...
...
Next Story

స్టార్ మాలోకి మరో కొత్త సీరియల్.. తండ్రి లేని నలుగురు కూతుళ్ల కథ.. ఎమోషనల్ ప్రోమో రిలీజ్

స్టార్ మా ఛానెల్లోకి త్వరలోనే సరికొత్త సీరియల్ అడుగుపెట్టనుంది. లేని తండ్రి ప్రేమ కోసం ఆరాటపడే నలుగురు కూతుళ్ల చుట్టూ తిరిగే ఈ సీరియల్ ప్రోమోను గురువారం (ఫిబ్రవరి 5) స్టార్ మా రిలీజ్ చేసింది. ఇది చాలా ఎమోషనల్ గా సాగింది.

Published on: Feb 5, 2026, 18:57:09 IST
By , Hyderabad
Prefer HTon Google
Advertisement

తెలుగులో టాప్ సీరియల్స్ అందించే స్టార్ మా మరో సీరియల్ ను తీసుకొస్తోంది. ఈ సీరియల్ పేరు గోదావరి. తండ్రి లేని కుటుంబానికి ఓ ఆడబిడ్డే ఎలా పెద్ద దిక్కు అయింది అనే ఎమోషనల్ స్టోరీతో ఈ సీరియల్ ప్రేక్షకుల ముందుకు రానున్నట్లు ప్రోమో చూస్తే తెలుస్తోంది. మరి ఆ విశేషాలేంటో చూడండి.

గోదావరి సీరియల్ ప్రోమో

స్టార్ మాలోకి మరో కొత్త సీరియల్.. తండ్రి లేని నలుగురు కూతుళ్ల కథ.. ఎమోషనల్ ప్రోమో రిలీజ్
స్టార్ మాలోకి మరో కొత్త సీరియల్.. తండ్రి లేని నలుగురు కూతుళ్ల కథ.. ఎమోషనల్ ప్రోమో రిలీజ్

స్టార్ మాలోకి సరికొత్త సీరియల్ త్వరలోనే రాబోతోంది. తాజాగా ఆ ఛానెల్ ఈ సీరియల్ ప్రోమోను రిలీజ్ చేసింది. 3 నిమిషాల పాటు సాగిన ఈ ప్రోమో మొదట సరదాగా అనిపించినా.. చివరికి ఎమోషనల్ గా ముగిసింది. ఇది తండ్రి లేని నలుగురు కూతుళ్ల చుట్టూ తిరిగే కథలా అనిపిస్తోంది. ఆ కుటుంబానికి జాహ్నవి అనే రెండో కూతురే పెద్ద దిక్కుగా ఉంటుంది. ఈ ప్రోమోలో ఆ తండ్రే తన నలుగురు కూతుళ్లను పరిచయం చేస్తున్నట్లుగా చూపించారు.

మొదట అమెరికా సంబంధం అంటే చాలు పెళ్లికి రెడీ అయిపోయే మొదటి కూతురిని, తర్వాత జీవితంలో ఏం చేయాలో తెలియని మూడో కూతురిని చూపిస్తారు. ఆ తర్వాత కుటుంబ భారాన్ని మోస్తున్న రెండో కూతురు జాహ్నవిని పరిచయం చేశారు. చివరిగా అనారోగ్యంతో బాధపడుతున్న తన నాలుగో కూతురిని ఆ తండ్రి చూపిస్తాడు. కానీ నిజానికి ఆ తండ్రే వాళ్ల జీవితాల్లో లేడని ప్రోమో చివర్లో చెప్పడం ప్రేక్షకులను భావోద్వేగానికి గురి చేస్తుంది.

గోదావరి సీరియల్ విశేషాలు

గోదావరి సీరియల్ టెలికాస్ట్ తేదీని స్టార్ మా వెల్లడించలేదు. అయితే త్వరలోనే రానుందని మాత్రం చెప్పింది. ఇందులో ఆ తండ్రి పాత్రలో సీనియర్ నటుడు రాజా రవీంద్ర నటించడం విశేషం. ఇక అతడు కాకుండా అనుమిత దత్త, గంటా మౌనిక, మధురిమ, సంధ్య వరలక్ష్మిలాంటి వాళ్లు నటించారు.

 
ABOUT THE AUTHOR
Hari Prasad S

హరి ప్రసాద్ శీలమంతుల ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. మీడియా రంగంలో 20 ఏళ్లకు పైగా సుదీర్ఘ అనుభవం కలిగిన ఆయన, డిజిటల్ మీడియాలో గత 10 ఏళ్లుగా విశేష సేవలందిస్తున్నారు. ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలు, సినిమా వార్తలను అందించడంలో ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఆయన తన అద్భుతమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. హరి ప్రసాద్ తన కెరీర్‌లో ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా వంటి మూడు ప్రధాన విభాగాల్లోనూ పనిచేశారు. హిందుస్థాన్ టైమ్స్‌లో చేరకముందు, ఆయన తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ దినపత్రికలు, టీవీ ఛానెళ్లయిన ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి వంటి సంస్థలలో కీలక బాధ్యతలు నిర్వహించారు. నవంబర్ 1, 2021న హిందుస్థాన్ టైమ్స్ తెలుగు టీమ్‌లో చేరిన ఆయన.. ప్రస్తుతం స్పోర్ట్స్ (ముఖ్యంగా క్రికెట్ అనాలసిస్), ఎంటర్‌టైన్మెంట్ సెక్షన్ల బాధ్యతలను చూసుకుంటున్నారు. ఈయన ఉస్మానియా యూనివర్సిటీ నుంచి బీఎస్సీ (కంప్యూటర్ సైన్స్) పట్టా పొందారు. సాంకేతిక పరిజ్ఞానంతో పాటు జర్నలిజంపై ఉన్న మక్కువతో జర్నలిజంలో డిప్లొమా పూర్తి చేసి, వృత్తిపరమైన నైపుణ్యాలను మెరుగుపరుచుకున్నారు. క్రీడా రంగంలో వస్తున్న మార్పులను, సినిమా ఇండస్ట్రీ అప్‌డేట్స్‌ను లోతుగా విశ్లేషించి పాఠకులకు అర్థమయ్యే రీతిలో అందించడం హరి ప్రసాద్ శైలి.

SHARE THIS ARTICLE ON
Notifications

Get breaking alerts directly from the newsroom

Notifications are on!You'll be notified when news breaks