Janhvi Kapoor On Sridevi: ఆ ఒక్క సర్జరీతో మారిన శ్రీదేవి నిర్ణయం.. తల్లి హెచ్చరికపై జాన్వీ కపూర్ కామెంట్స్
Janhvi Kapoor About Sridevi Changed Decision: నటిగా మారాలని అనుకున్నప్పుడు తల్లి శ్రీదేవి మొదట వద్దన్నారని, కానీ ఒక్క సర్జరీ చేసుకున్న తర్వాతే తన ఆలోచన మార్చుకున్నారని జాన్వీ కపూర్ ఓ ఇంటర్వ్యూలో వెల్లడించారు. గలట్టా ప్లస్ ఇంటర్వ్యూలో తన పిన్ని కూతురు, నటి మహేశ్వరితో ఈ విషయాలను పంచుకున్నారు.
Janhvi Kapoor About Sridevi Changed DecisionL: అతిలోక సుందరి శ్రీదేవి తనయగా వెండితెరకు పరిచయమైన జాన్వీ కపూర్, తన కెరీర్ ఆరంభంలో ఎదురైన అనుభవాలను ఇటీవల ఒక ఇంటర్వ్యూలో పంచుకున్నారు. భారతీయ సినిమాలో అత్యున్నత స్థానాన్ని అందుకున్న శ్రీదేవి, తన కూతురు నటిగా మారడంపై మొదట్లో పెద్దగా ఆసక్తి చూపించలేదట.

తల్లి శ్రీదేవి హెచ్చరిక
సినీ పరిశ్రమలో ఉండే కష్టం, ఒత్తిడి దృష్ట్యా జాన్వీ కపూర్ నటనపై మొగ్గు చూపినప్పుడు తల్లి శ్రీదేవి హెచ్చరించినట్లు చెప్పారు. "నేను నటిని అవుతానంటే అమ్మ మొదట్లో అస్సలు ఒప్పుకోలేదు. ఈ రంగంలో రాణించాలంటే ఎంతో శ్రమించాలి, ఎంతో మానసిక బలం ఉండాలి అని చెప్పేవారు" అని జాన్వీ కపూర్ గుర్తు చేసుకున్నారు.
నాకు పెద్దగా ఇష్టం లేదు
శ్రీదేవి సోదరి కుమార్తె, నటి మహేశ్వరి కూడా ఈ ఇంటర్వ్యూలో పాల్గొని అప్పటి పరిస్థితులను వివరించారు. "జాన్వి సినిమాల్లోకి రావాలనుకుంటోంది, కానీ నాకు పెద్దగా ఇష్టం లేదు. అక్కడ నిలదొక్కుకోవాలంటే ఎంతో పట్టుదల, బలం ఉండాలి" అని శ్రీదేవి తనతో అన్నట్లు మహేశ్వరి చెప్పారు.
ఆ ఒక్క సర్జరీతో మారిన శ్రీదేవి అభిప్రాయం
అయితే ఈ క్రమంలోనే జాన్వీ కపూర్ ఒక నవ్వు తెప్పించే విషయాన్ని బయటపెట్టారు. "నేను ముక్కు సర్జరీ చేయించుకోవడానికి ముందు అమ్మ నాపై పెద్దగా నమ్మకంతో లేరు. కానీ నోస్ జాబ్ చేయించుకున్నాక.. 'ఇప్పుడు కొంత పొటెన్షియల్ కనిపిస్తోంది' అంటూ నవ్వేశారు" అని జాన్వీ కపూర్ సరదాగా వ్యాఖ్యానించారు. తల్లి చెప్పిన ఈ మాటలు ఇప్పటికీ తనకు బాగా గుర్తుండిపోయాయని ఆమె అన్నారు.
2018లో తీరని లోటు
2018 ఫిబ్రవరిలో దుబాయ్‌లో బంధువుల వివాహానికి వెళ్లిన శ్రీదేవి ప్రమాదవశాత్తూ బాత్‌టబ్‌లో మునిగి కన్నుమూసిన సంగతి తెలిసిందే. ఆమె అకాల మరణం భారతీయ సినీ ప్రపంచాన్ని, కోట్లాది మంది అభిమానులను తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది. జాన్వీ కపూర్ మొదటి సినిమా 'ధడక్' విడుదల కాకముందే తల్లి దూరమవ్వడం ఆమె జీవితంలో కోలుకోలేని లోటుగా మిగిలిపోయింది.
టాలీవుడ్ నుంచి కోలీవుడ్ దాకా వరుస ప్రాజెక్టులు
ప్రస్తుతం జాన్వీ కపూర్ విభిన్నమైన కథలను ఎంచుకుంటూ వరుస సినిమాలతో బిజీగా ఉన్నారు. ఇటీవల రామ్ చరణ్ సరసన 'పెద్ది' సినిమాలో నటించిన ఆమె, తన పాత్రతో ప్రేక్షకులలో మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. దీనితో పాటు టైగర్ ష్రాఫ్, లక్ష్య కాంబినేషన్లో వస్తున్న 'లగ్ జా గలే' యాక్షన్ చిత్రంలోనూ కనిపిస్తున్నారు.
క్రైమ్ థ్రిల్లర్ టు హారర్
శ్రీలీల, జాన్వీ కపూర్ కాంబోలో ఒక క్రైమ్ థ్రిల్లర్ రూపుదిద్దుకుంటోంది. మరోవైపు తమిళంలో ధ్రువ్ విక్రమ్‌తో కలిసి నటించేందుకు సన్నాహాలు చేసుకుంటున్నారు జాన్వీ కపూర్. అంతేకాకుండా 'తుంబాడ్' చిత్ర దర్శకుడు రాహి అనిల్ బార్వేతో ఒక విభిన్నమైన హారర్ ప్రాజెక్ట్ చర్చల దశలో ఉంది. బాలీవుడ్ నుంచి సౌత్ వరకు ప్రతిష్టాత్మక సినిమాల్లో నటిస్తూ నటిగా తనదైన ముద్ర వేసేందుకు జాన్వీ వేగంగా అడుగులు వేస్తున్నారు.
తరచుగా అడిగే ప్రశ్నలు (FAQs)
ప్రశ్న 1: జాన్వీ కపూర్ నటి అవ్వడంపై శ్రీదేవి మొదట ఎలా స్పందించారు?
జవాబు: సినీ పరిశ్రమలో ఎంతో శ్రమ, మానసిక ఒత్తిడి ఉంటాయని, నటి కావడం అంత సులువు కాదని శ్రీదేవి మొదట జాన్వీని హెచ్చరించారు.
ప్రశ్న 2: జాన్వీ కపూర్ నటనపై శ్రీదేవి అభిప్రాయం ఎప్పుడు మారింది?
జవాబు: జాన్వీ ముక్కు సర్జరీ చేయించుకున్న తర్వాతే ఆమెలో నటన పత్స కొంత ప్రతిభ (పొటెన్షియల్) కనిపిస్తోందని శ్రీదేవి సరదాగా వ్యాఖ్యానించారని జాన్వీ చెప్పారు.
ప్రశ్న 3: జాన్వీ కపూర్ నటిస్తున్న తాజా సినిమాలు ఏవి?
జవాబు: రామ్ చరణ్‌తో 'పెద్ది'తో పాటు టైగర్ ష్రాఫ్‌తో 'లగ్ జా గలే', శ్రీలీలతో ఒక థ్రిల్లర్, ధృవ్ విక్రమ్‌తో తమిళ చిత్రం, అలాగే 'తుంబాడ్' దర్శకుడితో హారర్ ప్రాజెక్ట్‌లలో జాన్వీ నటిస్తున్నారు.
ABOUT THE AUTHORChetupelli Sanjiv Kumarచెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్టైన్మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.Read More

E-Paper


