దర్శకుడు సందీప్ రెడ్డి వంగ, నటుడు ప్రభాస్ తమ రాబోయే చిత్రం 'స్పిరిట్' షూటింగ్‌ను ప్రారంభించడానికి సిద్ధమయ్యారు. ఆదివారం (నవంబర్ 23) చిత్ర బృందం సమక్షంలో ముహూర్త వేడుకను ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకకు మెగాస్టార్ చిరంజీవి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. అలాగే నిర్మాత భూషణ్ కుమార్, నటి త్రిప్తి డిమ్రి కూడా పాల్గొన్నారు.
స్పిరిట్ అప్‌డేట్

స్పిరిట్ టీమ్ అప్ డేట్ ను షేర్ చేసింది. స్పిరిట్ అధికారిక ఎక్స్ ఖాతాలో ఈ ముహూర్త వేడుకకు సంబంధించిన ఫోటోలను పోస్టు చేశారు. ఒక ఫోటోలో భూషణ్ తో కలిసి చిరంజీవి సినిమా క్లాప్‌బోర్డ్‌ను పట్టుకుని కనిపించారు. సందీప్, త్రిప్తి డిమ్రి కూడా వారి పక్కనే నిలబడి కనిపించారు. అయితే, ఫోటోలలో ప్రభాస్ కనిపించకపోవడం గమనార్హం. ప్రకాష్ రాజ్, వివేక్ ఒబెరాయ్ కూడా ఫోటోలలో కనిపించలేదు.
స్పిరిట్ మోడ్
స్పిరిట్ ముహూర్తం కార్యక్రమానికి సంబంధించిన ఫొటోలను ఎక్స్ లో షేర్ చేశారు. “అధికారికంగా స్పిరిట్ మోడ్… ఇండియా బిగ్గెస్ట్ సూపర్‌స్టార్ ప్రభాస్ స్పిరిట్ పూజా కార్యక్రమానికి ఈరోజు మెగాస్టార్ హాజరవడం మాకు గౌరవంగా ఉంది’’ అని క్యాప్షన్ లో పేర్కొన్నారు.
ప్రభాస్ ఎక్కడ?
{{/usCountry}}స్పిరిట్ ముహూర్తం కార్యక్రమానికి సంబంధించిన ఫొటోలను ఎక్స్ లో షేర్ చేశారు. “అధికారికంగా స్పిరిట్ మోడ్… ఇండియా బిగ్గెస్ట్ సూపర్‌స్టార్ ప్రభాస్ స్పిరిట్ పూజా కార్యక్రమానికి ఈరోజు మెగాస్టార్ హాజరవడం మాకు గౌరవంగా ఉంది’’ అని క్యాప్షన్ లో పేర్కొన్నారు.
ప్రభాస్ ఎక్కడ?
{{/usCountry}}అయితే స్పిరిట్ హీరో ప్రభాస్ ఈ పూజ కార్యక్రమంలో లేకపోవడంతో ఫ్యాన్స్ కాస్త డిసప్పాయింట్ అయ్యారు. ప్రభాస్ ఎక్కడ? అని సోషల్ మీడియాలో ప్రశ్నిస్తున్నారు. చాలా మంది అభిమానులు పోస్ట్‌పై కామెంట్ చేస్తూ ఈ సినిమా కోసం, అందులో సందీప్ ప్రభాస్‌ను ఎలా చూపిస్తాడో తెలుసుకోవడానికి ఉత్సాహంగా ఉన్నామని తెలిపారు. ప్రభాస్ లుక్ లీక్ అవుతుందనే భయంతోనే పూజా కార్యక్రమంలో అతను లేడా అని కొందరు ఆశ్చర్యపోయారు.
ఆడియో టీజర్
గత నెలలో ప్రభాస్ పుట్టినరోజు సందర్భంగా సందీప్ రెడ్డి వంగా సినిమా ఆడియో టీజర్‌ను విడుదల చేశారు. టీజర్‌లో ఒక జైలర్, అతని సహాయకుడు రిమాండ్‌లో ఉన్న మాజీ పోలీసు అధికారి గురించి మాట్లాడుకుంటారు. అతన్ని ఎలా చూసుకోవాలో జైలర్ సూచనలు ఇస్తాడు. చివరగా ప్రభాస్ వాయిస్ ఇలా అంటుంది.. “సార్, చిన్నప్పటి నుంచి నాకు ఒక చెడు అలవాటు ఉంది” అని వస్తుంది.
ఈ చిత్రంలో ప్రభాస్ ఒక పోలీసు పాత్రలో, త్రిప్తి అతని ప్రేయసి పాత్రలో నటించనుంది. ఈ చిత్రంలో నటి దీపికా పదుకొణె స్థానంలో త్రిప్తి వచ్చింది. ఇది 2026లో విడుదల కానుంది. 'స్పిరిట్' అనేది భూషణ్ కుమార్ కు చెందిన టీ-సిరీస్, సందీప్ ప్రొడక్షన్ హౌస్ భద్రకాళి పిక్చర్స్ ఉమ్మడిగా నిర్మిస్తున్న సినిమా.