Sreeleela Periods: ఆ హిట్ సాంగ్స్ అన్నీ పీరియడ్స్‌లో ఉన్నప్పుడే చేశానన్న శ్రీలీల.. దారుణంగా ట్రోల్ చేస్తున్న నెటిజన్లు

Sreeleela Periods: శ్రీలీల పీరియడ్స్ పై చేసిన కామెంట్స్ ఇప్పుడు దుమారం రేపుతున్నాయి. తన హిట్ సాంగ్స్ లో చాలా వరకు తాను పీరియడ్స్ లో ఉన్నప్పుడు చేసినవే అని ఆమె ఓ ఈవెంట్ లో చెప్పడంపై నెటిజన్లు ఆమెను దారుణంగా ట్రోల్ చేస్తున్నారు.

Published on: Apr 9, 2026, 17:58:33 IST
By , Hyderabad
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

Sreeleela Periods: టాలీవుడ్ సెన్సేషనల్ డ్యాన్సర్, నటి శ్రీలీల ప్రస్తుతం ఒక వివాదంలో చిక్కుకుంది. నెలసరి (Menstruation) సమయంలో మహిళలు పడే ఇబ్బందులపై ఆమె చేసిన కామెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో తీవ్ర దుమారాన్ని రేపుతున్నాయి. మార్చిలో జరిగిన ‘ఉస్తాద్ భగత్ సింగ్’ సక్సెస్ మీట్ సందర్భంగా ఆమె మాట్లాడిన మాటలు ఇప్పుడు మళ్లీ తెరపైకి రావడంతో నెటిజన్లు ఆమెపై విమర్శల వర్షం కురిపిస్తున్నారు.

Sreeleela Periods: ఆ హిట్ సాంగ్స్ అన్నీ పీరియడ్స్‌లో ఉన్నప్పుడే చేశానన్న శ్రీలీల.. దారుణంగా ట్రోల్ చేస్తున్న నెటిజన్లు
Sreeleela Periods: ఆ హిట్ సాంగ్స్ అన్నీ పీరియడ్స్‌లో ఉన్నప్పుడే చేశానన్న శ్రీలీల.. దారుణంగా ట్రోల్ చేస్తున్న నెటిజన్లు

శ్రీలీల ఏమన్నదంటే?

ఒక ఇంటర్వ్యూలో తన పని పట్ల ఉన్న అంకితభావాన్ని వివరిస్తూ శ్రీలీల ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. "నేను నటించిన సాంగ్స్ అన్నీ మంచి గుర్తింపు తెచ్చుకున్నాయి. చాలా వరకు పాటల షూటింగ్‌లో నేను పిరియడ్స్‌లో ఉన్నప్పుడే పాల్గొన్నాను. మనకు సమాన హక్కులు కావాలని కోరుకున్నప్పుడు, శారీరక ఇబ్బందులను సాకులుగా చూపకూడదు. మానసిక, శారీరక అడ్డంకులు దేనికీ సాకులు కాకూడదని నేను నమ్ముతాను" అని ఆమె పేర్కొంది. ఈ వ్యాఖ్యలకు సంబంధించిన వీడియోను ‘సీత’ మొబైల్ యాప్ సోషల్ మీడియాలో షేర్ చేయగా, విమర్శలు రావడంతో ప్రస్తుతం దాన్ని తొలగించారు.

మండిపడుతున్న నెటిజన్లు

శ్రీలీల చేసిన ఈ కామెంట్స్ పై మహిళలు, నెటిజన్లు తీవ్రంగా స్పందిస్తున్నారు. ఒక్కొక్కరి శరీరతత్వం ఒక్కోలా ఉంటుందని, అందరికీ ఒకేలాంటి అనుభవం ఉండదని గుర్తు చేస్తున్నారు.

కొందరికి పిరియడ్స్ సమయంలో వచ్చే నొప్పి సాధారణ కార్యకలాపాలను కూడా చేసుకోనివ్వదని, దాన్ని సాకుగా చూడటం సరికాదని నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు.

PCOS (పాలిసిస్టిక్ ఓవరీ సిండ్రోమ్) వంటి సమస్యలు ఉన్న మహిళలు ఎదుర్కొనే నరకం శ్రీలీలకు తెలియదా అని ప్రశ్నిస్తున్నారు. శ్రీలీలకు మెడికల్ బ్యాక్‌గ్రౌండ్ ఉంది. ఆమె ఒక డాక్టర్ అయ్యి ఉండి కూడా ఇంత సున్నితమైన విషయాన్ని జనరలైజ్ చేయడం ఏంటని విస్మయం వ్యక్తం చేస్తున్నారు.

హార్మోన్ల అసమతుల్యత, తీవ్రమైన అలసట వంటి అంశాలను విస్మరించి, దాన్ని కేవలం ఒక ‘సాకు’గా అభివర్ణించడం మహిళల ఆరోగ్యం పట్ల అవగాహన లేకపోవడమేనని విమర్శలు వస్తున్నాయి.

శ్రీలీల ప్రస్తుత సినిమాలు

వివాదాలు పక్కన పెడితే శ్రీలీల కెరీర్ పరంగా దూసుకుపోతోంది. ఈ మధ్యే ఆమె పవన్ కల్యాణ్ తో ఉస్తాద్ భగత్ సింగ్ మూవీలో నటించింది. ఇక ఇప్పుడు అనురాగ్ బసు దర్శకత్వంలో కార్తీక్ ఆర్యన్ సరసన నటిస్తూ బాలీవుడ్ ఎంట్రీ ఇస్తోంది.

తమిళంలో ధనుష్ హీరోగా, 'అమరన్' ఫేమ్ రాజ్‌కుమార్ పెరియాసామి దర్శకత్వంలో తెరకెక్కుతున్న 'D55' చిత్రంలో కీలక పాత్ర పోషిస్తోంది. ఈ సినిమాలో మమ్ముట్టి, సాయి పల్లవి కూడా నటిస్తుండటం విశేషం.

తరచుగా అడిగే ప్రశ్నలు (FAQs)

1. శ్రీలీల చేసిన వ్యాఖ్యల వివాదం ఏమిటి?

పిరియడ్స్ సమయంలో వచ్చే శారీరక ఇబ్బందులను సాకులుగా చూపకూడదని, తాను పిరియడ్స్‌లో ఉన్నా షూటింగ్‌లు చేశానని శ్రీలీల చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమయ్యాయి.

2. నెటిజన్లు శ్రీలీలను ఎందుకు విమర్శిస్తున్నారు?

మహిళలందరికీ నెలసరి సమయంలో ఒకే రకమైన నొప్పి ఉండదని, కొందరికి ఇది అత్యంత బాధాకరంగా ఉంటుందని నెటిజన్లు శ్రీలీలకు గుర్తు చేస్తున్నారు. ముఖ్యంగా ఆమె వైద్య విద్య చదివి ఉండి ఇలా మాట్లాడటంపై అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు.

3. శ్రీలీల తదుపరి సినిమాలు ఏమిటి?

ఆమె కార్తీక్ ఆర్యన్ సరసన బాలీవుడ్ డెబ్యూ చేస్తున్నారు. అలాగే ధనుష్, సాయి పల్లవిలతో కలిసి ఒక తమిళ చిత్రంలో నటిస్తున్నారు.

  • Hari Prasad S
    ABOUT THE AUTHOR
    Hari Prasad S

    హరి ప్రసాద్ శీలమంతుల ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. మీడియా రంగంలో 20 ఏళ్లకు పైగా సుదీర్ఘ అనుభవం కలిగిన ఆయన, డిజిటల్ మీడియాలో గత 10 ఏళ్లుగా విశేష సేవలందిస్తున్నారు. ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలు, సినిమా వార్తలను అందించడంలో ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఆయన తన అద్భుతమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. హరి ప్రసాద్ తన కెరీర్‌లో ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా వంటి మూడు ప్రధాన విభాగాల్లోనూ పనిచేశారు. హిందుస్థాన్ టైమ్స్‌లో చేరకముందు, ఆయన తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ దినపత్రికలు, టీవీ ఛానెళ్లయిన ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి వంటి సంస్థలలో కీలక బాధ్యతలు నిర్వహించారు. నవంబర్ 1, 2021న హిందుస్థాన్ టైమ్స్ తెలుగు టీమ్‌లో చేరిన ఆయన.. ప్రస్తుతం స్పోర్ట్స్ (ముఖ్యంగా క్రికెట్ అనాలసిస్), ఎంటర్‌టైన్మెంట్ సెక్షన్ల బాధ్యతలను చూసుకుంటున్నారు. ఈయన ఉస్మానియా యూనివర్సిటీ నుంచి బీఎస్సీ (కంప్యూటర్ సైన్స్) పట్టా పొందారు. సాంకేతిక పరిజ్ఞానంతో పాటు జర్నలిజంపై ఉన్న మక్కువతో జర్నలిజంలో డిప్లొమా పూర్తి చేసి, వృత్తిపరమైన నైపుణ్యాలను మెరుగుపరుచుకున్నారు. క్రీడా రంగంలో వస్తున్న మార్పులను, సినిమా ఇండస్ట్రీ అప్‌డేట్స్‌ను లోతుగా విశ్లేషించి పాఠకులకు అర్థమయ్యే రీతిలో అందించడం హరి ప్రసాద్ శైలి.Read More