Anirudh Kavya: ఏకంగా పెళ్లి డేట్ ఫిక్స్ చేశారు కదా.. గ్రీస్‌లో డెస్టినేషన్ వెడ్డింగ్.. అనిరుధ్, కావ్య మారన్ వివాహం?
Anirudh Kavya Wedding: ఇండియన్ మ్యూజిక్ సెన్సేషన్ అనిరుధ్ రవిచందర్, సన్‌రైజర్స్ హైదరాబాద్ సీఈఓ కావ్య మారన్ పెళ్లి వార్త నెట్టింట వైరల్ గా మారింది. నవంబర్ 10న గ్రీస్‌లో డెస్టినేషన్ వెడ్డింగ్ జరగనుందని తమిళ మీడియా కథనాలు పేర్కొంటున్నాయి. వెడ్డింగ్ ప్రచారం వెనుక ఉన్న వాస్తవం ఏంటో ఇక్కడ చూసేద్దాం.
Anirudh Kavya Wedding: సంగీత ప్రపంచంలో రికార్డుల రారాజుగా వెలుగుగొందుతున్న అనిరుధ్, వ్యాపార రంగంలో తనదైన ముద్ర వేసిన కావ్య మారన్ వివాహం చేసుకోబోతున్నారనే రూమర్లు గత కొద్దికాలంగా తెగ చక్కర్లు కొడుతున్నాయి. తాజాగా వీళ్ల పెళ్లి డేట్ ఇదే అంటూ ఓ వార్త వైరల్ గా మారింది.

నవంబర్ 10 వెడ్డింగ్ డేట్
మ్యూజిక్ సెన్సేషన్ అనిరుధ్ రవిచందర్, కావ్య మారన్ పెళ్లి చేసుకోబోతున్నారనే తాజా ప్రచారం సోషల్ మీడియాను హోరెత్తిస్తోంది. నవంబర్ 10న డెస్టినేషన్ వెడ్డింగ్ తో ఈ జంట ఒక్కటి కాబోతుందని తెలిసింది.
గ్రీస్ లో పెళ్లి
మొదట సెషెల్స్ దీవులలో పెళ్లి చేసుకోవాలని అనిరుధ్, కావ్య మారన్ అనుకున్నట్లు తెలిసింది. అయితే చివరకు గ్రీస్‌లోని సుందరమైన ప్రదేశాన్ని ఎంచుకున్నారని సమాచారం. కుటుంబ సభ్యులు, అత్యంత సన్నిహితుల మధ్య నవంబర్ 10న వీళ్ల ప్రైవేట్ డెస్టినేషన్ వెడ్డింగ్ జరగనుందని వార్తలు వస్తున్నాయి.
ఈ సినిమాలు
ప్రస్తుతం ఇండియాలో మోస్ట్ డిమాండ్ ఉన్న మ్యూజిక్ డైరెక్టర్లలో అనిరుధ్ ఒకరు. ఆయన చేతినిండా సినిమాలున్నాయి. ప్రస్తుతం 'జైలర్ 2', 'ది ప్యారడైజ్', షారూఖ్ ఖాన్ 'కింగ్' వంటి భారీ చిత్రాలకు సంగీతం అందిస్తున్నాడు అనిరుధ్. అయితే పెళ్లి కోసం బ్రేక్ తీసుకునే కంటే ముందే తన పెండింగ్ వర్క్‌ను వేగంగా పూర్తి చేసే పనిలో ఉన్నాడని టాక్.
ఆ కామెంట్లతో
అనిరుధ్, కావ్య మారన్ పెళ్లి ప్రచారానికి ప్రధానంగా బలం చేకూరడానికి అనిరుధ్ బాబాయ్, ప్రముఖ నటుడు వై.జి. మహేంద్రన్ (Y.G. Mahendran) ఒక ఇంటర్వ్యూలో చేసిన వ్యాఖ్యలే కారణం.
"నాకు తెలిసినంతవరకు వారిద్దరికీ పెళ్లి జరగబోతోంది. కావ్య సాధారణ అమ్మాయి కాదు, ఐపీఎల్ టీమ్‌ను నడిపించగల సమర్థురాలు. తండ్రి బిజినెస్ జీన్స్ ఆమెకు వచ్చాయి. వారిద్దరూ మంచి జోడీ" అని మహేంద్రన్ పేర్కొనడంతో సోషల్ మీడియాలో ఈ పెళ్లి వార్త ఒక్కసారిగా వైరల్ అయింది.
అప్పుడు అనిరుధ్ రియాక్షన్
అనిరుధ్, కావ్య పెళ్లి వార్తలు వైరల్ కావడం ఇదే మొదటిసారి కాదు. గతంలోనూ అనిరుధ్-కావ్య వివాహంపై కథనాలు రాగా ఇరు వర్గాలు స్పందించాయి.
గతంలో వచ్చిన డేటింగ్ రూమర్లపై అనిరుధ్ స్పందిస్తూ.. రూమర్లను వ్యాప్తి చేయడం ఆపండని పోస్టు పెట్టాడు. కావ్య మారన్ పీఆర్ టీమ్ సైతం ఈ కథనాల్లో నిజం లేదని ప్రకటించాయి.
ఇప్పుడు ఏంటీ?
ప్రస్తుతం గ్రీస్ వెడ్డింగ్ డేట్ నెట్టింట చక్కర్లు కొడుతున్నప్పటికీ సన్ నెట్‌వర్క్ (Sun Network) కానీ, అనిరుధ్ కానీ అధికారికంగా స్పందించలేదు. మీడియా దృష్టికి దూరంగా ప్రైవేట్ వేడుకగా ముగించేందుకు ప్లాన్ చేస్తున్నారా లేదా ఇది మరో సాధారణ ప్రచారమేనా అనేది తెలియాల్సి ఉంది.
అనిరుధ్-కావ్య మారన్ పెళ్లి వార్తలు కేవలం సినీ ఇండస్ట్రీలోనే కాకుండా స్పోర్ట్స్, కార్పొరేట్ వర్గాల్లోనూ హాట్ టాపిక్‌గా మారాయి. అయితే ఇరు కుటుంబాల నుంచి అధికారిక ప్రకటన వచ్చే వరకు వీటిని క్లెయిమ్స్‌గానే చూడాల్సి ఉంటుంది.
ABOUT THE AUTHORChandu Shanigarapuచందు శనిగారపు ప్రస్తుతం హిందూస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ రైటర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. మీడియా రంగంలో ఎనిమిదేళ్లకు పైగా అనుభవం ఆయన సొంతం. 2025 నుంచి డిజిటల్ మీడియాలోనూ తనదైన ముద్ర వేస్తున్నారు. సినిమా వార్తలను ఎప్పటికప్పుడు అందించడం, స్పోర్ట్స్ న్యూస్ ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలను చదివించేలా ఇవ్వడం ఆయన ప్రత్యేకత. మ్యాచ్ రిపోర్ట్ లను వేగంగా అందించడం, లైవ్ అప్ డేట్స్ ఇవ్వడంలో ఆయన ముందుంటారు. చందు తన కెరీర్ లో ప్రింట్ మీడియాలో ఎక్కువగా పనిచేశారు. ప్రముఖ దినపత్రిక ఈనాడులో ఏడేళ్లకు పైగా స్పోర్ట్స్ రిపోర్టర్ గా పనిచేశారు. తన ఆర్టికల్స్ తో ఎంతోమంది యువ క్రీడాకారుల ప్రతిభను వెలుగులోకి తెచ్చారు. ప్రత్యేక ఆర్టికల్స్ తో వాళ్లకు ఆర్థిక సాయం అందేలా చూశారు. క్రికెట్ ప్రపంచకప్ లు, ఒలింపిక్స్ లాంటి మెగా టోర్నీల కవరేజీలో ఆయనకు విశిష్ఠ అనుభవం ఉంది. మల్లారెడ్డి కాలేజీ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ నుంచి చందు బీటెక్ డిగ్రీ పొందారు. ఓ వైపు టెక్నికల్ నాలెడ్జ్ తో పాటు జర్నలిజంపై ప్రేమతో మీడియా రంగంలో కొనసాాగుతున్నారు. జర్నలిజంలో డిప్లొమా చేశారు. సినిమా వార్తలను, మూవీ రివ్యూలను, ఓటీటీ విషయాలను, క్రికెట్ సమాచారాన్ని, క్రీడా సంగతులను పాఠకులకు అందిస్తున్నారు.Read More

E-Paper


