Srinivasa Mangapuram: ఘట్టమనేని ఫ్యామిలీ నుంచి మరో యంగ్ సెన్సేషన్ టాలీవుడ్ కు పరిచయం కాబోతున్నాడు. సూపర్ స్టార్ మహేష్ బాబు అన్న, దివంగత రమేష్ బాబు కొడుకు జయకృష్ణ ఘట్టమనేని హీరోగా ఎంట్రీ ఇస్తున్న మూవీ 'శ్రీనివాస మంగాపురం'. 'ఆర్ఎక్స్ 100' ఫేమ్ అజయ్ భూపతి డైరెక్షన్ లో తెరకెక్కిన ఈ సినిమా జులై 30న వరల్డ్ వైడ్ గా థియేటర్లలో గ్రాండ్ గా రిలీజ్ కాబోతోంది.
సోలో రిలీజ్ దొరకడంతో పెరిగిన అంచనాలు

ఈ జులై నెలఖారులో పెద్ద స్టార్ హీరోల సినిమాలు ఏవీ బాక్సాఫీస్ బరిలో లేవు. ఒక డెబ్యూ హీరోకి సోలో రిలీజ్ డేట్ దొరకడం అనేది కచ్చితంగా పెద్ద అడ్వాంటేజ్ అని చెప్పొచ్చు. ఈ క్రమంలో సినిమా మీద ఆడియన్స్ లో బజ్ మరింత పెంచడానికి మేకర్స్ గట్టిగా ప్రమోషన్స్ ప్లాన్ చేస్తున్నారు. అగ్రెసివ్ మార్కెటింగ్ తో యూత్ కు రీచ్ అయ్యేలా స్ట్రాటజీలు ప్లే చేస్తున్నారు.
సూపర్ స్టార్ కృష్ణ, మహేష్ బాబు, సుధీర్ బాబు, అశోక్ గల్లా.. ఇలా ఈ ఫ్యామిలీ నుంచి వచ్చిన హీరోలు తమకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. ఇప్పుడు ముచ్చటగా మూడో తరం నుంచి హీరోగా లాంచ్ అవుతున్న జయకృష్ణపై సూపర్ స్టార్ ఫ్యాన్స్ లో భారీ ఆశలు ఉన్నాయి.
విలన్ గా మోహన్ బాబు.. బ్యూటీ క్వీన్ రాషా డెబ్యూ
ఈ శ్రీనివాస మంగాపురం మూవీలో జయకృష్ణకు జోడీగా బాలీవుడ్ బ్యూటీ రాషా తడాని నటిస్తోంది. ఇప్పటికే తన గ్లామర్ తో నేషనల్ వైడ్ గా యూత్ ను ఎట్రాక్ట్ చేసిన రాషాకు ఇదే ఫస్ట్ స్ట్రెయిట్ తెలుగు ఫిల్మ్.
ఇక ఈ సినిమాలో కలెక్షన్ కింగ్ మోహన్ బాబు విలన్ గా నటించడం మూవీకి మరో పెద్ద అసెట్ అని చెప్పాలి. ఒకప్పుడు విలన్ గా టాలీవుడ్ ను షేక్ చేసిన మోహన్ బాబు.. చాలా గ్యాప్ తర్వాత మళ్లీ తన బ్రాండ్ విలనిజం చూపించబోతున్నాడు. హీరో, విలన్ మధ్య వచ్చే ఫేస్-ఆఫ్ సీన్స్ గూస్ బంప్స్ తెప్పిస్తాయని ఇండస్ట్రీ టాక్.
అజయ్ భూపతి రా అండ్ రస్టిక్ మేకింగ్
{{/usCountry}}ఇక ఈ సినిమాలో కలెక్షన్ కింగ్ మోహన్ బాబు విలన్ గా నటించడం మూవీకి మరో పెద్ద అసెట్ అని చెప్పాలి. ఒకప్పుడు విలన్ గా టాలీవుడ్ ను షేక్ చేసిన మోహన్ బాబు.. చాలా గ్యాప్ తర్వాత మళ్లీ తన బ్రాండ్ విలనిజం చూపించబోతున్నాడు. హీరో, విలన్ మధ్య వచ్చే ఫేస్-ఆఫ్ సీన్స్ గూస్ బంప్స్ తెప్పిస్తాయని ఇండస్ట్రీ టాక్.
అజయ్ భూపతి రా అండ్ రస్టిక్ మేకింగ్
{{/usCountry}}'ఆర్ఎక్స్ 100', 'మంగళవారం' లాంటి రా అండ్ రస్టిక్ హిట్స్ ఇచ్చిన అజయ్ భూపతి.. ఈసారి కూడా తన మార్క్ మిస్ కాకుండా చూసుకున్నాడు. స్క్రీన్ మీద ఒక అద్భుతమైన రొమాన్స్, ఫ్యామిలీ ఎమోషన్స్ కు తోడుగా హై-వోల్టేజ్ యాక్షన్ సీక్వెన్స్ తో ఈ సినిమాను చాలా పర్ఫెక్ట్ గా తెరకెక్కించాడట. జయకృష్ణ స్క్రీన్ ప్రెజెన్స్ చాలా కాన్ఫిడెంట్ గా ఉందని, రాషా తడాని ఎనర్జిటిక్ పెర్ఫార్మెన్స్ మూవీకి స్పెషల్ అట్రాక్షన్ అవుతుందని ఇన్ సైడ్ రిపోర్ట్స్ చెప్తున్నాయి.
'కల్కి 2898 AD' లాంటి గ్లోబల్ హిట్ ఇచ్చిన స్టార్ ప్రొడ్యూసర్ అశ్వినీదత్ ఈ సినిమాను సమర్పించడం ప్రాజెక్ట్ రేంజ్ ను పెంచేసింది. పి కిరణ్ నిర్మించిన ఈ పక్కా కమర్షియల్ ఎంటర్టైనర్ బాక్సాఫీస్ దగ్గర ఎలాంటి సెన్సేషన్ క్రియేట్ చేస్తుందో జులై 30న తేలిపోతుంది.