Srikanth Odela: నాచురల్ స్టార్ నాని, డైరెక్టర్ శ్రీకాంత్ ఓదెల కాంబినేషన్‌లో వస్తున్న మోస్ట్ అవైటెడ్ మాస్ యాక్షన్ డ్రామా 'ది పారడైజ్' కొన్ని గంటల్లో థియేటర్లలోకి రావడానికి సిద్ధమైంది. ఈ కీలక సమయంలో డైరెక్టర్ శ్రీకాంత్ ఓదెల సోషల్ మీడియాలో షేర్ చేసిన ఒక ఎమోషనల్ పోస్ట్ నెట్టింట విపరీతంగా వైరల్ అవుతోంది. సినిమాలో నాని కనిపించే పవర్‌ఫుల్ 'జడల' లుక్ వెనుక ఉన్న అసలు రహస్యాన్ని ఆయన బయటపెట్టారు.

శ్రీకాంత్ తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో చిన్ననాటి ఫోటోను షేర్ చేస్తూ చాలా హార్ట్ టచింగ్ నోట్ రాసుకొచ్చారు. ఈ పోస్ట్ చూసి నాని ఫ్యాన్స్ తో పాటు మూవీ లవర్స్ కూడా ఫిదా అవుతున్నారు.
"మా అమ్మ పెంచిన జడలే నా హీరోకి వేశా!"
శ్రీకాంత్ ఓదెల తన పోస్ట్‌లో రాస్తూ.. "జడల్ పుట్టుక, అతను చేసే పోరాటం ఫిక్షనల్ కావచ్చు. కానీ తన జడలు, ఓవరాల్ లుక్ మాత్రం నా చిన్నతనం నుంచి ఇన్‌స్పైర్ అయి డిజైన్ చేసిందే" అని తెలిపారు. సినిమాలో చాలా సీన్స్ తను పెరుగుతున్న క్రమంలో చూసిన రియల్ లైఫ్ సంఘటనల నుంచే తీసుకున్నట్లు చెప్పారు.
"నాకు 5 లేదా 6 ఏళ్లు వచ్చే వరకు మా అమ్మ నా జుట్టు పెంచి జడలు వేసేది. నేను కొంచెం పెద్దయ్యాక, 70MM బిగ్ స్క్రీన్ మీద ఒక కమర్షియల్ మాస్ హీరో ఇలా జడలతో ఉంటే ఎలా ఉంటుందో ఎప్పుడూ ఊహించుకునేవాన్ని. కట్ చేస్తే.. ఇప్పుడు నా హీరో నాని అన్నను అదే జడల గెటప్‌లో ప్రెజెంట్ చేస్తున్నా. ఈ పిక్చర్ కేవలం నా చిన్నతనం మాత్రమే కాదు.. ఇదే నా పారడైజ్" అంటూ శ్రీకాంత్ ఎమోషనల్ అయ్యారు.
'దసరా' బ్లాక్‌బస్టర్ తర్వాత నెక్స్ట్ లెవెల్ ప్రాజెక్ట్
గతంలో నాని, శ్రీకాంత్ ఓదెల కాంబోలో వచ్చిన 'దసరా' ఎంత పెద్ద బ్లాక్‌బస్టర్ హిట్ అయిందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. తెలంగాణ సింగరేణి బొగ్గు గనుల బ్యాక్‌డ్రాప్‌లో వచ్చిన ఆ మూవీ బాక్సాఫీస్ దగ్గర రూ. 100 కోట్లకు పైగా కలెక్షన్లు రాబట్టింది. ఇప్పుడు మళ్ళీ వీరిద్దరూ కాంబినేషన్ రిపీట్ చేస్తూ 'ది పారడైజ్'తో రాబోతున్నారు.
{{/usCountry}}గతంలో నాని, శ్రీకాంత్ ఓదెల కాంబోలో వచ్చిన 'దసరా' ఎంత పెద్ద బ్లాక్‌బస్టర్ హిట్ అయిందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. తెలంగాణ సింగరేణి బొగ్గు గనుల బ్యాక్‌డ్రాప్‌లో వచ్చిన ఆ మూవీ బాక్సాఫీస్ దగ్గర రూ. 100 కోట్లకు పైగా కలెక్షన్లు రాబట్టింది. ఇప్పుడు మళ్ళీ వీరిద్దరూ కాంబినేషన్ రిపీట్ చేస్తూ 'ది పారడైజ్'తో రాబోతున్నారు.
{{/usCountry}}ఈసారి 1980ల నాటి సికింద్రాబాద్ బ్యాక్‌డ్రాప్‌ను ఎంచుకున్నారు. కథలోని ఇంటెన్స్, రా అండ్ రస్టిక్ ఎలిమెంట్స్ కోసం నానిని సరికొత్త గెటప్‌లోకి మార్చేశారు. ఈ సినిమాలో నాని 'జడల జమానా' అనే పవర్‌ఫుల్ మాస్ క్యారెక్టర్‌లో కనిపించనున్నారు.
అనిరుధ్ మ్యూజిక్.. బాక్సాఫీస్ దగ్గర రికార్డుల వేట
ఈ భారీ బడ్జెట్ చిత్రాన్ని ఎస్‌ఎల్‌వి సినిమాస్ బ్యానర్‌పై సుధాకర్ చెరుకూరి నిర్మించారు. మ్యూజిక్ సెన్సేషన్ అనిరుధ్ రవిచందర్ అందిస్తున్న బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ ఈ సినిమాకి మెయిన్ హైలైట్ కానుంది. ఇప్పటికే రిలీజైన టీజర్, ట్రైలర్, సాంగ్స్ యూట్యూబ్‌లో మిలియన్ల వ్యూస్‌తో ట్రెండ్ అవుతున్నాయి.
ప్రీమియర్ షోల రెస్పాన్స్ చూస్తుంటే నాని కెరీర్‌లోనే బిగ్గెస్ట్ ఓపెనింగ్స్ రావడం ఖాయంగా కనిపిస్తోంది. చిన్నప్పటి కలని బిగ్ స్క్రీన్ మీద నిజం చేసుకున్న శ్రీకాంత్ ఓదెల, ఈ విజువల్ వండర్‌తో బాక్సాఫీస్ దగ్గర ఎలాంటి సునామీ సృష్టిస్తాడో చూడాలి.