Nushrratt Bharuccha: ఛత్రపతి హీరోయిన్‌కు రోడ్డు ప్రమాదం- విరిగిన వెన్నెముక- అత్యవసర సర్జరీ- ఎయిర్ అంబులెన్స్‌లో తరలింపు!

Nushrratt Bharuccha Spine Injury In Accident: షూటింగ్, విహారయాత్ర కోసం ఇండోనేషియాలోని బాలి వెళ్లిన బెల్లంకొండ సాయి శ్రీనివాస్ ఛత్రపతి సినిమా హీరోయిన్ నుష్రత్ భరూచా ప్రమాదవశాత్తు తీవ్ర గాయాలపాలయ్యారు. వెన్నెముక విరగడంతో అత్యవసర శస్త్రచికిత్స కోసం ఆమెను ఎయిర్ అంబులెన్స్ ద్వారా ముంబైకి తరలిస్తున్నారు.

Published on: Oct 2, 2026, 13:52:39 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
Copy link
  • copy link

Nushrratt Bharuccha Spine Injury In Accident: బాలీవుడ్ ప్రముఖ హీరోయిన్ నుష్రత్ భరూచా అభిమానులను, సినీ వర్గాలను తీవ్ర ఆందోళనకు గురిచేసే వార్త వెలుగులోకి వచ్చింది. పనికి కాస్త విరామం ఇచ్చి సరదాగా గడిపేందుకు ఇండోనేషియాలోని బాలి వెళ్లిన నుష్రత్ అక్కడ అనుకోకుండా తీవ్ర రోడ్డు ప్రమాదానికి గురయ్యారు.

ఛత్రపతి హీరోయిన్‌కు రోడ్డు ప్రమాదం- విరిగిన వెన్నెముక- అత్యవసర సర్జరీ- ఎయిర్ అంబులెన్స్‌లో తరలింపు!
ఛత్రపతి హీరోయిన్‌కు రోడ్డు ప్రమాదం- విరిగిన వెన్నెముక- అత్యవసర సర్జరీ- ఎయిర్ అంబులెన్స్‌లో తరలింపు!

ఎయిర్ అంబులెన్స్‌లో ముంబైకి తరలింపు

ఈ దురదృష్టకర ఘటనలో నుష్రత్ భరూచా వెన్నెముకకు తీవ్ర గాయమై ఎముక విరిగినట్లు సమాచారం. ప్రమాదం జరిగిన వెంటనే నుష్రత్‌ను బాలిలోని స్థానిక ఆసుపత్రికి తరలించి ప్రాథమిక చికిత్స అందించారు. అక్కడ ప్రస్తుతం ఆమె వైద్యుల పర్యవేక్షణలో ఉన్నారు.

అత్యవసర శస్ర్తచికిత్స కోసం

అయితే, వెన్నెముక తీవ్రంగా దెబ్బతినడంతో అత్యవసర శస్త్రచికిత్స (Spine Surgery) అవసరమని వైద్యులు స్పష్టం చేశారు. దీంతో మెరుగైన వైద్య సేవలు, ఆపరేషన్ కోసం నుష్రత్ భరూచాను ప్రత్యేక ఎయిర్ అంబులెన్స్ ద్వారా బాలి నుంచి ముంబైకి తీసుకువెళ్తున్నట్లు తెలుస్తోంది.

వైద్య సదుపాయాలు ఉండే ఎయిర్ అంబులెన్స్‌లో

తీవ్రమైన వెన్నెముక గాయాలు ఉన్నప్పుడు సాధారణ విమాన ప్రయాణం ప్రమాదకరం కాబట్టి, సకల వైద్య సదుపాయాలు ఉండే ఎయిర్ అంబులెన్స్‌ను ఏర్పాటు చేశారు. ముంబై చేరిన వెంటనే ఆమెను ప్రధాన ఆసుపత్రిలో చేర్చి శస్త్రచికిత్స నిర్వహించనున్నారు.

ప్రైవసీని ఇవ్వాలని కోరుతున్నాం

"నుష్రత్ భరూచా బాలిలో ఒక ప్రాజెక్ట్ పనిమీద వెళ్లి, ఆ తర్వాత కొద్ది రోజులు అక్కడే ఉన్నారు. దురదృష్టవశాత్తూ ఆమె ప్రమాదానికి గురై ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ కష్ట సమయంలో ఆమె కుటుంబానికి, ఆమెకు కావలసిన ప్రైవసీని ఇవ్వాలని కోరుతున్నాం" అని నుష్రత్ పీఆర్ బృందం ఒక ప్రకటన విడుదల చేసింది.

కోలుకోవడానికి సమయం!

నుష్రత్ భరూచా త్వరగా కోలుకోవడానికి కొంతకాలం విశ్రాంతి అవసరమని, అభిమానులు చూపిస్తున్న ప్రేమాభిమానాలకు ధన్యవాదాలు తెలుపుతున్నామని ఆమె పీఆర్ టీమ్ పేర్కొంది.

కీలక ప్రాజెక్టులతో బిజీగా ఉన్న సమయంలో..

ఇకపోతే 'ప్యార్ కా పంచనామా', 'డ్రీమ్ గర్ల్', 'ఛోరీ', బెల్లంకొండ సాయి శ్రీనివాస్ ఛత్రపతి (హిందీ రీమేక్) వంటి విభిన్న చిత్రాలతో బాలీవుడ్‌లో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు నుష్రత్. ఇటీవల సోహమ్ షాతో కలిసి 'ఉఫ్ ఏ సియాపా' చిత్రంలో మెరిసిన ఆమె, ప్రస్తుతం యాక్షన్ హీరో టైగర్ ష్రాఫ్ సరసన ఒక భారీ ప్రాజెక్ట్‌లో నటించేందుకు సంతకం చేశారు.

టైగర్ ష్రాఫ్‌తో మొదటి సినిమా

టైగర్ ష్రాఫ్, నుష్రత్ కాంబినేషన్‌లో వస్తున్న మొదటి సినిమా ఇది. విక్కీ జైన్ 'విజె ఫ్రేమ్స్' బ్యానర్‌పై నిర్మిస్తున్న ఈ చిత్రంలో పష్మీనా రోషన్, అభిషేక్ బెనర్జీ, ఎల్విష్ యాదవ్ ఇతర ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. కథలో ఎంతో ప్రాధాన్యం ఉన్న, వైవిధ్యమైన పాత్రలో నుష్రత్ కనిపించనున్నారు.

షూటింగ్‌లపై ప్రభావం

సరిగ్గా ఈ సినిమా షూటింగ్ ప్రారంభం కానున్న తరుణంలో ఈ ప్రమాదం జరగడం, నుష్రత్ భరూచా కోలుకోవడానికి కొన్ని నెలల సమయం పట్టే అవకాశం ఉండటంతో రాబోయే సినిమాల షూటింగ్ షెడ్యూల్స్‌‌పై ప్రభావం పడనుంది.

  • Chetupelli Sanjiv Kumar
    ABOUT THE AUTHOR
    Chetupelli Sanjiv Kumar

    చెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్‌ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్‌సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.Read More