Spider Man Box Office Collection: ఇండియన్ బాక్సాఫీస్ వద్ద హాలీవుడ్ సూపర్ హీరో 'స్పైడర్ మ్యాన్' సరికొత్త చరిత్ర సృష్టించాడు. టామ్ హాలండ్ హీరోగా వచ్చిన మోస్ట్ అవైటెడ్ మార్వెల్ మూవీ 'స్పైడర్ మ్యాన్: బ్రాండ్ న్యూ డే' థియేటర్లలో విడుదలై రెండు రోజుల్లోనే రూ.100 కోట్ల నెట్ కలెక్షన్ల మైలురాయిని దాటేసి రికార్డులు తిరగరాసింది. సౌత్, నార్త్ అనే తేడా లేకుండా ఇండియన్ సినీ ప్రేమికులు ఈ హాలీవుడ్ విజువల్ వండర్‌కి బ్రహ్మరథం పడుతున్నారు.
అవెంజర్స్ రికార్డులు అవుట్.. ఇండియాలో బిగ్గెస్ట్ హాలీవుడ్ ఓపెనింగ్
జులై 30న భారత్‌లో విడుదలైన స్పైడర్ మ్యాన్ సినిమా మొదటి రోజే ఏకంగా రూ.60.60 కోట్ల నెట్ వసూళ్లతో దేశంలోనే బిగ్గెస్ట్ హాలీవుడ్ ఓపెనర్‌గా నిలిచింది. ఇప్పటివరకు 'అవెంజర్స్: ఎండ్‌గేమ్' పేరిట ఉన్న రూ.53.60 కోట్ల ఓపెనింగ్ రికార్డును టామ్ హాలండ్ సులువుగా దాటేశాడు.
రెండో రోజు వర్కింగ్ డే అయిన శుక్రవారం కూడా ఈ మూవీ జోరు కొంచెమైనా తగ్గలేదు. శుక్రవారం నాటి వసూళ్లతో కలిపి రెండు రోజుల్లోనే మొత్తం రూ.109.95 కోట్ల నెట్ (రూ.131.46 కోట్ల గ్రాస్) కలెక్షన్లతో ఇండియాలో తుఫాన్ సృష్టించింది.
బాలీవుడ్ బిగ్గీస్‌కి షాక్.. అన్ని భాషల్లోనూ వసూళ్ల వర్షం
ఇండియాలో మన దిగ్గజ సినిమాలు సాధించిన రెండు రోజుల రికార్డులను ఈ మార్వెల్ చిత్రం సీరియస్‌గా ఛాలెంజ్ చేసింది. 'ధురంధర్' (2 రోజుల్లో రూ.60 కోట్లు), 'డంకీ' (2 రోజుల్లో రూ.50 కోట్లలోపు) సాధించిన ఆరంభ వసూళ్లను స్పైడర్ మ్యాన్ చాలా సులువుగా దాటేసాడు. కేవలం పఠాన్, ధురంధర్ 2 వంటి అతికొద్ది ఇండియన్ సినిమాలు మాత్రమే ఈ రకమైన స్పీడ్ చూపించాయి.
మనదేశంలో ఇంగ్లీష్ వెర్షన్ రూ.60 కోట్ల వసూళ్లు సాధించగా, హిందీ డబ్బింగ్ వెర్షన్ రూ.39 కోట్లతో ఆశ్చర్యపరిచింది. హిందీ బెల్ట్‌లో దాదాపు 90 శాతానికి పైగా థియేటర్ ఆక్యుపెన్సీ నమోదైంది. ఇక తెలుగు, తమిళ భాషల డబ్బింగ్ వెర్షన్లు కూడా రెండు రాష్ట్రాల్లో సాలిడ్ నంబర్స్‌తో దూసుకుపోతున్నాయి.
అమెరికా కంటే ముందే ఇండియాలో రిలీజ్..
{{/usCountry}}మనదేశంలో ఇంగ్లీష్ వెర్షన్ రూ.60 కోట్ల వసూళ్లు సాధించగా, హిందీ డబ్బింగ్ వెర్షన్ రూ.39 కోట్లతో ఆశ్చర్యపరిచింది. హిందీ బెల్ట్‌లో దాదాపు 90 శాతానికి పైగా థియేటర్ ఆక్యుపెన్సీ నమోదైంది. ఇక తెలుగు, తమిళ భాషల డబ్బింగ్ వెర్షన్లు కూడా రెండు రాష్ట్రాల్లో సాలిడ్ నంబర్స్‌తో దూసుకుపోతున్నాయి.
అమెరికా కంటే ముందే ఇండియాలో రిలీజ్..
{{/usCountry}}అమెరికా కంటే ఒక రోజు ముందే భారత్‌లో రిలీజ్ కావడం ఈ భారీ వసూళ్లకు ప్రధాన ప్లస్ పాయింట్ అయింది. నార్త్ అమెరికాలో పెయిడ్ ప్రివ్యూస్ ద్వారానే ఈ సినిమా ఏకంగా 72 మిలియన్ డాలర్లు రాబట్టి గతంలో ఎండ్‌గేమ్ నెలకొల్పిన హిస్టారికల్ రికార్డును బద్దలు కొట్టింది.
గ్లోబల్ బాక్సాఫీస్ వద్ద ఈ ఫస్ట్ వీకెండ్‌లోనే 500 మిలియన్ డాలర్ల నుంచి ఏకంగా 800 మిలియన్ డాలర్ల దాకా రాబట్టవచ్చని ట్రేడ్ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. చైనా, యూకే, ఫ్రాన్స్, సౌత్ కొరియా దేశాల్లో స్పైడర్ మ్యాన్ మేనియా పీక్స్‌లో నడుస్తోంది.
'నో వే హోమ్' తర్వాత పీటర్ పార్కర్ లైఫ్.. కథేంటంటే?
'స్పైడర్ మ్యాన్: నో వే హోమ్' మూవీ క్లైమాక్స్‌లో ప్రపంచం మొత్తం పీటర్ పార్కర్ ఐడెంటిటీని పూర్తిగా మరచిపోతుంది. ఈ 'బ్రాండ్ న్యూ డే' కథలో పీటర్ పార్కర్ తన ప్రాణస్నేహితులు జెండయా (MJ), జేకబ్ బాటలాన్ (Ned) తనకు దూరమైన బాధలో ఒంటరిగా న్యూయార్క్ నగరంలో జీవిస్తుంటాడు.
డైరెక్టర్ డెస్టిన్ డేనియల్ క్రెటన్ ఈ ఎమోషనల్ యాక్షన్ డ్రామాను అత్యంత ఆసక్తికరంగా మలిచారు. తోడుగా సాడీ సింక్, మార్క్ రుఫాలో (హల్క్), జాన్ బర్న్ థాల్ (పనిషర్) కీలక పాత్రల్లో అలరించడంతో ఈ మార్వెల్ సినిమా థియేటర్లలో ఆడియెన్స్‌కి బెస్ట్ ఎక్స్‌పీరియన్స్ ఇస్తోంది.