...
...
Next Story

Sourav Ganguly: గంగూలీకి షాక్.. హక్కులకు భంగం అని చెప్పినా ఆ సినిమా రిలీజ్‌కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన కోర్టు.. ఏమైందంటే?

Sourav Ganguly Doosra Movie: వ్యక్తిగత హక్కులు ఉల్లంఘనకు గురయ్యాయంటూ టీమిండియా మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ దాఖలు చేసిన పిటిషన్‌పై ఢిల్లీ హైకోర్టు కీలక తీర్పు ఇచ్చింది. అభినయ్ దేవ్ దర్శకత్వంలో తెరకెక్కిన 'దూస్రా' అక్టోబర్ 23న థియేటర్లలో విడుదలకు సిద్ధమవ్వగా.. స్టే ఇచ్చేందుకు కోర్టు నిరాకరించింది.

Published on: Oct 22, 2026, 20:47:33 IST
By , Hyderabad
Prefer HTon Google
Advertisement

Sourav Ganguly Doosra Movie: టీమిండియా మాజీ కెప్టెన్, భారత క్రికెట్ దిగ్గజం సౌరవ్ గంగూలీ దాఖలు చేసిన అత్యంత వివాదాస్పద పిటిషన్‌పై ఢిల్లీ హైకోర్టు (Delhi High Court) గురువారం సంచలన తీర్పు వెలువరించింది. అక్టోబర్ 23న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలోకి రానున్న 'దూస్రా' (Doosra) సినిమా విడుదలను తక్షణమే నిలిపివేయాలని (స్టే ఇవ్వాలని) గంగూలీ దాఖలు చేసిన పిటిషన్‌ను న్యాయస్థానం తిరస్కరించింది.

Sourav Ganguly: గంగూలీకి షాక్.. హక్కులకు భంగం అని చెప్పినా ఆ సినిమా రిలీజ్‌కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన కోర్టు.. ఏమైందంటే? (PTI)
Sourav Ganguly: గంగూలీకి షాక్.. హక్కులకు భంగం అని చెప్పినా ఆ సినిమా రిలీజ్‌కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన కోర్టు.. ఏమైందంటే? (PTI)

జస్టిస్ దినేష్ భట్ నేతృత్వంలోని ధర్మాసనం ఈ కేసును విచారిస్తూ.. "సినిమా విడుదలపై ఎలాంటి స్టే ఇవ్వడం లేదు, సినిమా అనుకున్న ప్రకారం థియేటర్లలో ప్రదర్శించవచ్చు" అని స్పష్టం చేశారు. అయితే ఈ కేసుకు సంబంధించిన తదుపరి విచారణను శుక్రవారానికి వాయిదా వేశారు. గంగూలీ చారిత్రాత్మక లార్డ్స్ మైదానంలో షర్ట్‌లెస్ సెలబ్రేషన్స్, నాట్‌వెస్ట్ సిరీస్ ఫుటేజ్‌పై బీసీసీఐ నుంచి హక్కులు పొందినట్లు నిర్మాతలు హైకోర్టుకు తెలిపారు.

అసలు గంగూలీ ఎందుకు కోర్టుకెళ్లారు?

తన అనుమతి లేకుండా, తన పర్సనాలిటీ రైట్స్‌ను (Personality Rights) వాణిజ్యపరంగా దుర్వినియోగం చేస్తూ 'దూస్రా' చిత్రాన్ని తెరకెక్కించారని సౌరవ్ గంగూలీ, అలాగే ఆయన బయోపిక్ హక్కులను పొందిన నిర్మాణ సంస్థ 'లవ్ ఫిల్మ్స్' (Luv Films LLP) ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించాయి.

పిటిషన్‌లో పేర్కొన్న వివరాల ప్రకారం.. 2001లో లవ్ ఫిల్మ్స్‌ సంస్థ గంగూలీ జీవిత చరిత్ర ఆధారంగా 'దాదా – ది సౌరవ్ గంగూలీ స్టోరీ' (Dada – The Sourav Ganguly Story) అనే అధికారిక బయోపిక్‌ను నిర్మించేందుకు ఒప్పందం కుదుర్చుకుంది. ఈ సినిమా మే 14, 2027న విడుదల కావాల్సి ఉంది.

మరోవైపు 'దూస్రా' చిత్ర నిర్మాతల తరఫు న్యాయవాదులు కోర్టులో తమ బలమైన వాదనలను వినిపించారు. ఈ సినిమా సౌరవ్ గంగూలీ బయోపిక్ కాదని, రాజస్థాన్‌కు చెందిన 'తార' అనే ఒక చిన్న గ్రామీణ అమ్మాయి కథ అని కోర్టుకు వివరించారు. గంగూలీ లార్డ్స్ బాల్కనీలో షర్ట్ విప్పి చేసిన ఆవేశపూరిత సెలబ్రేషన్స్ ను టీవీలో చూసి ప్రేరణ పొందిన ఆ అమ్మాయి, తన జీవితంలో సమాజం విధించిన ఆంక్షలను ధిక్కరించి ఎలా స్వేచ్ఛను పొందిందనేదే ఈ సినిమా కథాంశమని తెలిపారు.

అంతేకాకుండా నాట్‌వెస్ట్ సిరీస్‌కు సంబంధించిన మ్యాచ్ ఫుటేజ్‌ను ఉపయోగించుకోవడానికి భారత క్రికెట్ నియంత్రణ మండలి (BCCI) నుంచి అధికారికంగా లైసెన్స్ పొందినట్లు స్పష్టం చేశారు. క్రికెట్ మ్యాచ్ ఫుటేజ్‌పై ఆటగాళ్లకు వ్యక్తిగతంగా ఎలాంటి హక్కులు ఉండవని కోర్టుకు నివేదించారు.

'దూస్రా' సినిమా విశేషాలు

ప్లబితా బోర్ఠాకూర్ (Plabita Borthakur) ప్రధాన పాత్రలో నటించిన 'దూస్రా' చిత్రానికి ప్రసిద్ధ దర్శకుడు అభినయ్ దేవ్ దర్శకత్వం వహించారు. మాషా సజ్దే, రోహన్ సజ్దే ఈ చిత్రాన్ని నిర్మించగా, రామ్ సంపత్ సంగీతం అందించారు.

2002 లార్డ్స్ విజయం నేపథ్యంలో ఒక సాధారణ యువతి ఆత్మవిశ్వాసాన్ని నింపుకునే కథాంశంతో వస్తున్న ఈ చిత్రం అక్టోబర్ 23న థియేటర్లలోకి అడుగుపెడుతోంది. ఢిల్లీ హైకోర్టు తీర్పుతో చిత్రబృందం ఊపిరి పీల్చుకుంది.

 
ABOUT THE AUTHOR
Hari Prasad S

హరి ప్రసాద్ శీలమంతుల ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. మీడియా రంగంలో 20 ఏళ్లకు పైగా సుదీర్ఘ అనుభవం కలిగిన ఆయన, డిజిటల్ మీడియాలో గత 10 ఏళ్లుగా విశేష సేవలందిస్తున్నారు. ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలు, సినిమా వార్తలను అందించడంలో ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఆయన తన అద్భుతమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. హరి ప్రసాద్ తన కెరీర్‌లో ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా వంటి మూడు ప్రధాన విభాగాల్లోనూ పనిచేశారు. హిందుస్థాన్ టైమ్స్‌లో చేరకముందు, ఆయన తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ దినపత్రికలు, టీవీ ఛానెళ్లయిన ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి వంటి సంస్థలలో కీలక బాధ్యతలు నిర్వహించారు. నవంబర్ 1, 2021న హిందుస్థాన్ టైమ్స్ తెలుగు టీమ్‌లో చేరిన ఆయన.. ప్రస్తుతం స్పోర్ట్స్ (ముఖ్యంగా క్రికెట్ అనాలసిస్), ఎంటర్‌టైన్మెంట్ సెక్షన్ల బాధ్యతలను చూసుకుంటున్నారు. ఈయన ఉస్మానియా యూనివర్సిటీ నుంచి బీఎస్సీ (కంప్యూటర్ సైన్స్) పట్టా పొందారు. సాంకేతిక పరిజ్ఞానంతో పాటు జర్నలిజంపై ఉన్న మక్కువతో జర్నలిజంలో డిప్లొమా పూర్తి చేసి, వృత్తిపరమైన నైపుణ్యాలను మెరుగుపరుచుకున్నారు. క్రీడా రంగంలో వస్తున్న మార్పులను, సినిమా ఇండస్ట్రీ అప్‌డేట్స్‌ను లోతుగా విశ్లేషించి పాఠకులకు అర్థమయ్యే రీతిలో అందించడం హరి ప్రసాద్ శైలి.

SHARE THIS ARTICLE ON
Notifications

Get breaking alerts directly from the newsroom

Notifications are on!You'll be notified when news breaks