Star Maa Serials: స్టార్ మా సీరియల్స్ ఇక ప్రతి రోజూ.. సోమవారం నుంచి ఆదివారం వరకు అన్ని టాప్ సీరియల్స్.. కొత్త టైమింగ్స్

Star Maa Serials: స్టార్ మా సీరియల్స్ లవర్స్ కు అదిరిపోయే గుడ్ న్యూస్. ఇక నుంచి ప్రతి రోజూ ఈ సీరియల్స్ టెలికాస్ట్ కానున్నాయి. స్టార్ మాలో సాయంత్రం 6 నుంచి రాత్రి 10 గంటల మధ్య వచ్చే ప్రైమ్ టైమ్ సీరియల్స్ సోమవారం నుంచి ఆదివారం వరకు ప్రసారం చేయనున్నట్లు ఆ ఛానెల్ వెల్లడించింది.

Published on: Aug 13, 2026, 16:06:43 IST
By , Hyderabad
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

Star Maa Serials: బుల్లితెర ప్రియులకు ప్రముఖ వినోద ఛానెల్ 'స్టార్ మా' కళ్లు చెదిరే శుభవార్త అందించింది. ఆగస్టు 15 ఇండిపెండెన్స్ డే సందర్భంగా సాయంత్రం 6 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు ప్రైమ్‌టైమ్ స్లాట్‌లో హై-వోల్టేజ్ సీరియల్స్‌తో నాన్‌స్టాప్ ఎంటర్‌టైన్‌మెంట్ ప్లాన్ చేసింది. ప్రతీ రోజూ థ్రిల్లింగ్ ట్విస్ట్‌లు, ఎమోషనల్ కథనాలతో ప్రేక్షకులను ఆకట్టుకోవడానికి సరికొత్త షెడ్యూల్ అనౌన్స్ చేస్తూ అధికారిక ప్రకటన విడుదల చేసింది.

Star Maa Serials: స్టార్ మా సీరియల్స్ ఇక ప్రతి రోజూ.. సోమవారం నుంచి ఆదివారం వరకు అన్ని టాప్ సీరియల్స్.. కొత్త టైమింగ్స్
Star Maa Serials: స్టార్ మా సీరియల్స్ ఇక ప్రతి రోజూ.. సోమవారం నుంచి ఆదివారం వరకు అన్ని టాప్ సీరియల్స్.. కొత్త టైమింగ్స్

సాయంత్రం 6 నుంచి 10 వరకు.. ఇక నాన్‌స్టాప్ ట్విస్ట్‌ల జాతరే

తెలుగు బుల్లితెరపై టీఆర్‌పీ (TRP) చాట్‌లో నంబర్ వన్ పొజిషన్‌లో దూసుకుపోతున్న స్టార్ మా ఛానెల్.. తమ సాయంత్రం ప్రైమ్‌టైమ్ స్లాట్‌ను మరింత కలర్‌ఫుల్‌గా మార్చేసింది. ఆగస్టు 15 నుంచి సాయంత్రం 6 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు ఉండే నాలుగు గంటల సమయాన్ని 'ప్రైమ్‌టైమ్ పండుగ'గా తీర్చిదిద్దింది.

ఈ కొత్త షెడ్యూల్ ద్వారా బుల్లితెర వీక్షకులకు ప్రతీ రోజూ అదిరిపోయే డ్రామా, సస్పెన్స్, లవ్, ఎమోషనల్ సీన్లతో సాగే సీరియల్స్ అందుబాటులోకి రానున్నాయి. సాయంత్రం టీ టైమ్ నుంచి రాత్రి డిన్నర్ టైమ్ వరకు కుటుంబ సమేతంగా ఆస్వాదించేలా విభిన్నమైన సీరియల్స్‌ను ఈ స్లాట్‌లో లైన్‌అప్ చేశారు.

టాప్ టీఆర్‌పీ సీరియల్స్‌తో పోటీ వాతావరణం

ప్రస్తుతం స్టార్ మాలో ప్రైమ్ టైమ్ లో టెలికాస్ట్ అవుతున్న సీరియల్సే టీఆర్పీల్లోనూ అగ్రస్థానాల్లో ఉంటున్నాయి. వీటిని మరింతగా ప్రేక్షకులకు దగ్గర చేసి తిరుగులేని ఆధిపత్యాన్ని కొనసాగించాలని స్టార్ మా భావిస్తున్నట్లు కనిపిస్తోంది. అందులో భాగంగానే మొత్తం 8 సీరియల్స్ ను ఇక నుంచి సోమవారం నుంచి ఆదివారం వరకు గ్యాప్ లేకుండా టెలికాస్ట్ చేయబోతున్నారు. స్టార్ మా కొత్తగా రిలీజ్ చేసిన షెడ్యూల్ ఎలా ఉందో చూడండి.

6 నుంచి 10 వరకు నాన్ స్టాప్ ఎంటర్టైన్మెంట్

సాయంత్రం 6 గంటలకు: ఇంటింటి రామాయణం (సోమ నుంచి ఆది వరకు)

సాయంత్రం 6.30 గంటలకు: గోదావరి (సోమ నుంచి ఆది వరకు)

సాయంత్రం 7 గంటలకు: నువ్వు లేక నేను లేను (సోమ నుంచి ఆది వరకు)

రాత్రి 7.30 గంటలకు: ఇల్లు ఇల్లాలు పిల్లలు (సోమ నుంచి ఆది వరకు)

రాత్రి 8 గంటలకు: కార్తీక దీపం 2 (సోమ నుంచి ఆది వరకు)

రాత్రి 8.30 గంటలకు: ఏ దేవి వరమో నీవు (సోమ నుంచి ఆది వరకు)

రాత్రి 9 గంటలకు: గుండె నిండా గుడి గంటలు (సోమ నుంచి ఆది వరకు)

రాత్రి 9.30 గంటలకు: పొదరిల్లు (సోమ నుంచి ఆది వరకు)

ఛానెళ్ల మధ్య రసవత్తరంగా మారిన టీఆర్‌పీ వార్

తెలుగు టెలివిజన్ రంగంలో ఇతర ఛానెళ్ల నుంచి వస్తున్న పోటీని తట్టుకుని నంబర్ వన్ స్థానాన్ని పటిష్టం చేసుకోవడంలో స్టార్ మా ఎప్పుడూ ముందుంటుంది. సాయంత్రం 6 గంటల నుంచే ప్రైమ్‌టైమ్ డోస్ పెంచడం ద్వారా ఇతర ఛానెళ్లకు గట్టి సవాల్ విసిరినట్లయింది.

ఈ కొత్త అనౌన్స్‌మెంట్ సోషల్ మీడియాలో విపరీతంగా ట్రెండ్ అవుతోంది. ప్రైమ్‌టైమ్‌లో సీరియల్స్ గ్యాప్ లేకుండా ప్రసారం కానుండటంతో గృహిణులు, సీరియల్ లవర్స్ హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే టాప్ 10 సీరియల్స్ లో సగానికిపైగా స్టార్ మా ఛానెల్ కు చెందినవే ఉన్నాయి. తాజాగా వీటిని ప్రతి రోజూ టెలికాస్ట్ చేయనుండటంతో ఆ ఆధిపత్యం మరింత పెరగనుంది.

  • Hari Prasad S
    ABOUT THE AUTHOR
    Hari Prasad S

    హరి ప్రసాద్ శీలమంతుల ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. మీడియా రంగంలో 20 ఏళ్లకు పైగా సుదీర్ఘ అనుభవం కలిగిన ఆయన, డిజిటల్ మీడియాలో గత 10 ఏళ్లుగా విశేష సేవలందిస్తున్నారు. ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలు, సినిమా వార్తలను అందించడంలో ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఆయన తన అద్భుతమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. హరి ప్రసాద్ తన కెరీర్‌లో ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా వంటి మూడు ప్రధాన విభాగాల్లోనూ పనిచేశారు. హిందుస్థాన్ టైమ్స్‌లో చేరకముందు, ఆయన తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ దినపత్రికలు, టీవీ ఛానెళ్లయిన ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి వంటి సంస్థలలో కీలక బాధ్యతలు నిర్వహించారు. నవంబర్ 1, 2021న హిందుస్థాన్ టైమ్స్ తెలుగు టీమ్‌లో చేరిన ఆయన.. ప్రస్తుతం స్పోర్ట్స్ (ముఖ్యంగా క్రికెట్ అనాలసిస్), ఎంటర్‌టైన్మెంట్ సెక్షన్ల బాధ్యతలను చూసుకుంటున్నారు. ఈయన ఉస్మానియా యూనివర్సిటీ నుంచి బీఎస్సీ (కంప్యూటర్ సైన్స్) పట్టా పొందారు. సాంకేతిక పరిజ్ఞానంతో పాటు జర్నలిజంపై ఉన్న మక్కువతో జర్నలిజంలో డిప్లొమా పూర్తి చేసి, వృత్తిపరమైన నైపుణ్యాలను మెరుగుపరుచుకున్నారు. క్రీడా రంగంలో వస్తున్న మార్పులను, సినిమా ఇండస్ట్రీ అప్‌డేట్స్‌ను లోతుగా విశ్లేషించి పాఠకులకు అర్థమయ్యే రీతిలో అందించడం హరి ప్రసాద్ శైలి.Read More