మరోసారి గర్భవతినంటూ సీరియల్ హీరోయిన్ షాకింగ్ వీడియో- భర్తను ట్యాగ్ చేయకపోవడంతో రుబీనా దిలైక్‌పై అనుమానాలు!
బుల్లితెర హీరోయిన్ రుబీనా దిలైక్ తాను గర్భవతినంటూ సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన షాకింగ్ వీడియో ఇప్పుడు నెట్టింట హాట్ టాపిక్ అయింది. కవల పిల్లలు జన్మించిన రెండేళ్లకే ఆమె ఈ ప్రకటన చేయడంతో అభిమానులు అయోమయంలో పడ్డారు. భర్తను ట్యాగ్ చేయకపోవడంపై అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు నెటిజన్స్.
బుల్లితెర ప్రేక్షకులకు సుపరిచితురాలైన సీరియల్ హీరోయిన్ రుబీనా దిలైక్ సోషల్ మీడియాలో షేర్ చేసిన ఒక చిన్న వీడియో ఇప్పుడు పెద్ద చర్చకు దారితీసింది. తన భర్త అభినవ్ శుక్లాతో కలిసి ఇప్పటికే ఇద్దరు కవల కుమార్తెలకు జన్మనిచ్చిన రుబీనా.. తాజాగా తాను మళ్లీ గర్భవతినంటూ ప్రకటించి అందరినీ ఆశ్చర్యపరిచారు. అయితే, ఈ ప్రకటన వెనుక ఉన్న అసలు ఉద్దేశం ఏంటన్నది ఇప్పుడు మిస్టరీగా మారింది.

అయోమయంలో ఫ్యాన్స్: అసలేం జరిగింది?
బుధవారం (జనవరి 28) రుబీనా తన ఇన్‌స్టాగ్రామ్ స్టోరీస్‌లో ఒక వీడియోను పోస్ట్ చేశారు. ప్రింటెడ్ శారీలో ఎంతో అందంగా కనిపిస్తున్న రుబీనా, కెమెరా వైపు తిరిగి చిరునవ్వు చిందిస్తూ.. "నేను గర్భవతిని" (I am pregnant) అని చెప్పారు.
అంతటితో ఆ వీడియో ఒక్కసారిగా ఆగిపోయింది. దీనికి సంబంధించి రుబీనా దిలైక్ ఎలాంటి అదనపు సమాచారం ఇవ్వలేదు సరికదా కనీసం తన భర్త అభినవ్ శుక్లాను కూడా ట్యాగ్ చేయలేదు. దీంతో నెటిజన్లు రకరకాలుగా స్పందిస్తున్నారు.
మనం అనుకుంటున్న ప్రెగ్నెన్సీ కాదేమో
"ఇది నిజమేనా?" అని ఒకరు ప్రశ్నించగా.. "నాకెందుకో ఇది మనం అనుకుంటున్న ప్రెగ్నెన్సీ కాదనిపిస్తోంది, దీని వెనుక ఏదో మతలబు ఉంది" అని మరొకరు అనుమానం వ్యక్తం చేశారు. ఇది ఏదైనా కొత్త షో లేదా బ్రాండ్ ప్రమోషన్ కోసం చేస్తున్న పబ్లిసిటీ స్టంట్ కావచ్చని మెజారిటీ నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు.
"రుబీనా ఎప్పుడూ ఇలాంటి వ్యక్తిగత విషయాలను ఇంత అరకొరగా చెప్పదు.. కచ్చితంగా ఏదో కొత్త ప్రాజెక్ట్ వస్తోంది" అని రుబీనా దిలైక్ అభిమానులు కామెంట్స్ చేస్తున్నారు. మరికొందరైతే ఆమె సోదరి గర్భవతి ఏమో అని కూడా అంచనా వేస్తున్నారు.
రుబీనా - అభినవ్ ప్రయాణం
రుబీనా దిలైక్, అభినవ్ శుక్లా 2018 జూన్‌లో సిమ్లాలో వివాహం చేసుకున్నారు. సుదీర్ఘ నిరీక్షణ తర్వాత 2023 సెప్టెంబర్‌లో తాము తల్లిదండ్రులం కాబోతున్నట్లు ప్రకటించారు. అదే ఏడాది డిసెంబర్ 27న తమకు కవల కుమార్తెలు జీవా, ఈధా జన్మించినట్లు వెల్లడించారు రుబీనా దంపతులు.
గతేడాది అక్టోబర్‌లో నవరాత్రి సందర్భంగా మొదటిసారిగా తమ పిల్లల ముఖాలను ప్రపంచానికి పరిచయం చేశారు రుబీనా దిలైక్, అభినవ్ శుక్లా. ఇప్పుడు కవలలు జన్మించిన రెండేళ్లకే మళ్లీ రుబీనా గర్భవతి అని చెప్పడం పట్ల నెటిజన్స్ అనుమానం వ్యక్తం చేస్తున్నారు.
ABOUT THE AUTHORChetupelli Sanjiv Kumarచెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్‌ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్‌సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.Read More

E-Paper


