...
...
Next Story

Sridevi Mithun Love Story: పెళ్లయినా శ్రీదేవితో ప్రేమాయణం.. గంటల తరబడి ఫోన్‌లో.. షూటింగ్ ఆపి మరీ..: డైరెక్టర్ కామెంట్స్

Sridevi Mithun Love Story: భారతీయ సినీ చరిత్రలో అతిలోక సుందరి శ్రీదేవి, బాలీవుడ్ నటుడు మిథున్ చక్రవర్తి మధ్య నడిచిన ప్రేమాయణం గురించి ప్రముఖ ఫిల్మ్ మేకర్, సినిమాటోగ్రాఫర్ లారెన్స్ డిసౌజా ఆసక్తికర విషయాలు వెల్లడించారు. మిథున్ అప్పటికే నటిని వివాహం చేసుకున్నప్పటికీ.. శ్రీదేవిని ప్రేమించారని చెప్పారు.

Published on: Nov 25, 2026, 20:13:00 IST
Advertisement

Sridevi Mithun Love Story: భారతీయ వెండితెరపై అతిలోక సుందరిగా కోట్లాది మంది అభిమానుల హృదయాలను గెలుచుకున్న దివంగత నటి శ్రీదేవి వ్యక్తిగత జీవితం ఎప్పుడూ ఆసక్తికరమే. ముఖ్యంగా 1980వ దశకంలో బాలీవుడ్ స్టార్ హీరో మిథున్ చక్రవర్తితో ఆమెకున్న సాన్నిహిత్యం, ప్రేమాయణం అప్పట్లో సినీ వర్గాల్లో పెను సంచలనం సృష్టించింది.

Sridevi Mithun Love Story: పెళ్లయినా శ్రీదేవితో ప్రేమాయణం.. గంటల తరబడి ఫోన్‌లో.. షూటింగ్ ఆపి మరీ..: డైరెక్టర్ కామెంట్స్ (instagram)
Sridevi Mithun Love Story: పెళ్లయినా శ్రీదేవితో ప్రేమాయణం.. గంటల తరబడి ఫోన్‌లో.. షూటింగ్ ఆపి మరీ..: డైరెక్టర్ కామెంట్స్ (instagram)

తాజాగా ప్రముఖ బాలీవుడ్ దర్శకుడు, సినిమాటోగ్రాఫర్ లారెన్స్ డిసౌజా (Lawrence D'Souza) సిద్ధార్థ్ కన్నన్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో శ్రీదేవి, మిథున్ మధ్య ఉన్న గాఢమైన ప్రేమ గురించి ఎన్నో ఆసక్తికర, సంచలన నిజాలను బయటపెట్టారు.

షూటింగ్ ఆపి మరీ ఫోన్ కాల్స్.. మేకప్ రూమ్‌లో మిథున్ వెయిటింగ్

ఆ రోజుల్లో జరిగిన సంఘటనలను గుర్తుచేసుకుంటూ లారెన్స్ డిసౌజా పలు ఆసక్తికర విషయాలను పంచుకున్నారు.

“శ్రీదేవి సాధారణంగా షూటింగ్ పూర్తయిన తర్వాత ఎవరితోనూ ఎక్కువగా మాట్లాడకుండా తన పని తాను చేసుకునే రిజర్వ్‌డ్ స్వభావం గల వ్యక్తి. ఆ రోజుల్లో మొబైల్ ఫోన్లు లేవు, ల్యాండ్‌లైన్ ఫోన్లే ఉండేవి. కానీ సెట్‌లో ఉన్నప్పుడు మిథున్ నుంచి ఆమెకు తరచూ ఫోన్ కాల్స్ వచ్చేవి” అని లారెన్స్ తెలిపారు.

"మిథున్ ఫోన్ రాగానే శ్రీదేవి షూటింగ్ మధ్యలోనే ఆపి మాట్లాడటానికి వెళ్లిపోయేవారు. అలా రోజుకు చాలాసార్లు జరిగేది. దీంతో మేము ఆమెను ఆటపట్టించడానికి నోటితో ఫోన్ రింగ్ అవుతున్నట్లు శబ్దం చేసేవాళ్లం. అది నిజమే అనుకుని శ్రీదేవి అటూ ఇటూ చూసేవారు, దాంతో సెట్ అంతా నవ్వులతో నిండిపోయేది"* అని ఆయన చెప్పారు.

శ్రీదేవి ఈ బంధంలో మానసికంగా ఎంతో లోతుగా లీనమై ఉండేవారా అని ప్రశ్నించగా, లారెన్స్ అవునని సమాధానమిచ్చారు. “ఆ సమయంలో మిథున్ చక్రవర్తికి అప్పటికే నటి యోగితా బాలితో వివాహమైంది. అయినప్పటికీ శ్రీదేవి, మిథున్ ప్రేమించుకుంటున్నారనే విషయం సెట్‌లో అందరికీ తెలుసు. వారు తమ ప్రేమను ఎప్పుడూ దాచుకోలేదు, బహిరంగంగానే ఉండేవారు” అని తెలిపారు.

మరి ఈ వార్తలు విని మిథున్ భార్య యోగితా బాలి ఎప్పుడైనా షూటింగ్ సెట్స్‌కు వచ్చారా అని అడగ్గా.. “లేదు, ఆమె ఎప్పుడూ సెట్‌కు రాలేదు” అని లారెన్స్ స్పష్టం చేశారు.

వెండితెరపై హిట్ పెయిర్.. ఆ తర్వాత జీవిత మలుపులు

తెరపై శ్రీదేవి, మిథున్ చక్రవర్తి కెమిస్ట్రీకి ప్రేక్షకులు బ్రహ్మరథం పట్టారు. వీరిద్దరూ కలిసి నటించిన ‘జాగ్ ఉఠా ఇన్సాన్’, ‘వతన్ కే రఖ్వాలే’, 'వక్త్ కీ ఆవాజ్', 'గురు' వంటి చిత్రాలు మంచి విజయాన్ని అందుకున్నాయి. ముఖ్యంగా 'గురు' బాక్సాఫీస్ వద్ద భారీ కమర్షియల్ హిట్‌గా నిలిచింది.

అయితే ఆ తర్వాత కొన్ని వ్యక్తిగత కారణాల వల్ల వీరిద్దరి దారులు వేరయ్యాయి. అనంతరం శ్రీదేవి ప్రముఖ నిర్మాత బోనీ కపూర్ (Boney Kapoor)ను వివాహం చేసుకున్నారు. వీరికి జాన్వీ కపూర్, ఖుషీ కపూర్ అనే ఇద్దరు కుమార్తెలు జన్మించారు. 2018 ఫిబ్రవరిలో దుబాయ్‌లో జరిగిన దురదృష్టకర ఘటనలో శ్రీదేవి కన్నుమూయడం భారతీయ చిత్ర పరిశ్రమకు తీరని లోటుగా మిగిలిపోయింది.

 

ABOUT THE AUTHOR

హరి ప్రసాద్ శీలమంతుల ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. మీడియా రంగంలో 20 ఏళ్లకు పైగా సుదీర్ఘ అనుభవం కలిగిన ఆయన, డిజిటల్ మీడియాలో గత 10 ఏళ్లుగా విశేష సేవలందిస్తున్నారు. ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలు, సినిమా వార్తలను అందించడంలో ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఆయన తన అద్భుతమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. హరి ప్రసాద్ తన కెరీర్‌లో ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా వంటి మూడు ప్రధాన విభాగాల్లోనూ పనిచేశారు. హిందుస్థాన్ టైమ్స్‌లో చేరకముందు, ఆయన తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ దినపత్రికలు, టీవీ ఛానెళ్లయిన ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి వంటి సంస్థలలో కీలక బాధ్యతలు నిర్వహించారు. నవంబర్ 1, 2021న హిందుస్థాన్ టైమ్స్ తెలుగు టీమ్‌లో చేరిన ఆయన.. ప్రస్తుతం స్పోర్ట్స్ (ముఖ్యంగా క్రికెట్ అనాలసిస్), ఎంటర్‌టైన్మెంట్ సెక్షన్ల బాధ్యతలను చూసుకుంటున్నారు. ఈయన ఉస్మానియా యూనివర్సిటీ నుంచి బీఎస్సీ (కంప్యూటర్ సైన్స్) పట్టా పొందారు. సాంకేతిక పరిజ్ఞానంతో పాటు జర్నలిజంపై ఉన్న మక్కువతో జర్నలిజంలో డిప్లొమా పూర్తి చేసి, వృత్తిపరమైన నైపుణ్యాలను మెరుగుపరుచుకున్నారు. క్రీడా రంగంలో వస్తున్న మార్పులను, సినిమా ఇండస్ట్రీ అప్‌డేట్స్‌ను లోతుగా విశ్లేషించి పాఠకులకు అర్థమయ్యే రీతిలో అందించడం హరి ప్రసాద్ శైలి.

SHARE THIS ARTICLE ON
Notifications

Get breaking alerts directly from the newsroom

Notifications are on!You'll be notified when news breaks