Spirit: ప్రభాస్ స్పిరిట్ రిలీజ్ వాయిదాపై క్లారిటీ.. మేకర్స్ ఏం చెప్పారంటే?
Spirit: ప్రభాస్, సందీప్ రెడ్డి వంగా కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న 'స్పిరిట్' రిలీజ్ పోస్ట్ పోన్ అవుతుందనే ప్రచారం జోరుగా సాగుతోంది. దీనిపై మేకర్స్ తాజాగా క్లారిటీ ఇచ్చారు. ఏం చెప్పారో ఇక్కడ చూసేయండి.
Spirit: పాన్ ఇండియా స్టార్ ప్రభాస్, టాలెంటెడ్ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా కలయికలో అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న 'స్పిరిట్' సినిమాపై వస్తున్న ఊహాగానాలకు చిత్రబృందం తెరదించింది. ఈ చిత్రం రిలీజ్ పోస్ట్ పోన్ అవుతుందనే పుకార్లకు చెక్ పెట్టింది.

స్పిరిట్ రిలీజ్
ప్రభాస్ హీరోగా తెరకెక్కుతున్న స్పిరిట్ మూవీ రిలీజ్ పై మేకర్స్ తాజాగా క్లారిటీనిచ్చారు. ఈ మూవీ ముందుగా ప్రకటించిన డేట్ ప్రకారం మార్చి 5, 2027నే రిలీజ్ అవుతుందని స్పష్టం చేశారు. గత కొంతకాలంగా ఈ సినిమా డిసెంబర్ నెలకు వాయిదా పడుతుందంటూ సోషల్ మీడియాలో జోరుగా ప్రచారం జరిగిన సంగతి తెలిసిందే.
మేకర్స్ అధికారిక ప్రకటన
"స్పిరిట్ విడుదల తేదీపై జరుగుతున్న చర్చలకు సంబంధించి మేం ఒక స్పష్టత ఇవ్వాలనుకుంటున్నాం. ఈ సినిమా షూటింగ్, ఇతర పనులు అనుకున్న షెడ్యూల్ ప్రకారమే సాగుతున్నాయి. గతంలో ప్రకటించిన విధంగానే 2027 మార్చి 5న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల చేస్తాం" అని బుధవారం (మే 6) చిత్ర నిర్మాతలు ఒక ప్రకటనలో స్పష్టం చేశారు.
స్పిరిట్ ఫస్ట్ లుక్
సందీప్ రెడ్డి వంగా డైరెక్షన్ లో ప్రభాస్ హీరోగా వస్తున్న స్పిరిట్ మూవీ భారీ అంచనాలే ఉన్నాయి. ఈ మూవీ అనౌన్స్ మెంట్ నుంచి భారీ హైప్ నెలకొంది. ఇక ఫస్ట్ లుక్ పోస్టర్, గ్లింప్స్ వీడియోతో అంచనాలు ఆకాశానికి తాకాయి. 2026 జనవరి 1 అర్ధరాత్రి సమయంలో చిత్రబృందం స్పిరిట్ ఫస్ట్ లుక్ పోస్టర్‌ను విడుదల చేసింది. ఈ పోస్టర్ అభిమానుల్లో భారీ అంచనాలను రేకెత్తించింది.
పోస్టర్‌లో ప్రభాస్ గడ్డంతో, గాయాలతో, పొడవాటి జుట్టుతో చాలా రఫ్ లుక్‌లో కనిపించాడు. ఆయన పక్కన తృప్తి డిమ్రి సిగరెట్ వెలిగిస్తున్న దృశ్యం అందరినీ ఆకట్టుకుంది. 'యానిమల్' సినిమాతో దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన సందీప్ రెడ్డి వంగా ఈసారి ప్రభాస్‌ను పవర్‌ఫుల్ పోలీస్ ఆఫీసర్‌గా వెండితెరపై చూపించనున్నాడు.
టీజర్
గత ఏడాది అక్టోబర్‌లో ప్రభాస్ పుట్టినరోజు సందర్భంగా విడుదల చేసిన 'సౌండ్ స్టోరీ' ఆడియో టీజర్ అందరినీ ఆకట్టుకుంది. ఒక నిమిషం పాటు సాగే ఈ ఆడియో టీజర్‌లో జైలర్, అతని అసిస్టెంట్ మధ్య జరిగే సంభాషణ ఉంటుంది. ఆ తర్వాత ప్రభాస్ గొంతు వినిపిస్తూ, "సార్, చిన్నప్పటి నుంచి నాకు ఒక చెడు అలవాటు ఉంది" అని అంటారు. ఈ డైలాగ్ టీజర్‌కు అదనపు ఆకర్షణగా నిలిచింది.
ఈ స్టార్లు
స్పిరిట్ చిత్రంలో ప్రభాస్ సరసన తృప్తి డిమ్రి కథానాయికగా నటిస్తోంది. ముందుగా ఈ పాత్రకు దీపికా పదుకొణెను అనుకున్నప్పటికీ, చివరికి తృప్తిని ఎంపిక చేశారు. వీరితో పాటు ప్రకాష్ రాజ్, కాంచన, వివేక్ ఒబెరాయ్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఫిబ్రవరి నెలలో ప్రకాష్ రాజ్ ఈ ప్రాజెక్ట్ నుంచి తప్పుకున్నారని ప్రచారం జరిగింది. దర్శకుడితో విభేదాల కారణంగానే ఆయన బయటకు వచ్చారని వార్తలు వచ్చాయి. అయితే, దీనిపై ప్రకాష్ రాజ్ స్పందించి ఆ వార్తలను ఖండించాడు.
ABOUT THE AUTHORChandu Shanigarapuచందు శనిగారపు ప్రస్తుతం హిందూస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ రైటర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. మీడియా రంగంలో ఎనిమిదేళ్లకు పైగా అనుభవం ఆయన సొంతం. 2025 నుంచి డిజిటల్ మీడియాలోనూ తనదైన ముద్ర వేస్తున్నారు. సినిమా వార్తలను ఎప్పటికప్పుడు అందించడం, స్పోర్ట్స్ న్యూస్ ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలను చదివించేలా ఇవ్వడం ఆయన ప్రత్యేకత. మ్యాచ్ రిపోర్ట్ లను వేగంగా అందించడం, లైవ్ అప్ డేట్స్ ఇవ్వడంలో ఆయన ముందుంటారు. చందు తన కెరీర్ లో ప్రింట్ మీడియాలో ఎక్కువగా పనిచేశారు. ప్రముఖ దినపత్రిక ఈనాడులో ఏడేళ్లకు పైగా స్పోర్ట్స్ రిపోర్టర్ గా పనిచేశారు. తన ఆర్టికల్స్ తో ఎంతోమంది యువ క్రీడాకారుల ప్రతిభను వెలుగులోకి తెచ్చారు. ప్రత్యేక ఆర్టికల్స్ తో వాళ్లకు ఆర్థిక సాయం అందేలా చూశారు. క్రికెట్ ప్రపంచకప్ లు, ఒలింపిక్స్ లాంటి మెగా టోర్నీల కవరేజీలో ఆయనకు విశిష్ఠ అనుభవం ఉంది. మల్లారెడ్డి కాలేజీ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ నుంచి చందు బీటెక్ డిగ్రీ పొందారు. ఓ వైపు టెక్నికల్ నాలెడ్జ్ తో పాటు జర్నలిజంపై ప్రేమతో మీడియా రంగంలో కొనసాాగుతున్నారు. జర్నలిజంలో డిప్లొమా చేశారు. సినిమా వార్తలను, మూవీ రివ్యూలను, ఓటీటీ విషయాలను, క్రికెట్ సమాచారాన్ని, క్రీడా సంగతులను పాఠకులకు అందిస్తున్నారు.Read More

E-Paper












