...
...
Next Story

Spirit Release Date: ప్రభాస్ స్పిరిట్ రిలీజ్ వాయిదా.. యానిమల్ డేట్ సెట్ చేసిన డైరెక్టర్.. సల్మాన్ మూవీతో పోటీ వద్దనే..?

Spirit Release Date: బాక్సాఫీస్ వద్ద పెను ప్రకంపనలు సృష్టించాల్సిన 'స్పిరిట్' సినిమా విడుదల తేదీ మారుతోంది. సల్మాన్ ఖాన్ చిత్రంతో తలపడటం కంటే సోలో రిలీజ్ మిన్న అనే ఉద్దేశంతో దర్శకుడు సందీప్ రెడ్డి వంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం.

Published on: May 6, 2026, 10:30:50 IST
By , Hyderabad
Prefer HTon Google
Advertisement

Spirit Release Date: రెబల్ స్టార్ ప్రభాస్, సెన్సేషనల్ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా కాంబినేషన్‌లో వస్తున్న 'స్పిరిట్' సినిమా కోసం ప్రపంచవ్యాప్తంగా ఉన్న సినీ అభిమానులు వేయి కళ్ళతో ఎదురుచూస్తున్నారు. అయితే ఈ భారీ బడ్జెట్ సినిమా విడుదల విషయంలో ఇప్పుడు ఒక ఆసక్తికరమైన మలుపు చోటుచేసుకుంది. ముందుగా ప్రకటించిన తేదీ కంటే 'స్పిరిట్' కొంత ఆలస్యంగా థియేటర్లలోకి వచ్చే అవకాశం ఉందని ఇండస్ట్రీ వర్గాల్లో గట్టిగా వినిపిస్తోంది.

సల్మాన్‌ మూవీతో పోటీ వద్దనేనా?

Spirit Release Date: ప్రభాస్ స్పిరిట్ రిలీజ్ వాయిదా.. యానిమల్ డేట్ సెట్ చేసిన డైరెక్టర్.. సల్మాన్ మూవీతో పోటీ వద్దనే..? (x/imvangasandeep)
Spirit Release Date: ప్రభాస్ స్పిరిట్ రిలీజ్ వాయిదా.. యానిమల్ డేట్ సెట్ చేసిన డైరెక్టర్.. సల్మాన్ మూవీతో పోటీ వద్దనే..? (x/imvangasandeep)

బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్, టాలీవుడ్ సక్సెస్‌ఫుల్ డైరెక్టర్ వంశీ పైడిపల్లి కాంబినేషన్‌లో ఒక సినిమా (వర్కింగ్ టైటిల్ SVC63) తెరకెక్కుతోంది. ఈ చిత్రాన్ని 2027 ఈద్ కానుకగా అంటే మార్చి నెలలో విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు.

అయితే 'స్పిరిట్' టీమ్ కూడా మొదట మార్చి 5, 2027నే టార్గెట్ చేసింది. ఇద్దరు అగ్ర హీరోల సినిమాలు ఒకేసారి వస్తే థియేటర్ల విభజనతో పాటు కలెక్షన్లపై ప్రభావం పడే అవకాశం ఉంది. అందుకే రిస్క్ తీసుకోకూడదని భావించిన సందీప్ వంగా, తన సినిమాను వాయిదా వేసే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది.

లక్కీ డేట్‌పై వంగా కన్ను

తాజా సమాచారం ప్రకారం 'స్పిరిట్' సినిమాను డిసెంబర్ 1, 2027న విడుదల చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. దీని వెనుక ఒక సెంటిమెంట్ కూడా ఉంది. గతంలో సందీప్ వంగా దర్శకత్వంలో వచ్చిన 'యానిమల్' సినిమా కూడా ఇదే డిసెంబర్ 1న విడుదలై బాక్సాఫీస్ వద్ద రికార్డుల సునామీ సృష్టించింది. అందుకే అదే తేదీని 'స్పిరిట్'కు కూడా లాక్ చేయాలని ఆయన భావిస్తున్నట్లు మిడ్-డే రిపోర్టు వెల్లడించింది.

విడుదల తేదీ మారినప్పటికీ, సినిమా షూటింగ్ ప్రక్రియపై దాని ప్రభావం ఉండదు. 2027 ప్రారంభం నాటికే షూటింగ్ మొత్తం పూర్తి చేయాలని వంగా లక్ష్యంగా పెట్టుకున్నారు. మిగిలిన సమయాన్ని పోస్ట్ ప్రొడక్షన్, ఎడిటింగ్, ఇతర భాషల్లో డబ్బింగ్ పనుల కోసం వినియోగించనున్నారు. ముఖ్యంగా హిందీ, తెలుగు భాషల్లో క్వాలిటీ విషయంలో రాజీ పడకుండా అవుట్‌పుట్ తీసుకురావడానికి ఈ అదనపు సమయం ఉపయోగపడుతుందని టీమ్ భావిస్తోంది.

ప్రభాస్ - త్రిప్తి దిమ్రి.. అంచనాలు పెంచిన ఫస్ట్ లుక్

2026 కొత్త ఏడాది సందర్భంగా విడుదలైన 'స్పిరిట్' ఫస్ట్ లుక్ పోస్టర్ అప్పట్లో ఇంటర్నెట్‌ను షేక్ చేసింది. గాయాలతో ఉన్న ప్రభాస్ కు త్రిప్తి దిమ్రి సిగరెట్ వెలిగిస్తున్న ఆ స్టిల్ చూస్తుంటే, వంగా మార్క్ రా అండ్ రస్టిక్ యాక్షన్ మరోసారి వెండితెరపై పేలడం ఖాయమనిపిస్తోంది. భూషణ్ కుమార్ నిర్మిస్తున్న ఈ చిత్రం కేవలం ఇండియన్ సినిమాగానే కాకుండా 'పాన్ వరల్డ్' ఎంటర్‌టైనర్‌గా సిద్ధమవుతోంది.

తరచుగా అడిగే ప్రశ్నలు (FAQs)

1. ప్రభాస్ 'స్పిరిట్' విడుదల తేదీ ఎందుకు మారుతోంది?

సల్మాన్ ఖాన్ - వంశీ పైడిపల్లి సినిమాతో బాక్సాఫీస్ వద్ద ఘర్షణను నివారించడానికి, సోలో రిలీజ్ ద్వారా గరిష్ట కలెక్షన్లు సాధించడానికి విడుదల తేదీని మారుస్తున్నారు.

2. స్పిరిట్ సినిమా కొత్త విడుదల తేదీ ఎప్పుడు ఉండొచ్చు?

అధికారిక ప్రకటన రానప్పటికీ, డిసెంబర్ 1, 2027న ఈ సినిమాను విడుదల చేసేందుకు సన్నాహాలు జరుగుతున్నట్లు సమాచారం.

3. 'స్పిరిట్' చిత్రంలో హీరోయిన్ ఎవరు?

ఈ సినిమాలో ప్రభాస్ సరసన త్రిప్తి దిమ్రి హీరోయిన్‌గా నటిస్తోంది. ఆమె ఇప్పటికే 'యానిమల్' సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకుంది.

 
ABOUT THE AUTHOR
Hari Prasad S

హరి ప్రసాద్ శీలమంతుల ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. మీడియా రంగంలో 20 ఏళ్లకు పైగా సుదీర్ఘ అనుభవం కలిగిన ఆయన, డిజిటల్ మీడియాలో గత 10 ఏళ్లుగా విశేష సేవలందిస్తున్నారు. ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలు, సినిమా వార్తలను అందించడంలో ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఆయన తన అద్భుతమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. హరి ప్రసాద్ తన కెరీర్‌లో ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా వంటి మూడు ప్రధాన విభాగాల్లోనూ పనిచేశారు. హిందుస్థాన్ టైమ్స్‌లో చేరకముందు, ఆయన తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ దినపత్రికలు, టీవీ ఛానెళ్లయిన ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి వంటి సంస్థలలో కీలక బాధ్యతలు నిర్వహించారు. నవంబర్ 1, 2021న హిందుస్థాన్ టైమ్స్ తెలుగు టీమ్‌లో చేరిన ఆయన.. ప్రస్తుతం స్పోర్ట్స్ (ముఖ్యంగా క్రికెట్ అనాలసిస్), ఎంటర్‌టైన్మెంట్ సెక్షన్ల బాధ్యతలను చూసుకుంటున్నారు. ఈయన ఉస్మానియా యూనివర్సిటీ నుంచి బీఎస్సీ (కంప్యూటర్ సైన్స్) పట్టా పొందారు. సాంకేతిక పరిజ్ఞానంతో పాటు జర్నలిజంపై ఉన్న మక్కువతో జర్నలిజంలో డిప్లొమా పూర్తి చేసి, వృత్తిపరమైన నైపుణ్యాలను మెరుగుపరుచుకున్నారు. క్రీడా రంగంలో వస్తున్న మార్పులను, సినిమా ఇండస్ట్రీ అప్‌డేట్స్‌ను లోతుగా విశ్లేషించి పాఠకులకు అర్థమయ్యే రీతిలో అందించడం హరి ప్రసాద్ శైలి.

SHARE THIS ARTICLE ON
Hindustantimes wants to start sending you push notifications. Click allow to subscribe