Srinidhi Shetty Remuneration: కన్నడ రాకింగ్ స్టార్ యశ్ హీరోగా దర్శకుడు ప్రశాంత్ నీల్ తెరకెక్కించిన సంచలన చిత్రం 'కేజీఎఫ్' (KGF Chapter 1 & 2). ఈ ప్రాంచైజీతో రీనా పాత్రలో నటీమణి శ్రీనిధి శెట్టి రాత్రికి రాత్రే పాన్-ఇండియా స్టార్‌గా గుర్తింపు తెచ్చుకున్నారు. మొదటి సినిమాతోనే దేశవ్యాప్తంగా అపారమైన అభిమానులను సంపాదించుకున్న ఈ భామ.. ఆ తర్వాత ఎంతో జాగ్రత్తగా కథలను ఎంచుకుంటూ ముందుకు సాగుతున్నారు.

అయితే 'కేజీఎఫ్' సక్సెస్ తర్వాత శ్రీనిధి శెట్టి తన పారితోషికాన్ని విపరీతంగా పెంచేసిందని, ఒక్కో ప్రాజెక్ట్‌కు రూ. 7 కోట్ల నుంచి రూ. 8 కోట్ల వరకు డిమాండ్ చేస్తోందంటూ గత కొన్ని రోజులుగా సోషల్ మీడియాలోనూ, ఇండస్ట్రీ వర్గాల్లోనూ జోరుగా ప్రచారం సాగుతోంది. తాజాగా ఇచ్చిన ఒక ప్రత్యేక ఇంటర్వ్యూలో శ్రీనిధి శెట్టి ఈ ప్రచారంపై స్పందిస్తూ అసలు నిజాన్ని వెల్లడించారు. విక్టరీ వెంకటేష్, దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్‌లో వస్తున్న 'ఆదర్శ కుటుంబం హౌస్ నం: 47 - AK47' ప్రమోషన్ల సందర్భంగా ఆమె ఈ విషయాలను పంచుకున్నారు.
"డబ్బే నా ప్రాధాన్యత అయితే 30-40 సినిమాలు చేసేదాన్ని!"
తన రెమ్యునరేషన్ పై వస్తున్న వార్తలను పూర్తిగా ఖండించిన శ్రీనిధి శెట్టి మాట్లాడుతూ.. "కేజీఎఫ్ విజయాల తర్వాత నేను ప్రతి సినిమాకు రూ. 7 నుంచి 8 కోట్లు అడుగుతున్నానని ప్రచారం చేస్తున్నారు. నేను ఇప్పటివరకు నటించింది చాలా తక్కువ సినిమాల్లో మాత్రమే. అలాంటప్పుడు నేను అంత భారీ మొత్తాన్ని పారితోషికంగా ఎలా అడుగుతాను? అది కేవలం ఒక పుకారు మాత్రమే. ఒకవేళ కేవలం డబ్బు సంపాదించడమే నా ఏకైక లక్ష్యం అయి ఉంటే, గత కొన్నేళ్లలో నేను 30 నుంచి 40 సినిమాలు చేసి ఉండేదాన్ని. కానీ నేను ఎప్పుడూ డబ్బు కోసమే సినిమాలు చేయను. నాకు కథలోని బలం, నా పాత్ర నాణ్యత మాత్రమే ముఖ్యం" అని స్పష్టం చేశారు.
కేజీఎఫ్ తర్వాత విక్రమ్‌తో 'కోబ్రా', నానితో 'హిట్ 3: ది థర్డ్ కేస్', సిద్దు జొన్నలగడ్డతో 'తెలుసు కదా' చిత్రాలలో నటించి తెలుగు, తమిళ ప్రేక్షకుల హృదయాలను ఆమె కొల్లగొట్టారు.
'ఆదర్శ కుటుంబం హౌస్ నం: 47 (AK47)' కాంబినేషన్
{{/usCountry}}కేజీఎఫ్ తర్వాత విక్రమ్‌తో 'కోబ్రా', నానితో 'హిట్ 3: ది థర్డ్ కేస్', సిద్దు జొన్నలగడ్డతో 'తెలుసు కదా' చిత్రాలలో నటించి తెలుగు, తమిళ ప్రేక్షకుల హృదయాలను ఆమె కొల్లగొట్టారు.
'ఆదర్శ కుటుంబం హౌస్ నం: 47 (AK47)' కాంబినేషన్
{{/usCountry}}ప్రస్తుతం శ్రీనిధి శెట్టి తెలుగులో మోస్ట్ అవేటెడ్ ప్రాజెక్ట్ ‘ఆదర్శ కుటుంబం హౌస్ నం: 47 – AK47’లో హీరోయిన్ గా నటించారు. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో, హారిక అండ్ హాసిని క్రియేషన్స్ బ్యానర్‌పై ఎస్. రాధాకృష్ణ (చిన్నబాబు) ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.
విక్టరీ వెంకటేష్‌కి ఇది 77వ (Venky 77) మైలురాయి చిత్రం. ఇందులో నారా రోహిత్, నివేదా పేతురాజ్, యువినా పార్థవి కీలక పాత్రల్లో కనిపించనున్నారు. అక్టోబర్ 30న ఈ సినిమా థియేటర్లలోకి రానుంది.
తన పాత్ర గురించి శ్రీనిధి మాట్లాడుతూ.. "ఈ సినిమాలో నేను తొలిసారి డార్క్ కామెడీ పాత్రలో కనిపించబోతున్నాను. క్రైమ్, ఫ్యామిలీ ఎమోషన్స్, హ్యూమర్ పర్ఫెక్ట్‌గా మేళవించిన కథ ఇది. ప్రేక్షకులను ఇది ఖచ్చితంగా థ్రిల్ చేస్తుంది" అని నమ్మకం వ్యక్తం చేశారు.
ఇది కాకుండా, కన్నడలో ప్రసిద్ధ 'రంగీతరంగ' ఫేమ్ అనూప్ భండారీ దర్శకత్వంలో నిరూప్ భండారితో కలిసి ఒక భారీ సైన్స్ ఫిక్షన్ (Sci-Fi) థ్రిల్లర్ చిత్రంలో కూడా శ్రీనిధి శెట్టి నటిస్తున్నారు.