...
...
Next Story

Sobhita Dhulipala: వాటిని సీరియస్‌గా తీసుకోను.. వెదర్ మారినట్లే అవీ మారిపోతుంటాయి: చైతన్యతో పెళ్లిపై శోభిత

Sobhita Dhulipala: నాగ చైతన్య పెళ్లి సమయంలో సోషల్ మీడియాలో జరిగిన చర్చలు, ట్రోల్స్ పై తాజాగా ఓ ఇంటర్వ్యూలో శోభితా ధూళిపాళ్ల స్పందించింది. ఈ చర్చలన్నీ ఓ వెదర్ లాంటివని, ఎప్పటికప్పుడు మారిపోతూ ఉంటాయని అనడం విశేషం.

Published on: May 31, 2026, 07:04:45 IST
By , Hyderabad
Prefer HTon Google
Advertisement

Sobhita Dhulipala: అక్కినేని వారసుడు నాగచైతన్య, నటి శోభితా ధూళిపాళ్ల వివాహం 2024 డిసెంబర్‌లో హైదరాబాద్‌లోని అన్నపూర్ణ స్టూడియోస్‌లో అత్యంత వైభవంగా జరిగిన సంగతి తెలిసిందే. అప్పటివరకు తమ బంధాన్ని సీక్రెట్‌గా ఉంచిన ఈ జంట.. పెళ్లి తర్వాత లైమ్‌లైట్‌లోకి వచ్చారు.

Sobhita Dhulipala: వాటిని సీరియస్‌గా తీసుకోను.. వెదర్ మారినట్లే అవీ మారిపోతుంటాయి: చైతన్యతో పెళ్లిపై శోభిత
Sobhita Dhulipala: వాటిని సీరియస్‌గా తీసుకోను.. వెదర్ మారినట్లే అవీ మారిపోతుంటాయి: చైతన్యతో పెళ్లిపై శోభిత

అయితే తమ రిలేషన్‌షిప్, పెళ్లిపై సోషల్ మీడియాలో జరిగిన చర్చలు, ట్రోల్స్, జనాల నుంచి వచ్చిన అటెన్షన్‌పై శోభితా ధూళిపాళ్ల తాజాగా స్పందించారు. ‘గలాటా ప్లస్’కి ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో ఆమె తన వ్యక్తిగత జీవితం, నెగిటివిటీని ఎలా ఎదుర్కొంటారో వివరించారు.

నాకు చాలా నేర్పించాయి

తన పర్సనల్ లైఫ్‌పై వస్తున్న విపరీతమైన అటెన్షన్ నుండి ఎలా దూరంగా ఉంటారనే ప్రశ్నకు శోభిత చాలా పరిణతితో కూడిన సమాధానం ఇచ్చారు.

"ఇలాంటి పరిస్థితులన్నీ నాకు చాలా విషయాలు నేర్పించాయి. నా వ్యక్తిగత జీవితంపై ప్రజల్లో కొంత ఆసక్తి, క్యూరియాసిటీ ఉండటం సహజం. నేను నా జీవితాన్ని నా స్టైల్లో జీవిస్తున్నాను. నా నుండి జనాలు ఎలాంటి రియాక్షన్ ఆశిస్తున్నారో నాకు తెలియదు. ప్రస్తుతం నేను చాలా ప్రశాంతమైన స్థితిలో ఉన్నాను. నాపై వచ్చే భిన్నమైన అభిప్రాయాల మధ్య కూడా నన్ను నేను ప్రభావితం చేసుకోకుండా స్థిరంగా ఉండగలను" అని శోభిత చెప్పారు.

ఇదీ ఓ వెదర్‌లాంటిదే

"ప్రస్తుతం ప్రతి విషయంపై సమాజంలో చాలా చర్చలు, హీట్ నడుస్తున్నాయి. ఇదంతా ఒక వాతావరణం లాంటిది. సమాజానికి కూడా ఒక 'వెదర్' ఉంటుంది. దీన్ని మనం అంత సీరియస్‌గా తీసుకోకూడదు. ఇది ఎప్పటికీ శాశ్వతం కాదు. వాతావరణం ఎలాగూ మారుతుంది.. అలాగే ఈ చర్చలు కూడా మారుతాయి. దీన్ని తట్టుకోవాలంటే మనపై మనకు స్పష్టత, కేంద్రీకృత మైండ్ ఉండాలి" అని ఆమె స్పష్టం చేశారు.

నాగ చైతన్య - శోభిత రిలేషన్‌షిప్ టైమ్‌లైన్

ప్రస్తుతం వీరిద్దరూ తమ వృత్తిపరమైన జీవితంలో వైవిధ్యమైన ప్రాజెక్ట్‌లతో బిజీగా ఉన్నారు. శోభిత ఈ మధ్యే చీకటిలో అనే ప్రైమ్ వీడియో మూవీతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం తెలిసిందే. ఇది కాకుండా పా రంజిత్ డైరెక్షన్ లో వెట్టువం అనే తమిళ మూవీ చేస్తోంది. అటు నాగ చైతన్య వృషకర్మ అనే మైథలాజికల్ అడ్వెంచర్ థ్రిల్లర్ లో నటిస్తున్నారు.

ఈ ‘వృషకర్మ’ మూవీలో మీనాక్షి చౌదరి హీరోయిన్‌గా నటిస్తుండగా, ‘లాపతా లేడీస్’ ఫేమ్ స్పర్ష్ శ్రీవాస్తవ విలన్ పాత్రలో నటిస్తున్నారు. బి.వి.ఎస్.ఎన్ ప్రసాద్, సుకుమార్ రైటింగ్స్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

తరచుగా అడిగే ప్రశ్నలు (FAQs)

1. నాగచైతన్య, శోభితా ధూళిపాళ్ల వివాహం ఎప్పుడు, ఎక్కడ జరిగింది?

వీరి వివాహం 2024 డిసెంబర్‌లో హైదరాబాద్‌లోని అన్నపూర్ణ స్టూడియోస్‌లో అత్యంత ప్రైవేట్‌గా జరిగింది.

2. తన పర్సనల్ లైఫ్‌పై వచ్చే కామెంట్స్ గురించి శోభిత ఏమన్నారు?

సమాజంలో వచ్చే చర్చలు, నెగిటివిటీ అన్నీ వాతావరణం (Weather) లాంటివని, అవి ఎప్పుడూ శాశ్వతం కావని, కాబట్టి వాటిని సీరియస్‌గా తీసుకోకుండా మన ప్రయాణంపై మనం దృష్టి పెట్టాలని శోభిత అభిప్రాయపడ్డారు.

3. నాగ చైతన్య నటిస్తున్న ‘వృషకర్మ’ ఏ జోనర్‌లో రాబోతోంది?

ఇది హారర్, మైథాలజీ (పురాణాలు), అడ్వెంచర్, యాక్షన్ ఎలిమెంట్స్ కలగలిసిన ఒక వినూత్న థ్రిల్లర్ చిత్రం. దీనికి ‘విరూపాక్ష’ ఫేమ్ కార్తీక్ దండు దర్శకత్వం వహిస్తున్నారు.

 
ABOUT THE AUTHOR
Hari Prasad S

హరి ప్రసాద్ శీలమంతుల ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. మీడియా రంగంలో 20 ఏళ్లకు పైగా సుదీర్ఘ అనుభవం కలిగిన ఆయన, డిజిటల్ మీడియాలో గత 10 ఏళ్లుగా విశేష సేవలందిస్తున్నారు. ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలు, సినిమా వార్తలను అందించడంలో ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఆయన తన అద్భుతమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. హరి ప్రసాద్ తన కెరీర్‌లో ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా వంటి మూడు ప్రధాన విభాగాల్లోనూ పనిచేశారు. హిందుస్థాన్ టైమ్స్‌లో చేరకముందు, ఆయన తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ దినపత్రికలు, టీవీ ఛానెళ్లయిన ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి వంటి సంస్థలలో కీలక బాధ్యతలు నిర్వహించారు. నవంబర్ 1, 2021న హిందుస్థాన్ టైమ్స్ తెలుగు టీమ్‌లో చేరిన ఆయన.. ప్రస్తుతం స్పోర్ట్స్ (ముఖ్యంగా క్రికెట్ అనాలసిస్), ఎంటర్‌టైన్మెంట్ సెక్షన్ల బాధ్యతలను చూసుకుంటున్నారు. ఈయన ఉస్మానియా యూనివర్సిటీ నుంచి బీఎస్సీ (కంప్యూటర్ సైన్స్) పట్టా పొందారు. సాంకేతిక పరిజ్ఞానంతో పాటు జర్నలిజంపై ఉన్న మక్కువతో జర్నలిజంలో డిప్లొమా పూర్తి చేసి, వృత్తిపరమైన నైపుణ్యాలను మెరుగుపరుచుకున్నారు. క్రీడా రంగంలో వస్తున్న మార్పులను, సినిమా ఇండస్ట్రీ అప్‌డేట్స్‌ను లోతుగా విశ్లేషించి పాఠకులకు అర్థమయ్యే రీతిలో అందించడం హరి ప్రసాద్ శైలి.

SHARE THIS ARTICLE ON
Hindustantimes wants to start sending you push notifications. Click allow to subscribe