Kirsten Dunst Sells Lake Home To Annie Potts: హాలీవుడ్ సెలబ్రిటీల నివాసాలు ఎప్పుడూ అభిమానుల్లో ప్రత్యేక ఆసక్తిని రేకెత్తిస్తాయి. 'స్పైడర్ మ్యాన్' సినిమాలతో ప్రపంచవ్యాప్తంగా, తెలుగు ప్రేక్షకుల్లోనూ మంచి గుర్తింపు తెచ్చుకున్న హీరోయిన్ కిర్‌స్టన్ డంస్ట్ తన విలాసవంతమైన ఇంటిని విక్రయించి వార్తల్లో నిలిచారు.
కొనుక్కున్న మరో నటి

లాస్ ఏంజిల్స్‌లోని ప్రముఖ ప్రాంతమైన టోలుకా లేక్ ఒడ్డున ఉన్న ఈ అందమైన భవనాన్ని కిర్‌స్టన్ డంస్ట్ 2019లో అమ్మకానికి పెట్టారు. అయితే, అప్పుడు ఆశ్చర్యకరంగా, మార్కెట్లోకి వచ్చిన కేవలం తొమ్మిది రోజుల్లోనే ఈ ఇంటికి కొనుగోలుదారు దొరికారు. 'ఘోస్ట్‌బస్టర్స్' చిత్రాలతో పాపులర్ అయిన సీనియర్ నటి అన్నీ పాట్స్ ఈ ఇంటిని 4.55 మిలియన్ డాలర్లకు (2019 మారకం విలువ రూ. 32.04 కోట్లు) సొంతం చేసుకున్నట్లు 'లాస్ ఏంజిల్స్ టైమ్స్' వెల్లడించింది.
18 ఏళ్లపాటు జీవించిన ఇల్లు 9 రోజుల్లోనే అమ్మకం
కిర్‌స్టన్ డంస్ట్ 2001లో ఈ ప్రాపర్టీని 2.6 మిలియన్ డాలర్లకు (రూ. 24.27 కోట్లు) కొనుగోలు చేశారు. దాదాపు 18 ఏళ్ల పాటు ఈ ఇంట్లో నివసించిన తర్వాత, 2019 జూన్‌లో 4.7 మిలియన్ డాలర్ల ధరకు అమ్మకానికి పెట్టారు. తొలుత నిర్ణయించిన ధర కంటే 1,50,000 డాలర్లు తక్కువకు ఒప్పందం కుదిరినప్పటికీ, 2001లో ఆమె కొన్న ధరతో పోలిస్తే ఏకంగా 1.95 మిలియన్ డాలర్ల అధిక మొత్తానికి ఈ విక్రయం జరిగింది.
ఇంటి మరమ్మతులు, ఇతర నిర్వహణ ఖర్చులను పక్కన పెడితే, ఈ డీల్ ద్వారా ఆమెకు భారీ లాభమే దక్కింది. 2019 సెప్టెంబర్ నాటికి ఈ అమ్మకం ప్రక్రియ పూర్తయింది. అయితే, ఇటీవల కాలంలో రియల్ ఎస్టేట్ పెట్టుబడులకు సంబంధించిన వార్తలు ఇంట్రెస్టింగ్‌గా మారడంతో 2019లో అమ్ముడు పోయిన ఈ ఇల్లు వివరాలు ఇప్పుడు కూడా హైలెట్ అవుతున్నాయి. ఈ విషయాన్ని ప్రముఖ వెబ్‌సైట్స్ పుఃనప్రచురించడంతో ఆసక్తిగా మారింది.
ప్రకృతి ఒడిలో అద్భుతమైన నివాసం
టోలుకా లేక్‌కు ఆనుకుని ఉన్న అతికొద్ది ఇళ్లలో ఇదీ ఒకటి. సుమారు 4,333 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఉన్న ఈ భవనాన్ని 2019 జూన్‌లో 'ఆర్కిటెక్చరల్ డైజెస్ట్' మ్యాగజైన్ ప్రత్యేకంగా పరిచయం చేసింది. కిర్‌స్టన్ డంస్ట్ ఇక్కడ నివసిస్తున్న సమయంలో, ఆమె తల్లిదండ్రులు, సోదరుడు కూడా సమీపంలోనే ఉండేవారు.
{{/usCountry}}టోలుకా లేక్‌కు ఆనుకుని ఉన్న అతికొద్ది ఇళ్లలో ఇదీ ఒకటి. సుమారు 4,333 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఉన్న ఈ భవనాన్ని 2019 జూన్‌లో 'ఆర్కిటెక్చరల్ డైజెస్ట్' మ్యాగజైన్ ప్రత్యేకంగా పరిచయం చేసింది. కిర్‌స్టన్ డంస్ట్ ఇక్కడ నివసిస్తున్న సమయంలో, ఆమె తల్లిదండ్రులు, సోదరుడు కూడా సమీపంలోనే ఉండేవారు.
{{/usCountry}}సముద్రపు ఆకుపచ్చ (సీ-గ్రీన్), తెలుపు రంగుల మేళవింపుతో క్లాసిక్ 'కేప్ కాడ్' శైలిలో ఈ ఇంటి బయటి భాగాన్ని తీర్చిదిద్దారు. ఇంటి ముందు పచ్చని గార్డెన్, రాతి ఫౌంటెన్ కనువిందు చేస్తాయి. లోపలికి అడుగుపెట్టగానే విశాలమైన ఫాయర్ (ప్రవేశ ద్వారం) గుండా సహజసిద్ధమైన సూర్యకాంతి నేరుగా లివింగ్, డైనింగ్ గదుల్లోకి ప్రసరిస్తుంది.
ఎత్తైన సీలింగ్, కట్టెలతో వెలిగించే ఫైర్‌ప్లేస్ లివింగ్ రూమ్‌కు రాజసం తీసుకొచ్చాయి. డైనింగ్ గదిలో వేలాడదీసిన పురాతన క్రిస్టల్ షాండ్లియర్ ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుంది. డైనింగ్ గది నుంచి బయట ఉన్న టెర్రస్‌లోకి వెళ్లేందుకు అందమైన ఫ్రెంచ్ డోర్లు అమర్చారు.
రాజభవనాన్ని తలపించే ఇంటీరియర్స్
పాలరాతితో (మార్బుల్) నిర్మించిన వంటగదిలో ప్రత్యేకంగా ఉష్ణోగ్రతను నియంత్రించే వైన్ రిఫ్రిజిరేటర్ ఏర్పాటు చేశారు. కిచెన్‌కు మధ్యలో కస్టమ్ క్యాబినెట్లు, మార్బుల్‌తో కూడిన సెంటర్ ఐలాండ్ ఉన్నాయి. తెల్లటి గోడలు, లేత రంగు హార్డ్‌వుడ్ ఫ్లోర్లు ఇంటి లోపలి భాగానికి ఆహ్లాదకరమైన రూపాన్ని ఇచ్చాయి. బ్రేక్‌ఫాస్ట్ ఏరియా నుంచి ఫ్యామిలీ రూమ్‌లోకి వెళ్లే దారి, అక్కడ ఉన్న తెల్లటి మార్బుల్ ఫైర్‌ప్లేస్ కుటుంబ సభ్యులు సరదాగా గడిపేందుకు అనువుగా ఉంటాయి.
పై అంతస్తులో ఉన్న మాస్టర్ బెడ్‌రూమ్ సూట్‌లో ప్రత్యేక సిట్టింగ్ రూమ్, ఫైర్‌ప్లేస్ ఉన్నాయి. అక్కడి ఫ్రెంచ్ డోర్లు తెరిస్తే ప్రైవేట్ బాల్కనీలోకి అడుగుపెట్టవచ్చు. మాస్టర్ బాత్‌రూమ్‌లో మార్బుల్ ఫినిషింగ్‌తో పాటు విశ్రాంతి కోసం సోకింగ్ టబ్ అమర్చారు. ఇంటి వెనుక భాగంలో మెట్ల వరుసలా ఉండే పెరడు (బ్యాక్‌యార్డ్) ఉంది.
ఇక్కడ పెర్గోలా కింద అవుట్‌డోర్ కిచెన్, గ్రిల్లింగ్ ఏరియా, స్విమ్మింగ్ పూల్, స్పా, ప్రత్యేకంగా నిర్మించిన గెజిబో ఉన్నాయి. కింది అంతస్తులోని వరండా నేరుగా సరస్సు ఒడ్డున ఉన్న చెక్క డాక్‌కు కలుస్తుంది. ఈ ఇంటిని అమ్మకానికి పెట్టిన సమయంలో ఆ డాక్ వద్ద ఒక పాంటూన్ బోట్ కూడా నిలిపి ఉంచారు.
వరుస ఆస్తుల విక్రయం వెనుక కారణమేంటి?
కిర్‌స్టన్ డంస్ట్ ఈ టోలుకా లేక్ ఇంటిని ఎందుకు అమ్మేశారనే విషయంపై స్పష్టత లేదు. అయితే 2019లో ఆమె తన రియల్ ఎస్టేట్ ఆస్తుల్లో కీలక మార్పులు చేశారు. టోలుకా లేక్ భవనాన్ని విక్రయించడానికి నెల రోజుల ముందు, అంటే 2019 మే నెలలో న్యూయార్క్ నగరంలోని తన పెంట్‌హౌస్‌ను 4.42 మిలియన్ డాలర్లకు అమ్మేశారు.
అంతకుముందు 2010లో నికోల్స్ కాన్యన్‌లోని ఒక బంగ్లాను దాదాపు 1.4 మిలియన్ డాలర్లకు విక్రయించారు. మరోవైపు, 18 ఏళ్ల పాటు కిర్‌స్టన్ డంస్ట్ నివసించిన ఈ అద్భుతమైన వాటర్‌ఫ్రంట్ ప్రాపర్టీకి 'ఘోస్ట్‌బస్టర్స్' నటి అన్నీ పాట్స్ కొత్త యజమానిగా మారారు. సరస్సు అందాలను ఆస్వాదిస్తూ, సకల సౌకర్యాలతో కూడిన ఈ భవనం మార్కెట్లోకి వచ్చిన కొద్దిరోజుల్లోనే అమ్ముడుపోవడం హాలీవుడ్ రియల్ ఎస్టేట్ వర్గాల్లో చర్చనీయాంశమైంది.