ప్రముఖ హాలీవుడ్ చిత్రం 'టైటానిక్' ను బాలీవుడ్ లో తీస్తే ఎలా ఉంటుందో ఊహించుకోండి. అందులో హీరోయిన్ రోజ్ గా అందాల తార ఐశ్వర్యరాయ్, హీరో జాక్ గా దివంగత నటుడు రాజేష్ ఖన్నా నటిస్తే ఇంకెలా ఉంటుంది? ఈ అద్భుతాన్ని ఏఐ నిజం చేసింది. ఏఐతో చేసిన ఈ సూపర్ విజువల్స్ వైరల్ గా మారాయి.
బాలీవుడ్ అందాల తార ఐశ్వర్యరాయ్, హ్యాండ్సమ్ నటుడు రాజేష్ ఖన్నా.. ఈ ఇద్దరు వేర్వేరు తరాలకు చెందిన నటీనటులు. కానీ ఈ ఇద్దరూ కలిసి పాపులర్ మూవీ టైటానిక్ లో నటిస్తే? రోజ్, జాక్ పాత్రలు పోషిస్తే ఎలా ఉంటుంది? ఈ ఆలోచనతోనే ఓ అద్భుతమైన ఏఐ వీడియో క్రియేట్ అయింది. ఇప్పుడు ఇది ఇంటర్నెట్ ను షేక్ చేస్తోంది.
ఏఐ ఫొటోలు
ఐశ్వర్య, రాజేష్ కలిసి
సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న ఏఐ వీడియోలో హాలీవుడ్ చిత్రం 'టైటానిక్' లోని కేట్ విన్స్‌లెట్, లియోనార్డో డికాప్రియో పాత్రలలో బాలీవుడ్ స్టార్స్ ఐశ్వర్యరాయ్, రాజేష్ ఖన్నా కనిపించారు. అభిమానుల మదిలో ఇంకా తాజాగా ఉన్న టైటానిక్ సినిమాలోని కొన్ని సీన్లలో ఈ ఇద్దరిని ఇప్పుడు చూడొచ్చు.
అదిరే వీడియో
మిస్టర్ హెల్ రాకర్ అనే ఏఐ ఆర్టిస్ట్ ఐశ్వర్యరాయ్, రాజేష్ ఖన్నాతో టైటానిక్ సినిమాలోని కొన్ని సీన్లను ఏఐలో రీక్రియేట్ చేశాడు. తన ఇన్‌స్టాగ్రామ్ పోస్ట్‌లో ఐశ్వర్యరాయ్‌ను 'రోజ్' గా, రాజేష్ ఖన్నాను 'టైటానిక్' లో 'జాక్' గా చూపే సన్నివేశాల సిరీస్‌ను పోస్టు చేశాడు.
సూటు ధరించిన జాక్‌ను మొదటిసారి కలవడానికి హాల్‌వేలోకి రోజ్ అడుగుపెట్టడం దగ్గర నుంచి, టైటానిక్ డెక్‌పై ఇద్దరు కలిసి నిలబడే ఐకానిక్ పోజు వరకు ఈ సీన్లున్నాయి.
ఏఐతో క్రియేట్ చేసిన వీడియోలో అమాయకపు రోజ్ గా దివంగత రాజేష్ ఖన్నా పర్ఫెక్ట్ గా సెట్ అయ్యారు. అలాగే అందాల తార రోజ్ గా ఐశ్వర్యరాయ్ ఆకట్టుకుంటోంది. ప్రసిద్ధ 'హార్ట్ ఆఫ్ ది ఓషన్' నెక్లెస్ దృశ్యం కూడా ఈ వీడియోలో ఉంది. ఇది 'రోజ్' పాత్రలోని అమాయకత్వం, అందాన్ని ప్రతిబింబిస్తుంది.
‘‘టైటానిక్ బాలీవుడ్‌లో తీస్తే ఎలా ఉంటుంది? ఐశ్వర్యారాయ్ 'రోజ్' గా, రాజేష్ ఖన్నా 'జాక్' గా ఊహించని కలయిక ఇది’’ అనే క్యాప్షన్ తో ఇన్ స్టాలో వీడియో పోస్టు చేశారు.
ఫ్యాన్స్ రియాక్షన్
ఐశ్వర్యరాయ్, రాజేష్ ఖన్నాతో రూపొందించిన టైటానిక్ ఏఐ వీడియో అద్భుతమని, అదిరిపోయిందనే కామెంట్లు వస్తున్నాయి. ముఖ్యంగా రాజేష్ ఖన్నా 'జాక్' గా ఎంత పరిపూర్ణంగా కనిపిస్తున్నాడో అని ఫ్యాన్స్ ఆశ్చర్యపోయారు. 'జాక్ గా రాజేష్ ఖన్నా సర్ అద్భుతం. ఇది క్రియేటివిటీకి నిలువెత్తు నిదర్శనం' అని ఒక అభిమాని వ్యాఖ్యానించారు. 'ఐశ్వర్యరాయ్ అసలు రోజ్ కంటే ఎక్కువ రోజ్ లా ఉంది' అని మరొక అభిమాని అన్నారు.
రాజేష్ ఖన్నా 1960ల నుండి 1970ల మధ్యకాలంలో బాక్సాఫీస్‌ను శాసించిన సూపర్ స్టార్. ఐశ్వర్యరాయ్ ఆయన కంటే మూడు దశాబ్దాలు చిన్నది. అయితే ఈ ఇద్దరు 1999లో వచ్చిన 'ఆ అబ్ లౌట్ చలేన్' చిత్రంలో నటించారు. రిషి కపూర్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో అక్షయ్ ఖన్నాకు రాజేష్ తండ్రిగా నటించారు.