ఇండియా గర్వించదగ్గ చంద్రయాన్ మిషన్ల ప్రయాణాన్ని కళ్లకు కట్టేలా తెరకెక్కించిన వెబ్ సిరీస్ 'స్పేస్ జెన్ - చంద్రయాన్' (Space Gen – Chandrayaan). ప్రముఖ నిర్మాణ సంస్థ ది వైరల్ ఫీవర్ (టీవీఎఫ్) నిర్మించిన ఈ సిరీస్ జనవరి 23, 2026 నుంచి జియో హాట్‌స్టార్ (JioHotstar)లో స్ట్రీమింగ్ కానుంది.
స్పేస్ జెన్ ఓటీటీ

భారతీయులందరూ తలెత్తుకునేలా చేసిన ఇస్రో (ISRO) ప్రయోగాల వెనుక ఉన్న కృషిని, శాస్త్రవేత్తల పట్టుదలను చూపించేందుకు ఒక అద్భుతమైన సిరీస్ రాబోతోంది. పంచాయత్, కోటా ఫ్యాక్టరీ వంటి సూపర్ హిట్ సిరీస్‌లను అందించిన టీవీఎఫ్ సంస్థ దీన్ని నిర్మిస్తోంది. జియోహాట్‌స్టార్ ఓటీటీ జనవరి 23, 2026న రిపబ్లిక్ డే వీకెండ్ కానుకగా ఈ వెబ్ సిరీస్ ను స్ట్రీమింగ్ చేయనుంది.
మేకర్స్ ఎమోషనల్ పోస్ట్
ఈ సిరీస్ గురించి ప్రకటిస్తూ మేకర్స్ ఇన్‌స్టాగ్రామ్‌లో ఒక ఎమోషనల్ క్యాప్షన్ పెట్టారు. "కలలు కనేవాళ్ల కోసం.. వాటిని నిజం చేసి చూపించేవాళ్ల కోసం.. జాబిల్లి వైపు ఆశగా చూసే ప్రతి భారతీయుడి కోసం.. హాట్‌స్టార్ స్పెషల్స్: 'స్పేస్ జెన్ - చంద్రయాన్' త్వరలో మీముందుకు.." అని రాసుకొచ్చారు.
చంద్రయాన్ ప్రస్థానం: సిరీస్ లో ఏం ఉంటుంది?
ఈ వెబ్ సిరీస్ ఇస్రో చేపట్టిన చంద్రయాన్ మిషన్ల చుట్టూ తిరుగుతుంది. 2008లో చేపట్టిన చంద్రయాన్-1 చంద్రుడిపై నీటి జాడను కనిపెట్టిన మొట్టమొదటి మిషన్ ఇది. ఈ మిషన్ తో ప్రపంచాన్నే నివ్వెర పరిచింది ఇస్రో.
ఆ తర్వాత 2019లో చంద్రయాన్-2 ఆర్బిటర్, ల్యాండర్ (విక్రమ్), రోవర్ (ప్రజ్ఞాన్)తో చేసిన భారీ ప్రయోగం. ల్యాండింగ్ సమయంలో చిన్న ఇబ్బందులు వచ్చినా ఇది ఇస్రో పట్టుదలకు నిదర్శనం.
{{/usCountry}}ఆ తర్వాత 2019లో చంద్రయాన్-2 ఆర్బిటర్, ల్యాండర్ (విక్రమ్), రోవర్ (ప్రజ్ఞాన్)తో చేసిన భారీ ప్రయోగం. ల్యాండింగ్ సమయంలో చిన్న ఇబ్బందులు వచ్చినా ఇది ఇస్రో పట్టుదలకు నిదర్శనం.
{{/usCountry}}ఇక 2023లో చంద్రయాన్-3తో చరిత్ర సృష్టించింది. యావత్ ప్రపంచం ఆశ్చర్యపోయేలా చంద్రుడి దక్షిణ ధ్రువం (South Pole)పై సాఫ్ట్ ల్యాండింగ్ చేసిన ఘనత ఇస్రోకి దక్కింది.
బెంగళూరు కేంద్రంగా పనిచేసే ఇస్రో.. అతి తక్కువ ఖర్చుతో ప్రపంచ స్థాయి స్పేస్ మిషన్లను ఎలా చేపట్టిందో ఈ సిరీస్ ద్వారా మనం చూడొచ్చు.