రాఘవ్ 2.0' సినిమాతో శోభితా ధూళిపాళ్ల వెండితెరకు పరిచయమయ్యారు. తొలి చిత్రంలోనే వేధింపులకు గురవుతూనే మానసికంగా బలమైన ప్రతిఘటన చూపే సంక్లిష్టమైన స్త్రీ పాత్రలో ఆమె నటించి ప్రశంసలు అందుకున్నారు.

నాగ చైతన్యతో పెళ్లి

ఇలా పెళ్లి చేసుకుంటానని అనుకోలేదు.. ఎన్నో కలలు కనేదాన్ని: నాగ చైతన్యతో వివాహంపై శోభితా ధూళిపాళ్ల (instagram-vogueindia)
ఇలా పెళ్లి చేసుకుంటానని అనుకోలేదు.. ఎన్నో కలలు కనేదాన్ని: నాగ చైతన్యతో వివాహంపై శోభితా ధూళిపాళ్ల (instagram-vogueindia)

టాలీవుడ్ హీరో అక్కినేని నాగ చైతన్యను 2024 డిసెంబర్ లో శోభితా ధూళిపాళ్ల పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే. చైని పెళ్లి చేసుకోవడంపై శోభితా ఇంట్రెస్టింగ్ కామెంట్లు చేశారు.

"ఒక నటుడిని లేదా నా సొంత రాష్ట్రానికి చెందిన వ్యక్తిని పెళ్లి చేసుకుంటానని నేను ఎప్పుడూ అనుకోలేదు. కానీ చిన్నతనం నుంచే నా మనసులో ఒక కోరిక ఉండేది. నా మాతృభూమి సాంస్కృతిక విశేషాలు, సంప్రదాయాలు ఉట్టిపడేలా నా పెళ్లి జరగాలని కలలు కనేదాన్ని" అని తన సంప్రదాయ తెలుగు వివాహ వేడుకను శోభితా గుర్తుచేసుకున్నారు.

పరుగు నుంచి ప్రశాంతత వైపు..

ఈ దశాబ్దం ప్రారంభంలో ఓటీటీ ప్రాజెక్టులు, వరుస సినిమాలు, షూటింగ్ స్పాట్ల నుంచి రెడ్ కార్పెట్ ప్రిమియర్ల వరకు శోభితా ఎంతో బిజీగా గడిపారు. భావోద్వేగాలను అనుభవించే సమయం కూడా లేనంత వేగంగా ఆమె జీవితం సాగింది.

"అప్పట్లో అదొక సుడిగుండంలా ఉండేది. ఆ పరుగును నేను బాగా ఆస్వాదించాను. కానీ ఇప్పుడు ఆ ప్రవాహం నన్ను నడిపించకుండా, నన్ను నేనే ప్రశాంతంగా నిలబెట్టుకుంటున్నాను. ఇలా స్లో అవ్వడాన్ని ఇంతగా ఆస్వాదిస్తానని నేను ఎప్పుడూ అనుకోలేదు" అని శోభితా తన విషయాలను పంచుకున్నారు.

'చీకటిలో' నుంచి 'వెట్టువమ్' వరకు

అన్ని రంగాల్లో వరుస ఆఫర్లు వస్తున్నప్పటికీ, ఇది తనను తాను పరిశీలించుకోవాల్సిన సమయమని శోభితా చెబుతున్నారు. "ఒక నటిగా సమాజం గుర్తింపు ఇవ్వాలని ఆరాటపడటం సహజం. మన పాత్రలు ఇతరుల వినోదం కోసం ఉపయోగపడే క్రమంలో నా నటన ఒక ఉత్పత్తిగా మారిపోతుంది. నా దృష్టిలో ప్రధాన పాత్రధారిగా ఉండటం అంటే ఎలాంటి ఆలోచనలకు లోనుకాకుండా ఉండటమే. నిశ్చలంగా ఉండటమే అసలైన విజయం" అని శోభితా వెల్లడించారు.

ఇప్పటివరకు 18 చిత్రాలు, వెబ్ సిరీస్‌లలో మాత్రమే నటించినప్పటికీ, శోభితా ఎంచుకునే పాత్రల తీరు టాలీవుడ్‌తో పాటు భారతీయ చిత్ర పరిశ్రమలో ప్రత్యేక గుర్తింపు తెచ్చిపెట్టింది.

 
ABOUT THE AUTHOR
Chandu Shanigarapu

చందు శనిగారపు ప్రస్తుతం హిందూస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ రైట‌ర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. మీడియా రంగంలో ఎనిమిదేళ్లకు పైగా అనుభవం ఆయన సొంతం. 2025 నుంచి డిజిటల్ మీడియాలోనూ తనదైన ముద్ర వేస్తున్నారు. సినిమా వార్తలను ఎప్పటికప్పుడు అందించడం, స్పోర్ట్స్ న్యూస్ ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలను చదివించేలా ఇవ్వడం ఆయన ప్రత్యేకత. మ్యాచ్ రిపోర్ట్ లను వేగంగా అందించడం, లైవ్ అప్ డేట్స్ ఇవ్వడంలో ఆయన ముందుంటారు. చందు తన కెరీర్ లో ప్రింట్ మీడియాలో ఎక్కువగా పనిచేశారు. ప్రముఖ దినపత్రిక ఈనాడులో ఏడేళ్లకు పైగా స్పోర్ట్స్ రిపోర్టర్ గా పనిచేశారు. తన ఆర్టికల్స్ తో ఎంతోమంది యువ క్రీడాకారుల ప్రతిభను వెలుగులోకి తెచ్చారు. ప్రత్యేక ఆర్టికల్స్ తో వాళ్లకు ఆర్థిక సాయం అందేలా చూశారు. క్రికెట్ ప్రపంచకప్ లు, ఒలింపిక్స్ లాంటి మెగా టోర్నీల కవరేజీలో ఆయనకు విశిష్ఠ అనుభవం ఉంది. మల్లారెడ్డి కాలేజీ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ నుంచి చందు బీటెక్ డిగ్రీ పొందారు. ఓ వైపు టెక్నికల్ నాలెడ్జ్ తో పాటు జర్నలిజంపై ప్రేమతో మీడియా రంగంలో కొనసాాగుతున్నారు. జర్నలిజంలో డిప్లొమా చేశారు. సినిమా వార్తలను, మూవీ రివ్యూలను, ఓటీటీ విషయాలను, క్రికెట్ సమాచారాన్ని, క్రీడా సంగతులను పాఠకులకు అందిస్తున్నారు.

SHARE THIS ARTICLE ON
Hindustantimes wants to start sending you push notifications. Click allow to subscribe