Sobhita Dhulipala: అత్తమామలతో ఎయిర్‌పోర్టులో శోభిత స్వీట్ మూమెంట్.. నాగ్ 67వ బర్త్‌డేకు ముందు హగ్ చేసుకొని..

Sobhita Dhulipala: శోభిత ధూళిపాళ ఎయిర్ పోర్టు వీడియో వైరల్ అవుతోంది. అందులో తన భర్తతో కలిసి వచ్చిన ఆమె.. మామ నాగర్జున, అత్త అమలతో జాలీగా కనిపించింది. నాగ్ 67వ పుట్టిన రోజు వేడుకల కోసం వీళ్లంతా వెకేషన్ కోసం వెళ్లారు.

Published on: Aug 27, 2026, 18:51:30 IST
By , Hyderabad
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

Sobhita Dhulipala: కింగ్ అక్కినేని నాగార్జున (Akkineni Nagarjuna) తన 67వ పుట్టినరోజును జరుపుకోవడానికి ఫ్యామిలీతో కలిసి స్పెషల్ వెకేషన్‌కు బయలుదేరారు. ఆగస్టు 29న నాగార్జున బర్త్‌డే సందర్భంగా హైదరాబాద్ ఎయిర్‌పోర్ట్‌లో అక్కినేని ఫ్యామిలీ సందడి చేసింది. ఈ క్రమంలో కోడలు శోభిత ధూళిపాళ తన మామగ నాగార్జున, అత్త అమలతో కలసి కనిపించిన స్వీట్ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది.

Sobhita Dhulipala: అత్తమామలతో ఎయిర్‌పోర్టులో శోభిత స్వీట్ మూమెంట్.. నాగ్ 67వ బర్త్‌డేకు ముందు హగ్ చేసుకొని..
Sobhita Dhulipala: అత్తమామలతో ఎయిర్‌పోర్టులో శోభిత స్వీట్ మూమెంట్.. నాగ్ 67వ బర్త్‌డేకు ముందు హగ్ చేసుకొని..

ఎయిర్‌పోర్ట్‌లో శోభిత-అమల సందడి.. సోషల్ మీడియాలో వైరల్

ఫొటోగ్రాఫర్లు తీసిన వీడియోలో నాగ చైతన్య, శోభిత కలిసి నాగార్జున, అమల దగ్గరకు రావడం కనిపించింది. శోభిత ఎంతో ప్రేమతో ముందుగా నాగార్జునను, ఆ తర్వాత అమలను ఆత్మీయంగా కౌగిలించుకుంది. తన కుటుంబ సభ్యులంతా కలిసి వెకేషన్‌కు వస్తుండటంతో నాగార్జున ముఖంలో చిరునవ్వులు వికసించాయి.

మరో వీడియోలో శోభిత, అమల ఎంతో ఉత్సాహంగా ముచ్చట్లు పెడుతూ ఎయిర్‌పోర్ట్ లోపలికి నడిచారు. వారి వెనకాలే నాగ చైతన్య తన లగేజ్ బ్యాగ్ పట్టుకుని స్టాఫ్‌తో మాట్లాడుతుండగా, నాగార్జున కూడా పక్కనే నవ్వుతూ కనిపించారు. అయితే ఈ వెకేషన్‌లో అఖిల్ అక్కినేని, ఆయన భార్య జైనబ్ రవ్‌జీ ఎక్కడా కనిపించకపోవడంతో ఫ్యాన్స్ కొంచెం సర్‌ప్రైజ్ అయ్యారు.

'కింగ్ 100' గ్రాండ్ అప్‌డేట్.. టబుతో మళ్లీ మ్యాజిక్

ఆగస్టు 29తో 67వ పడిలోకి అడుగుపెడుతున్న నాగార్జున కెరీర్ విషయంలో మాత్రం నెక్స్ట్ లెవెల్ ప్రాజెక్ట్‌లతో దూసుకుపోతున్నారు. రీసెంట్‌గా శేఖర్ కమ్ముల 'కుబేర' సినిమాలో ధనుష్, రష్మిక మందన్నతో కలిసి నటించిన ఆయన, లోకేష్ కనగరాజ్ 'కూలీ' మూవీలో సూపర్ స్టార్ రజనీకాంత్‌తో కలిసి స్క్రీన్ షేర్ చేసుకున్నారు.

ఇక నాగార్జున కెరీర్‌లో అత్యంత ప్రతిష్టాత్మకమైన 100వ సినిమా 'కింగ్ 100' రా కార్తీక్ దర్శకత్వంలో తెరకెక్కుతోంది. అన్నపూర్ణ స్టూడియోస్ బ్యానర్‌పై స్వయంగా నిర్మిస్తున్న ఈ సినిమా ఫస్ట్ గ్లింప్స్‌ను ఆయన బర్త్‌డే రోజునే రిలీజ్ చేయడానికి మేకర్స్ ప్లాన్ చేశారు. 'నిన్నే పెళ్లాడుతా', 'ఆవిడా మా ఆవిడే' లాంటి బ్లాక్‌బస్టర్స్ తర్వాత నాగార్జున సరసన బాలీవుడ్ నటి టబు మళ్లీ నటిస్తుండటంతో అంచనాలు అంబరాన్ని తాకుతున్నాయి.

మాస్ అండ్ క్లాస్ హిట్స్‌తో అక్కినేని హీరోల హవా

ఒకవైపు నాగార్జున సెకండ్ ఇన్నింగ్స్‌లో విలక్షణమైన పాత్రలు ఎంచుకుంటూ బిజీగా ఉంటే, మరోవైపు ఆయన ఇద్దరు కొడుకులు నాగ చైతన్య, అఖిల్ రీసెంట్‌గా సాలిడ్ హిట్స్ అందుకున్నారు. అర్బన్ బాయ్ ఇమేజ్‌ను పక్కనబెట్టి మాస్ లుక్‌లోకి మారిన నాగ చైతన్య 'తండేల్' సినిమాతో బాక్సాఫీస్ దగ్గర బ్లాక్‌బస్టర్ హిట్ కొట్టారు. అదే బాటలో అఖిల్ అక్కినేని కూడా 'లెనిన్' మూవీతో మంచి సక్సెస్ అందుకున్నారు.

ఇక పర్సనల్ లైఫ్ విషయానికి వస్తే, 2022లో పరిచయమైన నాగ చైతన్య, శోభిత ధూళిపాళ 2024లో హైదరాబాద్‌లోని అన్నపూర్ణ స్టూడియోస్ వేదికగా డ్రీమ్ వెడ్డింగ్ చేసుకున్నారు. ఎయిర్‌పోర్ట్‌లో శోభిత అక్కినేని ఫ్యామిలీతో బాండింగ్ చూసిన నెటిజన్లు 'క్యూట్ ఫ్యామిలీ' అంటూ కామెంట్స్ వర్షం కురిపిస్తున్నారు.

  • Hari Prasad S
    ABOUT THE AUTHOR
    Hari Prasad S

    హరి ప్రసాద్ శీలమంతుల ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. మీడియా రంగంలో 20 ఏళ్లకు పైగా సుదీర్ఘ అనుభవం కలిగిన ఆయన, డిజిటల్ మీడియాలో గత 10 ఏళ్లుగా విశేష సేవలందిస్తున్నారు. ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలు, సినిమా వార్తలను అందించడంలో ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఆయన తన అద్భుతమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. హరి ప్రసాద్ తన కెరీర్‌లో ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా వంటి మూడు ప్రధాన విభాగాల్లోనూ పనిచేశారు. హిందుస్థాన్ టైమ్స్‌లో చేరకముందు, ఆయన తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ దినపత్రికలు, టీవీ ఛానెళ్లయిన ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి వంటి సంస్థలలో కీలక బాధ్యతలు నిర్వహించారు. నవంబర్ 1, 2021న హిందుస్థాన్ టైమ్స్ తెలుగు టీమ్‌లో చేరిన ఆయన.. ప్రస్తుతం స్పోర్ట్స్ (ముఖ్యంగా క్రికెట్ అనాలసిస్), ఎంటర్‌టైన్మెంట్ సెక్షన్ల బాధ్యతలను చూసుకుంటున్నారు. ఈయన ఉస్మానియా యూనివర్సిటీ నుంచి బీఎస్సీ (కంప్యూటర్ సైన్స్) పట్టా పొందారు. సాంకేతిక పరిజ్ఞానంతో పాటు జర్నలిజంపై ఉన్న మక్కువతో జర్నలిజంలో డిప్లొమా పూర్తి చేసి, వృత్తిపరమైన నైపుణ్యాలను మెరుగుపరుచుకున్నారు. క్రీడా రంగంలో వస్తున్న మార్పులను, సినిమా ఇండస్ట్రీ అప్‌డేట్స్‌ను లోతుగా విశ్లేషించి పాఠకులకు అర్థమయ్యే రీతిలో అందించడం హరి ప్రసాద్ శైలి.Read More