Spider Man Box Office: 2 బిలియన్ డాలర్ల వసూళ్ల క్లబ్‌లో స్పైడర్ మ్యాన్ బ్రాండ్ న్యూ డే.. ఈ ఘనత సాధించిన మరో 7 మూవీస్ ఇవే
Spider Man Box Office: గ్లోబల్ బాక్సాఫీస్ దగ్గర స్పైడర్ మ్యాన్ బ్రాండ్ న్యూ డే సరికొత్త చరిత్ర సృష్టించింది. 2 బిలియన్ డాలర్ల క్లబ్ లో చేరిన 8వ సినిమాగా నిలిచింది. గతంలో ఈ ఘతన సాధించిన 7 ఇతర సినిమాలు ఏవో చూడండి.
Spider Man Box Office: హాలీవుడ్ యంగ్ స్టార్ టామ్ హాలాండ్ నటించిన 'స్పైడర్ మ్యాన్: బ్రాండ్ న్యూ డే' మూవీ వరల్డ్ వైడ్ బాక్సాఫీస్ వద్ద సరికొత్త చరిత్ర సృష్టించింది. ప్రపంచవ్యాప్తంగా దాదాపు $2.02 బిలియన్లు (ఇండియన్ కరెన్సీలో రూ. 19 వేల కోట్లకు పైగా) గ్రాస్ వసూలు చేసి ఎలైట్ $2 బిలియన్ క్లబ్‌లోకి అడుగుపెట్టింది.

డైరెక్టర్ డెస్టిన్ డేనియల్ క్రెటన్ తెరకెక్కించిన ఈ సూపర్‌హీరో డ్రామా కేవలం మూడు వీకెండ్స్‌లోనే $2 బిలియన్ మార్కును దాటేసింది. 'అవెంజర్స్: ఎండ్ గేమ్' తర్వాత అత్యంత వేగంగా ఈ ఘనత సాధించిన రెండో సినిమాగా నిలిచింది.
సోలో సూపర్‌హీరోగా రేర్ ఫీట్
సోలో సూపర్‌హీరో మూవీగా $2 బిలియన్ దాటిన మొదటి చిత్రంగా 'స్పైడర్ మ్యాన్ బ్రాండ్ న్యూ డే' కొత్త రికార్డ్ క్రియేట్ చేసింది. గతంలో వచ్చిన 'స్పైడర్ మ్యాన్: నో వే హోమ్' $1.9 బిలియన్ వసూలు చేసినా చైనాలో రిలీజ్ కాకపోవడంతో ఈ ల్యాండ్‌మార్క్ మిస్ అయింది. కానీ ఇప్పుడు ఆ మార్కును ఈజీగా రీచ్ అయిపోయింది.
సినిమా చరిత్రలో $2 బిలియన్ దాటిన 8 ఐకానిక్ సినిమాలు
సినిమా చరిత్రలో ఇప్పటివరకు అత్యధిక వసూళ్లు సాధించి ఈ ఎలైట్ క్లబ్‌లో నిలిచిన మిగిలిన 7 సినిమాలు ఇవే..
1. అవతార్ (Avatar - 2009) - $2.92 బిలియన్
జేమ్స్ కామరాన్ సృష్టించిన విజువల్ వండర్ పండోరా ప్రపంచం ఆడియన్స్‌ని మైమరిపించింది. రిలీజైన 47 రోజుల్లోనే $2 బిలియన్ల మార్క్ దాటేసిన ఈ మూవీ $2.92 బిలియన్లతో ఆల్ టైమ్ హైయెస్ట్ గ్రాసర్‌గా మొదటి స్థానంలో కొనసాగుతోంది.
2. అవెంజర్స్: ఎండ్ గేమ్ (Avengers: Endgame - 2019) - $2.80 బిలియన్
మార్వెల్ సినిమాటిక్ యూనివర్స్ లో అత్యంత ప్రతిష్టాత్మకంగా వచ్చిన ఈ మూవీ $2.80 బిలియన్లు వసూలు చేసింది. కేవలం 11 రోజుల్లోనే $2 బిలియన్ మార్కును చేరుకుని బాక్సాఫీస్ వద్ద అత్యంత వేగవంతమైన రికార్డ్ నమోదు చేసింది.
3. అవతార్: ది వే ఆఫ్ వాటర్ (Avatar: The Way of Water - 2022) - $2.33 బిలియన్
పండోరా అండర్ వాటర్ విజువల్స్‌తో వచ్చిన కామెరాన్ సీక్వెల్ ఏకంగా $2.33 బిలియన్ రాబట్టింది. ఈ సినిమాతో జేమ్స్ కామెరాన్ తన ఖాతాలో మూడు $2 బిలియన్ల సినిమాలు ఉన్న ఏకైక దర్శకుడిగా రికార్డ్ సాధించారు.
4. నె ఝా 2 (Ne Zha 2 - 2025) - $2.27 బిలియన్
యు యాంగ్ డైరెక్షన్‌లో వచ్చిన ఈ చైనీస్ యానిమేటెడ్ మూవీ $2.27 బిలియన్లతో సునామీ సృష్టించింది. హాలీవుడ్ కు సంబంధం లేని నాన్-ఇంగ్లీష్ సినిమాగా, మొదటి యానిమేషన్ మూవీగా ఈ ఎలైట్ క్లబ్‌లోకి చేరడం గ్లోబల్ బాక్సాఫీస్ దగ్గర సంచలనం.
5. టైటానిక్ (Titanic - 1997) - $2.26 బిలియన్
జేమ్స్ కామెరాన్, లియోనార్డో డికాప్రియో కాంబినేషన్‌లో వచ్చిన లవ్ క్లాసిక్ 'టైటానిక్' $2.26 బిలియన్ రాబట్టింది. 2012లో మరోసారి షిప్ మునిగిపోయిన 100 ఏళ్ల సందర్భంలో రిలీజైన 3D వెర్షన్‌తో ఈ మార్కును దాటింది.
6. స్టార్ వార్స్: ది ఫోర్స్ అవేకెన్స్ (Star Wars: The Force Awakens - 2015) - $2.07 బిలియన్
జే జే అబ్రామ్స్ దర్శకత్వంలో వచ్చిన ఈ ఐకానిక్ సైన్స్ ఫిక్షన్ డ్రామా ప్రపంచవ్యాప్తంగా $2.07 బిలియన్లు వసూలు చేసి స్టార్ వార్స్ ఫ్రాంచైజ్ రీ-ఎంట్రీకి బ్లాక్‌బస్టర్ కంబ్యాక్ ఇచ్చింది.
7. అవెంజర్స్: ఇన్ఫినిటీ వార్ (Avengers: Infinity War - 2018) - $2.05 బిలియన్
రూసో బ్రదర్స్ డైరెక్షన్‌లో సూపర్ హీరోలంతా థానోస్‌తో పోరాడే ఇంటెన్స్ డ్రామా $2.05 బిలియన్ రాబట్టింది. MCU చరిత్రలో మొదటిసారిగా $2 బిలియన్ దాటిన సినిమాగా నిలిచింది.
ABOUT THE AUTHORHari Prasad Sహరి ప్రసాద్ శీలమంతుల ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. మీడియా రంగంలో 20 ఏళ్లకు పైగా సుదీర్ఘ అనుభవం కలిగిన ఆయన, డిజిటల్ మీడియాలో గత 10 ఏళ్లుగా విశేష సేవలందిస్తున్నారు. ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలు, సినిమా వార్తలను అందించడంలో ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఆయన తన అద్భుతమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. హరి ప్రసాద్ తన కెరీర్‌లో ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా వంటి మూడు ప్రధాన విభాగాల్లోనూ పనిచేశారు. హిందుస్థాన్ టైమ్స్‌లో చేరకముందు, ఆయన తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ దినపత్రికలు, టీవీ ఛానెళ్లయిన ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి వంటి సంస్థలలో కీలక బాధ్యతలు నిర్వహించారు. నవంబర్ 1, 2021న హిందుస్థాన్ టైమ్స్ తెలుగు టీమ్‌లో చేరిన ఆయన.. ప్రస్తుతం స్పోర్ట్స్ (ముఖ్యంగా క్రికెట్ అనాలసిస్), ఎంటర్‌టైన్మెంట్ సెక్షన్ల బాధ్యతలను చూసుకుంటున్నారు. ఈయన ఉస్మానియా యూనివర్సిటీ నుంచి బీఎస్సీ (కంప్యూటర్ సైన్స్) పట్టా పొందారు. సాంకేతిక పరిజ్ఞానంతో పాటు జర్నలిజంపై ఉన్న మక్కువతో జర్నలిజంలో డిప్లొమా పూర్తి చేసి, వృత్తిపరమైన నైపుణ్యాలను మెరుగుపరుచుకున్నారు. క్రీడా రంగంలో వస్తున్న మార్పులను, సినిమా ఇండస్ట్రీ అప్‌డేట్స్‌ను లోతుగా విశ్లేషించి పాఠకులకు అర్థమయ్యే రీతిలో అందించడం హరి ప్రసాద్ శైలి.Read More

E-Paper


