Sony Vizha TV: తమిళ వినోద రంగంలోకి సోనీ గ్రాండ్ ఎంట్రీ.. కొత్త బుల్లితెర ఛానెల్ సోనీ విళా ప్రకటన!

Sony Pictures Network Announced Sony Vizha TV Channel: దక్షిణాది టీవీ రంగాన్ని ఏలేందుకు సోనీ పిక్చర్స్ నెట్‌వర్క్ ఇండియా భారీ స్కెచ్ వేసింది. తమిళ ప్రేక్షకుల అభిరుచులకు అనుగుణంగా 'సోనీ విళా' (Sony VIZHA) పేరుతో సరికొత్త ఎంటర్‌టైన్‌మెంట్ ఛానెల్‌ను అక్టోబరులో ప్రారంభించనుంది.

Published on: Aug 15, 2026, 21:50:02 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

Sony Network Announced Sony Vizha TV Channel: భారతీయ బుల్లితెరపై తనకంటూ ప్రత్యేక స్థానాన్ని ఏర్పరచుకున్న సోనీ పిక్చర్స్ నెట్‌వర్క్ ఇండియా (SPNI) ఇప్పుడు తమిళ ప్రాంతీయ మార్కెట్‌పై కన్నేసింది. 'సోనీ విళా' (Sony VIZHA) పేరుతో ఒక కొత్త తమిళ జనరల్ ఎంటర్‌టైన్‌మెంట్ ఛానెల్‌ను అందుబాటులోకి తీసుకురాబోతున్నట్లు అధికారికంగా ప్రకటించింది.

తమిళ వినోద రంగంలోకి సోనీ గ్రాండ్ ఎంట్రీ.. కొత్త బుల్లితెర ఛానెల్ సోనీ విళా ప్రకటన!
తమిళ వినోద రంగంలోకి సోనీ గ్రాండ్ ఎంట్రీ.. కొత్త బుల్లితెర ఛానెల్ సోనీ విళా ప్రకటన!

ఆగస్టు 15 స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా

ఆగస్టు 15 స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా పిల్లలు ఆలపించిన తమిళనాడు రాష్ట్ర గీతం ‘తమిళ్ తాయ్ వాళ్తు’ వేదికగా ఈ ఛానెల్ పేరు, లోగోను ఆవిష్కరించారు. సౌత్ ఇండియాలో ఇప్పటికే సన్ టీవీ, విజయ్ టీవీ, జీ తమిళ వంటి దిగ్గజ ఛానెల్స్ గట్టి పోటీ ఇస్తున్నాయి.

అక్టోబర్ నుంచి ప్రసారాలు.. బిగ్ ప్లానింగ్!

ఈ పోటీని తట్టుకొని తమిళ ఇంటింటి సంస్కృతి, ఆచారాలు, ప్రాంతీయ భావోద్వేగాలకు అద్దం పట్టే కథలతో ముందుకు రావడం సోనీ లక్ష్యంగా కనిపిస్తోంది. ఈ ఏడాది అక్టోబరు నుంచి సోనీ విళా ఛానెల్‌లో ప్రసారాలు ప్రారంభం కానున్నాయి.

ఓటీటీ ప్లాట్‌ఫామ్‌పై కూడా

కేవలం టీవీకే పరిమితం కాకుండా ఓటీటీ ప్లాట్‌ఫామ్ (OTT) వేదికగా కూడా ఒరిజినల్ ఫిక్షన్ షోలు, గ్లోబల్ రియాలిటీ ఫార్మాట్లు, ప్రతిష్టాత్మక సినిమాలు ప్రేక్షకులకు అందించేలా ప్రణాళికలు సిద్ధం చేశారు. తమిళ సంస్కృతి మూలాలను కాపాడుతూనే, సరికొత్త తరహా వినోదాన్ని అందిస్తామని సంస్థ ప్రతినిధులు తెలిపారు. ఈ సందర్భంగా సోనీ పిక్చర్స్ నెట్‌వర్క్ ఇండియా సౌత్ రీజినల్ చీఫ్ కంటెంట్ ఆఫీసర్ రాజారామన్ సుందరం మాట్లాడారు.

ప్రతీ తమిళ కుటుంబానికి సొంత ఛానెల్‌లా

"సోనీ విళా ద్వారా తమిళ వినోద రంగంలోకి చాలా బాధ్యతాయుతంగా, గౌరవంతో అడుగుపెడుతున్నాం. నేటి తరం తమిళ ప్రేక్షకుల ఆలోచనలకు, అభిరుచులకు తగ్గట్టుగా ఉండే కథలను అందించడమే మా ముఖ్య ఉద్దేశం. ప్రతీ తమిళ కుటుంబానికి ఇది సొంత ఛానెల్‌లా అనిపిస్తుంది" అని రాజారామన్ సుందరం ఆశాభావం వ్యక్తం చేశారు.

బుల్లితెర రేటింగ్స్ యుద్ధం

దక్షిణాది టీవీ మార్కెట్‌లో ప్రాంతీయ ఛానెళ్లకు ఉన్న క్రేజ్ అంతా ఇంతా కాదు. ముఖ్యంగా తెలుగు, తమిళ భాషల్లో వీక్షకుల సంఖ్య చాలా ఎక్కువ. ఈ క్రమంలో సోనీ నెట్‌వర్క్ తమిళంలో సొంతంగా ఛానెల్ ప్రారంభించడం బుల్లితెర రేటింగ్స్ యుద్ధాన్ని మరింత ఆసక్తికరంగా మార్చనుంది. ఈ ఛానెల్‌లో ప్రసారమయ్యే సీరియళ్లు, షోలకు సంబంధించిన మరిన్ని వివరాలను త్వరలోనే వెల్లడించనున్నారు.

కేబీసీ, సీఐడీ తరహాలోనే జాతీయ స్థాయి ఫ్రాంచైజీలు

ఇందులో సమంత హోస్ట్‌గా మాస్టర్ చెఫ్ తమిళ షోను ప్రసారం చేయనున్నారు. ఇప్పటికే దేశవ్యాప్తంగా విశేష ఆదరణ పొందిన 'కౌన్ బనేగా కరోడ్‌పతి' (KBC), 'ఇండియన్ ఐడల్', 'సీఐడీ' (CID), 'క్రైమ్ పెట్రోల్' వంటి పాపులర్ షోలను నిర్మించిన అనుభవం సోనీ సంస్థకు ఉంది.

తమిళ నేటివిటికీ తగ్గట్లు

అదే స్థాయిలో తమిళ నేటివిటీకి సరిపోయే రీతిలో భారీ నిర్మాణ విలువలతో సరికొత్త షోలను ఇక్కడ డిజైన్ చేస్తున్నారు. దక్షిణాది వినోద రంగంలో సన్, విజయ్ వంటి దిగ్గజ ఛానెళ్లకు పోటీగా సోనీ విళా ఏస్థాయిలో అలరిస్తుందో చూడాలి.

  • Chetupelli Sanjiv Kumar
    ABOUT THE AUTHOR
    Chetupelli Sanjiv Kumar

    చెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్‌ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్‌సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.Read More