స్టార్ మాలో 100 రోజులకుపైగా అలరిస్తున్న బిగ్ బాస్ తెలుగు 9వ సీజన్ ముగింపుకు వచ్చేసింది. ఈ ఆదివారం (డిసెంబర్ 21) గ్రాండ్ ఫినాలేతో 107 రోజుల ఈ రియాల్టీ షో ముగియనుంది. దీంతో మరుసటి రోజు నుంచే అంటే డిసెంబర్ 22 నుంచి ఆ షో వచ్చే సమయానికే స్టార్ మా నువ్వు లేక నేను లేను అనే కొత్త సీరియల్ నుంచి టెలికాస్ట్ చేయనుంది.
నువ్వు లేక నేను లేను టెలికాస్ట్ టైమ్ ఇదే

బిగ్ బాస్ 9వ సీజన్ ప్రారంభమైనప్పటి నుంచీ వీక్ డేస్ లో రాత్రి 9.30 గంటలకు, వీకెండ్స్ లో 9 గంటలకు టెలికాస్ట్ అయిన విషయం తెలిసిందే. కొన్ని రోజులుగా ఈ సమయాన్ని రాత్రి 10 గంటలకు మార్చారు. ఇప్పుడు గ్రాండ్ ఫినాలేతో ఈ షో ముగిసిన తర్వాత సోమవారం (డిసెంబర్ 22) నుంచి ఈ సమయానికి నువ్వు లేక నేను లేను అనే సీరియల్ రానుంది.
సోమవారం నుంచి శుక్రవారం వరకు ప్రతి రోజు రాత్రి 10 గంటలకు ఈ సీరియల్ ప్రసారం అవుతుంది. ఈ విషయాన్ని స్టార్ మా బుధవారం (డిసెంబర్ 17) ఎక్స్ ద్వారా వెల్లడించింది. “రాధాకృష్ణుల ప్రయాణం మీ ముందుకు త్వరలో.. నువ్వు లేక నేను లేను డిసెంబర్ 22 నుంచి సోమవారం నుంచి శుక్రవారం వరకు రాత్రి 10 గంటలకు స్టార్ మాలో” అనే క్యాప్షన్ తో ట్వీట్ చేసింది.
నువ్వు లేక నేను లేను సీరియల్ గురించి..
తెలుగులో సుమారు 23 ఏళ్ల కిందట వచ్చిన నువ్వు లేక నేను లేను సినిమా టైటిల్ తో కొత్త సీరియల్ రానుంది. కొన్ని రోజుల కిందటే ఈ సీరియల్ గురించి ఆ ఛానెల్ అనౌన్స్ చేసింది.
స్టార్ మాలోకి రాబోతున్న ఈ కొత్త సీరియల్ కన్నడలో వచ్చిన నిన్నా జోతే నన్న కథే అనే సీరియల్ కు రీమేక్ కావడం విశేషం. ఇది ఓ యువ జంట చుట్టూ తిరిగే స్టోరీ. తనకు కాబోయే భార్యను కంటికి రెప్పలా చూసుకుంటానని మాట ఇచ్చే అబ్బాయి.. ఆమెకు పెళ్లి పీటలపై షాకిస్తాడు. ఈ పెళ్లి కేవలం ఏడాది వరకే అని, అలా అని కాంట్రాక్టుపై సంతకం చేయాలని అంటాడు. ఆ మాట విని షాక్ తనే అమ్మాయి.. కష్టాల్లో ఉన్న తన తండ్రిని గుర్తు చేసుకుంటూ అతని కోసం ఏదైనా చేస్తాననుకొని సంతకం పెడుతుంది.
{{/usCountry}}స్టార్ మాలోకి రాబోతున్న ఈ కొత్త సీరియల్ కన్నడలో వచ్చిన నిన్నా జోతే నన్న కథే అనే సీరియల్ కు రీమేక్ కావడం విశేషం. ఇది ఓ యువ జంట చుట్టూ తిరిగే స్టోరీ. తనకు కాబోయే భార్యను కంటికి రెప్పలా చూసుకుంటానని మాట ఇచ్చే అబ్బాయి.. ఆమెకు పెళ్లి పీటలపై షాకిస్తాడు. ఈ పెళ్లి కేవలం ఏడాది వరకే అని, అలా అని కాంట్రాక్టుపై సంతకం చేయాలని అంటాడు. ఆ మాట విని షాక్ తనే అమ్మాయి.. కష్టాల్లో ఉన్న తన తండ్రిని గుర్తు చేసుకుంటూ అతని కోసం ఏదైనా చేస్తాననుకొని సంతకం పెడుతుంది.
{{/usCountry}}ఆ తర్వాత ఇద్దరి పెళ్లి జరుగుతుంది. వీళ్ల బంధం ఏడాదికే పరిమితమవుతుందా లేక జీవితాంతం కొనసాగుతుందా అనే ప్రశ్నతో సీరియల్ ప్రోమోను ముగించారు. ఈ సీరియల్లో నిషా పొద్దార్, నవీన్ లీడ్ రోల్స్ లో నటిస్తున్నారు. తమిళ నటుడు నవీన్ కు ఇదే తొలి తెలుగు సీరియల్. ఈ నువ్వు లేక నేను లేను సీరియల్ డిసెంబర్ 22 నుంచి స్టార్ మాలో ప్రసారం కానుంది.