...
...
Next Story

Sreeleela: యంగ్ క్రికెటర్ తో శ్రీలీల రిలేషన్.. వైరల్ గా రూమర్.. ఆ ఆటగాడు ఎవరంటే?

Sreeleela: టాలీవుడ్ సెన్సేషనల్ బ్యూటీ శ్రీలీల గురించి ఏ వార్త వచ్చిన సంచలనమే. తాజాగా ఈ బ్యూటీ రిలేషన్ గురించి వచ్చిన పుకార్లు తెగ వైరల్ గా మారాయి. ఓ యంగ్ క్రికెటర్ తో ఈ భామ డేటింగ్ లో ఉందనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి.

Published on: May 17, 2026, 09:37:10 IST
Advertisement

Sreeleela: ఓ వైపు యాక్టింగ్ తో మరోవైపు అందంతో అలరిస్తుంది శ్రీలీల. రీసెంట్ గా డాక్టర్ గానూ మారిన ఈ భామ వరుస సినిమాలతో బిజీగా ఉంది. తెలుగు, తమిళంలో మూవీస్ చేస్తోంది. అయితే తాజాగా ఈ భామ గురించి ఓ రూమర్ తెగ వైరల్ గా మారింది. యంగ్ క్రికెటర్ తో ఈ బ్యూటీ డేటింగ్ లో ఉందనే ఊహాగానాలు చక్కర్లు కొడుతున్నాయి.

శ్రీలీల డేటింగ్

శ్రీలీల
శ్రీలీల

టాలీవుడ్ సెన్సేషనల్ బ్యూటీ శ్రీలీల ఏం చేసినా హాట్ టాపిక్ గా మారుతుంది. ఆమె డ్యాన్స్, యాక్టింగ్ తో అదరగొడుతోంది. తాజాగా శ్రీలీలకు సంబంధించిన ఓ వార్త తెగ చక్కర్లు కొడుతుంది. ఈ భామ ఓ క్రికెటర్ తో రిలేషన్ లో ఉందనేది హాట్ టాపిక్ గా మారింది. దీంతో ఈ ఆ క్రికెటర్ ఎవరనేది తీవ్ర చర్చనీయాంశంగా మారింది.

ఆ క్రికెటర్ ఎవరు?

శ్రీలీల డేటింగ్ చేస్తున్న క్రికెటర్ ఎవరనేది ఇప్పుడు ఉత్కంఠ కలిగిస్తోంది. అయితే తెలుగు యంగ్ క్రికెటర్ తిలక్ వర్మనే ఆ ఆటగాడు అన్న ఊహాగానాలు తెగ ప్రచారం అవుతున్నాయి. ప్రస్తుతం ఐపీఎల్ 2026లో ముంబయి ఇండియన్స్ కు ఆడుతున్న తిలక్ వర్మ తన బ్యాటింగ్ తో అదరగొడుతున్నాడు.

నిజమేనా?

శ్రీలీల, తిలక్ వర్మ డేటింగ్ వార్తలు గుప్పుమంటున్నాయి. కానీ దీనిపై అటు శ్రీలీల కానీ ఇటు తిలక్ వర్మ కానీ స్పందించలేదు. వాళ్ల సన్నిహితుల నుంచి కూడా ఎలాంటి సమాచారం రాలేదు. దీన్ని బట్టి ఈ పుకార్లపై ఇప్పుడే ఓ అంచనాకు రాలేమని కామెంట్లు కూడా వినిపిస్తున్నాయి. మరికొంతమందేమో శ్రీలీల, తిలక్ డేటింగ్ లో ఉన్నారని తమ వర్షన్ వినిపిస్తున్నారు.

బిజీబిజీగా

మరోవైపు తమిళంలోనూ శ్రీలల తనదైన ముద్ర వేసేందుకు ప్రయత్నిస్తోంది. శివ కార్తీకేయన్ హీరోగా నటించిన పరాశక్తి మూవీతో శ్రీలీల కోలీవుడ్ లో అడుగుపెట్టింది. ఇప్పుడు సూపర్ స్టార్ ధనుష్ హీరోగా నటిస్తున్న మూవీలో ఈ బ్యూటీ హీరోయిన్ గా చేస్తోంది.

తెలుగు సినిమాల్లో, తమిళంలోనూ శ్రీలీల జోరు కొనసాగిస్తోంది. మరోవైపు బాలీవుడ్ హీరో ఆర్యన్ కార్తీక్ తో హిందీలోనూ ఈ భామ ఓ మూవీ చేస్తోంది. ఈ నేపథ్యంలో ఆర్యన్, శ్రీలీల డేటింగ్ లో ఉన్నారనే పుకార్లూ వినిపిస్తున్నాయి.

 
ABOUT THE AUTHOR
Chandu Shanigarapu

చందు శనిగారపు ప్రస్తుతం హిందూస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ రైట‌ర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. మీడియా రంగంలో ఎనిమిదేళ్లకు పైగా అనుభవం ఆయన సొంతం. 2025 నుంచి డిజిటల్ మీడియాలోనూ తనదైన ముద్ర వేస్తున్నారు. సినిమా వార్తలను ఎప్పటికప్పుడు అందించడం, స్పోర్ట్స్ న్యూస్ ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలను చదివించేలా ఇవ్వడం ఆయన ప్రత్యేకత. మ్యాచ్ రిపోర్ట్ లను వేగంగా అందించడం, లైవ్ అప్ డేట్స్ ఇవ్వడంలో ఆయన ముందుంటారు. చందు తన కెరీర్ లో ప్రింట్ మీడియాలో ఎక్కువగా పనిచేశారు. ప్రముఖ దినపత్రిక ఈనాడులో ఏడేళ్లకు పైగా స్పోర్ట్స్ రిపోర్టర్ గా పనిచేశారు. తన ఆర్టికల్స్ తో ఎంతోమంది యువ క్రీడాకారుల ప్రతిభను వెలుగులోకి తెచ్చారు. ప్రత్యేక ఆర్టికల్స్ తో వాళ్లకు ఆర్థిక సాయం అందేలా చూశారు. క్రికెట్ ప్రపంచకప్ లు, ఒలింపిక్స్ లాంటి మెగా టోర్నీల కవరేజీలో ఆయనకు విశిష్ఠ అనుభవం ఉంది. మల్లారెడ్డి కాలేజీ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ నుంచి చందు బీటెక్ డిగ్రీ పొందారు. ఓ వైపు టెక్నికల్ నాలెడ్జ్ తో పాటు జర్నలిజంపై ప్రేమతో మీడియా రంగంలో కొనసాాగుతున్నారు. జర్నలిజంలో డిప్లొమా చేశారు. సినిమా వార్తలను, మూవీ రివ్యూలను, ఓటీటీ విషయాలను, క్రికెట్ సమాచారాన్ని, క్రీడా సంగతులను పాఠకులకు అందిస్తున్నారు.

SHARE THIS ARTICLE ON
Notifications

Get breaking alerts directly from the newsroom

Notifications are on!You'll be notified when news breaks