Paradise: ఏం ప్లాన్ చేస్తున్నావయ్యా ఓదెల.. నాని ప్యారడైజ్ క్లైమాక్స్‌లో చిరంజీవి..సినిమాటిక్ యూనివర్స్..మెగాస్టార్ మూవీ!

Paradise: వేరే లెవల్ మేకింగ్ తో, రా అండ్ రస్టిక్ టేకింగ్ తో ప్యారడైజ్ మూవీని శ్రీకాంత్ ఓదెల తెరకెక్కిస్తున్నాడు. నాని హీరోగా నటిస్తున్న ఈ మూవీ బాక్సాఫీస్ ను షేక్ చేసేందుకు రెడీ అవుతోంది. తాజాగా ఈ చిత్రంలో మెగాస్టార్ చిరంజీవి నటించనున్నారనే క్రేజీ బజ్ వైరల్ గా మారింది.

Published on: Jun 1, 2026, 13:10:18 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

Paradise: ఆయా షేర్ అంటూ యూట్యూబ్ ను షేక్ చేస్తున్నాడు నేచురల్ స్టార్ నాని. అతను హీరోగా నటిస్తున్న అప్ కమింగ్ మూవీ ‘ప్యారడైజ్’. దీనికి శ్రీకాంత్ ఓదెల డైరెక్టర్. నానితో దసరా లాంటి మాస్ బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిన శ్రీకాంత్ ఓదెల్.. ఇప్పుడు అంతకుమించి రా అండ్ రస్టిక్ గా ప్యారడైజ్ ను తెరకెక్కిస్తున్నాడు. అయితే ఈ మూవీ నుంచి లేటెస్ట్ బజ్ ఒకటి తెగ వైరల్ గా మారింది.

ప్యారడైజ్ లో చిరంజీవి క్యామియో ప్లాన్ చేస్తున్న శ్రీకాంత్ ఓదెల (x/odela_srikanth)
ప్యారడైజ్ లో చిరంజీవి క్యామియో ప్లాన్ చేస్తున్న శ్రీకాంత్ ఓదెల (x/odela_srikanth)

ప్యారడైజ్ లో చిరంజీవి

మెగాస్టార్ చిరంజీవికి శ్రీకాంత్ ఓదెల బిగ్ ఫ్యాన్. సినిమా అంటే చిరంజీవిదేనని, హీరో అంటే మెగాస్టార్ అనే నమ్మే అభిమాని అతను. ఇప్పటికే చాలా సార్లు సోషల్ మీడియా పోస్టుల ద్వారా తన అభిమానాన్ని చాటుకున్నాడు శ్రీకాంత్ ఓదెల. ఇప్పుడు ప్యారడైజ్ మూవీలో చిరంజీవితో క్యామియో కూడా ప్లాన్ చేశాడనే టాక్ చక్కర్లు కొడుతోంది.

మెగాస్టార్ తో సినిమా

మెగాస్టార్ చిరంజీవి- శ్రీకాంత్ ఓదెల్ కాంబినేషన్లో ఇప్పటికే ఓ మూవీ కన్ఫామ్ అయింది. ప్యారడైజ్ తర్వాత శ్రీకాంత్, బాబీ కొల్లి మూవీ తర్వాత చిరంజీవి కలిసి ఈ కొత్త సినిమాలను పట్టాలెక్కించనున్నారు. చిరంజీవితో మూవీని కూడా ఫుల్ మాాస్ యాక్షన్ ఎంటర్ టైనర్ గా శ్రీకాంత్ ప్లాన్ చేస్తున్నాడని తెలిసింది.

సినిమాటిక్ యూనివర్స్

ఇప్పుడు నాని ప్యారడైజ్ లో చిరంజీవితో క్లైమాక్స్ లో క్యామియో ప్లే చేయించాలన్నది శ్రీకాంత్ ఓదెల ప్లాన్ గా తెలుస్తోంది. ప్యారడైజ్ ను కేవలం ఒక చిత్రంగానే కాకుండా దీంతోనే తన సినిమాటిక్ యూనివర్స్ ను స్టార్ట్ చేయాలని శ్రీకాంత్ భావిస్తున్నట్లు టాక్. ఇప్పటికే యంగ్ డైరెక్టర్లు లోకేష్ కనగరాజ్, ప్రశాంత్ వర్మ తమ సినిమాటిక్ యూనివర్స్ ను స్టార్ట్ చేశారు.

మూవీతో లింక్

లోకష్, ప్రశాంత్ లాగే శ్రీకాంత్ కూడా తన సినిమాటిక్ యూనివర్స్ ను స్టార్ట్ చేయబోతున్నాడని ఫిల్మ్ నగర్ వర్గాలు చెప్తున్నాయి. ఈ యూనివర్స్ కు ప్యారడైజ్ మూవీతో పునాది పడనుందని అంటున్నారు. ఈ సినిమా క్లైమాక్స్ లో చిరంజీవితో ఎంట్రీ ఇప్పించి, తర్వాత మెగాస్టార్ తో చేయబోయే సినిమాను దీనికి లింక్ చేస్తాడని అంటున్నారు.

ప్యారడైజ్ గురించి

నాని హీరోగా శ్రీకాంత్ ఓదెల తెరకెక్కిస్తున్న రా అండ్ రస్టిక్ మాస్ ఎంటర్ టైనర్ గా ప్యారడైజ్ ఆగస్టు 21న రిలీజ్ కానుంది. ఈ మూవీలో కాయదు లోహర్ హీరోయిన్. ఇందులో మోహన్ బాబు విలన్ క్యారెక్టర్ ప్లే చేస్తున్నాడు. ఈ మూవీ నుంచి రిలీజైన ఆయా షేర్ సాంగ్ ఫాస్టెస్ట్ 150 మిలియన్ వ్యూస్ రికార్డు దక్కించుకుంది.

  • Chandu Shanigarapu
    ABOUT THE AUTHOR
    Chandu Shanigarapu

    చందు శనిగారపు ప్రస్తుతం హిందూస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ రైట‌ర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. మీడియా రంగంలో ఎనిమిదేళ్లకు పైగా అనుభవం ఆయన సొంతం. 2025 నుంచి డిజిటల్ మీడియాలోనూ తనదైన ముద్ర వేస్తున్నారు. సినిమా వార్తలను ఎప్పటికప్పుడు అందించడం, స్పోర్ట్స్ న్యూస్ ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలను చదివించేలా ఇవ్వడం ఆయన ప్రత్యేకత. మ్యాచ్ రిపోర్ట్ లను వేగంగా అందించడం, లైవ్ అప్ డేట్స్ ఇవ్వడంలో ఆయన ముందుంటారు. చందు తన కెరీర్ లో ప్రింట్ మీడియాలో ఎక్కువగా పనిచేశారు. ప్రముఖ దినపత్రిక ఈనాడులో ఏడేళ్లకు పైగా స్పోర్ట్స్ రిపోర్టర్ గా పనిచేశారు. తన ఆర్టికల్స్ తో ఎంతోమంది యువ క్రీడాకారుల ప్రతిభను వెలుగులోకి తెచ్చారు. ప్రత్యేక ఆర్టికల్స్ తో వాళ్లకు ఆర్థిక సాయం అందేలా చూశారు. క్రికెట్ ప్రపంచకప్ లు, ఒలింపిక్స్ లాంటి మెగా టోర్నీల కవరేజీలో ఆయనకు విశిష్ఠ అనుభవం ఉంది. మల్లారెడ్డి కాలేజీ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ నుంచి చందు బీటెక్ డిగ్రీ పొందారు. ఓ వైపు టెక్నికల్ నాలెడ్జ్ తో పాటు జర్నలిజంపై ప్రేమతో మీడియా రంగంలో కొనసాాగుతున్నారు. జర్నలిజంలో డిప్లొమా చేశారు. సినిమా వార్తలను, మూవీ రివ్యూలను, ఓటీటీ విషయాలను, క్రికెట్ సమాచారాన్ని, క్రీడా సంగతులను పాఠకులకు అందిస్తున్నారు.Read More