శ్రీనివాస్ ఉలిశెట్టి, సత్య ఈషా జంటగా నటించిన తాజా చిత్రం ‘రాయుడి గారి తాలుకా’. ఉలిశెట్టి మూవీస్ బ్యానర్‌పై ఈ సినిమాను నిర్మిస్తున్నారు. రాయుడి గారి తాలుకా సినిమాకు కొర్రపాటి నవీన్ శ్రీ దర్శకత్వం వహించారు.
షూటింగ్ పూర్తి, సాంగ్ రిలీజ్

ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకుని, ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో వేగంగా దూసుకుపోతోంది రాయుడి గారి తాలుకా చిత్రం. తాజాగా రాయుడు గారి తాలుకా సినిమా నుంచి ‘జాతరొచ్చింది’ అనే లిరికల్ సాంగ్‌ను రిలీజ్ చేశారు. సోగ్గాడే చిన్ని నాయన, బంగార్రాజు చిత్రాల దర్శకుడు కల్యాణ్ కృష్ణ కూరసాల ఈ పాటను విడుదల చేశారు.
నగేష్ గౌరీష్ సంగీతం
ఈ మాస్ బీట్ పాటకు గురుబిల్లి జగదీష్ సాహిత్యం అందించగా, నగేష్ గౌరీష్ హుషారైన సంగీతాన్ని సమకూర్చారు. గాయని జయశ్రీ పల్లెం అద్భుతంగా ఆలపించారు. పక్కా గ్రామీణ నేపథ్యంలో పక్కా మాస్ బీట్‌తో సాగే ఈ జాతర పాట ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంటోంది.
ఒక్క రాత్రిలోనే
ఒకప్పుడు జానపద గీతాలు కేవలం పల్లెలకే పరిమితం అయ్యేవి, కానీ ఇప్పుడు సోషల్ మీడియా పుణ్యమా అని ఒక్క రాత్రిలోనే గల్లీ నుంచి ఢిల్లీ దాకా వైరల్ అవుతున్నాయి. పక్కా లోకల్ ఫ్లేవర్‌తో, చెవిలో పడగానే స్టెప్పులు వేయించే ఈ పాట ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో మారుమోగిపోతోంది.
జాతర వైబ్స్
ఒక ఊరి జాతర అంటేనే సందడి, డప్పుల మోత, యువత కేరింతలు. సరిగ్గా అదే వాతావరణాన్ని ఈ పాట కళ్ళకు కట్టినట్టు చూపిస్తోంది. ముఖ్యంగా "రాయుడిగారి తాలూకా.. జాతరొచ్చింది" అంటూ సాగే పల్లవి, దానికి తోడైన ఆ డప్పుల బీట్ వింటుంటే ఎవరైనా సరే చిందేయాల్సిందే. ఈ పాటలో కనిపించిన నృత్యకారుల ఎనర్జీ, వారి సహజసిద్ధమైన స్టెప్పులు నెటిజన్లను విపరీతంగా ఆకట్టుకుంటున్నాయి.
రాయుడి గారి తాలుకా నిర్మాతలు
ఇదిలా ఉంటే, రాయుడి గారి తాలుకా చిత్రాన్ని ఉలిశెట్టి నిత్యశ్రీ, ఉలిశెట్టి పునర్వికా వేద శ్రీ, నవీన్ శ్రీ కొర్రపాటి, పీజే దేవి,కరణం పేరినాయుడు సంయుక్తంగా నిర్మిస్తున్నారు.
రాయుడి గారి తాలుకా నటీనటులు
అలాగే, రాయుడి గారి తాలుకా సినిమాలో సుమన్, కిట్టయ్య, ఆర్కే నాయుడు, సలార్ పూజ, కరణం శ్రీహరి, ఉలిశెట్టి నాగరాజు, సృజనక్షిత వంటి ప్రముఖ నటీనటులు కీలక పాత్రల్లో కనిపించనున్నారు. త్వరలోనే ఈ సినిమా విడుదల తేదీని ప్రకటించనున్నట్లు నిర్మాతలు తెలిపారు.
{{/usCountry}}అలాగే, రాయుడి గారి తాలుకా సినిమాలో సుమన్, కిట్టయ్య, ఆర్కే నాయుడు, సలార్ పూజ, కరణం శ్రీహరి, ఉలిశెట్టి నాగరాజు, సృజనక్షిత వంటి ప్రముఖ నటీనటులు కీలక పాత్రల్లో కనిపించనున్నారు. త్వరలోనే ఈ సినిమా విడుదల తేదీని ప్రకటించనున్నట్లు నిర్మాతలు తెలిపారు.
{{/usCountry}}