...
...
Next Story

Star Maa New Serial: స్టార్ మాలోకి సరికొత్త సీరియల్.. పాతికేళ్ల తర్వాత తల్లిని వెతుక్కుంటూ కూతురు వస్తే..

Star Maa New Serial: స్టార్ మాలోకి సరికొత్త సీరియల్ రాబోతోంది. ఈ సీరియల్ పేరు ఏ దేవి వరమో నీవు. తాజాగా సోమవారం (ఏప్రిల్ 20) ఈ సీరియల్ ప్రోమోను ఆ ఛానెల్ రిలీజ్ చేసింది. అంజలి అనే ఓ అమ్మాయి చుట్టూ తిరిగే కథతో ఈ సీరియల్ వస్తోంది.

Published on: Apr 20, 2026, 17:11:29 IST
By , Hyderabad
Prefer HTon Google
Advertisement

Star Maa New Serial: స్టార్ మా ఛానెల్లో వచ్చే సీరియల్స్ కు తెలుగు వాళ్లలో ఎంత క్రేజ్ ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. టీఆర్పీ రేటింగ్స్ లో టాప్ 10లో ఆరు ఆ ఛానెల్ కు చెందినవే. అలాంటి ఛానెల్ నుంచి ఇప్పుడు మరో కొత్త సీరియల్ రాబోతోంది. ఈ సీరియల్ పేరు ఏ దేవి వరమో నీవు. ఈ సీరియల్ విశేషాలు ఇక్కడ చూడండి.

ఏ దేవి వరమో నీవు సీరియల్ ప్రోమో

Star Maa New Serial: స్టార్ మాలోకి సరికొత్త సీరియల్.. పాతికేళ్ల తర్వాత తల్లిని వెతుక్కుంటూ కూతురు వస్తే..
Star Maa New Serial: స్టార్ మాలోకి సరికొత్త సీరియల్.. పాతికేళ్ల తర్వాత తల్లిని వెతుక్కుంటూ కూతురు వస్తే..

స్టార్ మా నుంచి వస్తున్న మరో ఇంట్రెస్టింగ్ సీరియల్ ఏ దేవి వరమో నీవు. ఈ ఛానెల్ నుంచి ఈ కొత్త సీరియల్ వస్తున్న తెలుగు ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురు చూస్తుంటారు. అందుకు తగినట్లే ఈ కొత్త సీరియల్ ప్రోమో కూడా ఉంది.

“భవిష్యత్తుని వెతుక్కుంటూ వచ్చిన కూతురు… తల్లి 25 ఏళ్ల ప్రశాంతతను కల్లోలంగా మారుస్తుందా? సరికొత్త సీరియల్ ఏ దేవి వరమో నీవు” అనే క్యాప్షన్ తో ప్రోమోను ట్వీట్ చేసింది.

అంజలి చుట్టూ తిరిగే కథ

ఈ కొత్త సీరియల్ అంజలి అనే అమ్మాయి చుట్టూ తిరగనుంది. స్టార్ మా పోస్ట్ చేసిన ప్రోమోలో శబరి అనాథాశ్రమం చూపించారు. అందులో అంజలి అనే అమ్మాయి.. మిగిలిన అనాథ పిల్లలతో సరదాగా గడుపుతూ ఉంటుంది. తనకు తాను మహారాణిగా ఊహించుకుంటూ రాజ్యంలో సమస్యలు ఏంటని అడుగుతుంది. రోజూ ఉప్మానే పెడుతున్నారని పిల్లలు ఫిర్యాదు ఇస్తారు. మీకోసం లడ్డూలు తెచ్చానంటూ.. ఉప్మాతో చేసిన లడ్డూలను చూపించి ఉసూరుమనిపిస్తుంది.

ఇలా సరదాగా సాగిపోతుండగా.. ఆ అనాథాశ్రమంలోకి కొందరు రౌడీలు ఎంటరవుతారు. వెంటనే దీనిని ఖాళీ చేయాలని బెదిరించి వెళ్లిపోతారు. దీంతో ఆ అనాథాశ్రమాన్ని నడుపుతున్న పెద్దావిడ దిగులు పడుతుంది. అప్పుడే అంజలికి ఆమె ఓ నిజం చెబుతుంది. నీకు ఓ కుటుంబం ఉందని, ఈ అడ్రెస్ కు వెళ్లమంటూ ఆమెను అక్కడి నుంచి పంపిస్తుంది. ఆ ఇంటికి వెళ్తే అంజలి తల్లి కనిపిస్తుంది. అయితే ఆమె రాకతో 25 ఏళ్లుగా ప్రశాంతంగా ఉన్న ఆ తల్లి జీవితం కల్లోలమవుతుందా అన్న వాయిస్ ఓవర్ ఈ సీరియల్ కథపై ఆసక్తి రేపుతోంది.

 
ABOUT THE AUTHOR
Hari Prasad S

హరి ప్రసాద్ శీలమంతుల ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. మీడియా రంగంలో 20 ఏళ్లకు పైగా సుదీర్ఘ అనుభవం కలిగిన ఆయన, డిజిటల్ మీడియాలో గత 10 ఏళ్లుగా విశేష సేవలందిస్తున్నారు. ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలు, సినిమా వార్తలను అందించడంలో ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఆయన తన అద్భుతమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. హరి ప్రసాద్ తన కెరీర్‌లో ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా వంటి మూడు ప్రధాన విభాగాల్లోనూ పనిచేశారు. హిందుస్థాన్ టైమ్స్‌లో చేరకముందు, ఆయన తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ దినపత్రికలు, టీవీ ఛానెళ్లయిన ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి వంటి సంస్థలలో కీలక బాధ్యతలు నిర్వహించారు. నవంబర్ 1, 2021న హిందుస్థాన్ టైమ్స్ తెలుగు టీమ్‌లో చేరిన ఆయన.. ప్రస్తుతం స్పోర్ట్స్ (ముఖ్యంగా క్రికెట్ అనాలసిస్), ఎంటర్‌టైన్మెంట్ సెక్షన్ల బాధ్యతలను చూసుకుంటున్నారు. ఈయన ఉస్మానియా యూనివర్సిటీ నుంచి బీఎస్సీ (కంప్యూటర్ సైన్స్) పట్టా పొందారు. సాంకేతిక పరిజ్ఞానంతో పాటు జర్నలిజంపై ఉన్న మక్కువతో జర్నలిజంలో డిప్లొమా పూర్తి చేసి, వృత్తిపరమైన నైపుణ్యాలను మెరుగుపరుచుకున్నారు. క్రీడా రంగంలో వస్తున్న మార్పులను, సినిమా ఇండస్ట్రీ అప్‌డేట్స్‌ను లోతుగా విశ్లేషించి పాఠకులకు అర్థమయ్యే రీతిలో అందించడం హరి ప్రసాద్ శైలి.

SHARE THIS ARTICLE ON
Notifications

Get breaking alerts directly from the newsroom

Notifications are on!You'll be notified when news breaks